ETV Bharat / entertainment

సూపర్ హిట్ 'జో' కాంబో రిపీట్​ - ఈ సారి ఎలాంటి కథతో అంటే? - Joe Movie

author img

By ETV Bharat Telugu Team

Published : May 4, 2024, 10:14 AM IST

JOE movie Hero Heroine : గతేడాదిలో ఎలాంటి అంచనాలు లేకుండా కోలీవుడ్‌తో పాటు తెలుగులో రిలీజై సూపర్ హిట్ అందుకున్న చిత్రం జో. తాజాగా ఈ సినిమాలోని హీరోహీరోయిన్​ కాంబినేషన్ మరోసారి తెరపైకి సందడి చేసేందుకు సిద్ధమైందని తెలుస్తోంది. పూర్తి వివరాలు స్టోరీలో.

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

JOE movie Hero Heroine : గతేడాదిలో ఎలాంటి అంచనాలు లేకుండా కోలీవుడ్‌లో రిలీజైన పక్కా లవ్​ స్టోరీ మూవీ జో. ప్రముఖ ఓటీటీ ప్లాట్​ ఫామ్​ హాట్‌ స్టార్​లో తెలుగులోనూ స్ట్రీమింగ్‌ అయి మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ చిత్రాన్ని చూసిన తెలుగు ప్రేక్షకులంతా సినిమాలోని ప్రేమ కథకు బాగా కనెక్ట్ అయిపోయారు. సాంగ్స్ కూడా బాగా ట్రెండ్ అయ్యాయి. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ సినిమా సీన్స్​, సాంగ్సే కనిపించాయి. ఈ చిత్రంలో రియో రాజ్, మాళవిక మనోజ్‌ హీరోహీరోయిన్లుగా నటించారు. భవ్య ట్రిక మరో హీరోయిన్​గా నటించింది. ఈ ముగ్గురి నేచురల్ పెర్​ఫార్మెన్స్​కు ఆడియెన్స్​ ఫుల్​ మార్క్స్​ వేశారు.

అయితే తాజాగా కోలీవుడ్‌లో ఈ రియో రాజ్​, మాళవిక మనోజ్​ కాంబినేషన్​ మరో సారి తెరపై కనిపించేందుకు సిద్దమవుతోందని సమాచారం అందింది. చెన్నైలో పూజా కార్యక్రమంతో ఈ జంట నటించబోతున్న కొత్త సినిమా ప్రారంభమైందట. గతంలో హరి ముత్తయ్య వంటి డైరెక్టర్స్​తో సూపర్ హిట్​ సినిమాలను నిర్మించిన డ్రమాటిక్స్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్​పై ఈ సినిమా రూపొందనుందని తెలిసింది. మణికంఠన్‌ కందస్వామి సమర్పిస్తున్నారు.

ఈ చిత్రానికి బ్లాక్‌ షిప్‌ కలైయరసన్‌ తంగవేలు దర్శకత్వం వహిస్తున్నారు. బ్లాక్‌ షీప్‌ ఆర్జె విగ్నేష్‌, డైరెక్టర్‌ ఏ వెంకటేశ్‌, షీలా రాజకుమార్, జాన్సన్‌ దివాకర్‌, గజరాజన్ తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. మధేశ్‌ మాణిక్‌ ఛాయాగ్రహణం బాధ్యతలు చూసుకోనున్నారు, సిద్ధికుమార్‌ సంగీతం సమకూర్చనున్నారట.

పెళ్లైన మగవాళ్ల సమస్యలను స్త్రీలు కూడా అంగీకరించాలనే కాన్సెప్ట్​తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు దర్శకుడు వివరాలను తెలిపారట. ఇలాంటి కాన్సెప్ట్‌తో రూపొందుతున్న తొలి చిత్రం ఇదేనని అంటున్నారు. బ్లాక్‌ షీప్‌ సంస్థ సహ నిర్మాణ బాధ్యతలను పంచుకోనున్నట్లు తెలిసింది. ఇంకా టైటిల్ ఖరారు చేసుకోని ఈ చిత్రం కచ్చితంగా హిట్ అవుతుందని దర్శకుడు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చూాడాలి మరి రియోరాజ్, మాళవిక మనోజ్ మరోసారి జో లాంటి కెమిస్ట్రీని రిపీట్​ చేసి సక్సెస్ కొడుతుందా లేదా అనేది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

త్రిషకు అదంటే బాగా పిచ్చి - లేకుండా అస్సలు ఉండలేదట! - Happy Birthday Trisha

జాన్వీ కపూర్ ఇంట్లో ఉంటారా? ఈ బంపర్ ఆఫర్ మీ కోసమే! - Janhvikapoor HOUSE

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.