Jio Cinema New Premium Subscription Plans : ప్రస్తుతం ఓటీటీ ట్రెండ్ నడుస్తోంది. దీంతో ఎక్కువ మంది థియేటర్లో సినిమా చూడడానికి కంటే ఓటీటీలో ప్రసారమయ్యే కొత్త సినిమాలు, సిరీస్‌లు చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అందుకోసం చాలా మంది కొన్ని ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్‌లో సబ్‌స్క్రిప్షన్ సైతం తీసుకుంటున్నారు. అలాగే ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ కూడా తన సబ్‌స్క్రైబర్స్‌ను పెంచుకునేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త ఆఫర్స్‌తో సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లను ప్రవేశపెడుతుంటాయి. ఈ క్రమంలోనే ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ జియో సినిమా(Jio Cinema).. తాజాగా రెండు కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లను తీసుకొచ్చింది. గతంలో ఉన్న ప్లాన్స్ ధరలను దాదాపు సగానికి సగం తగ్గించి ఈ కొత్త ప్లాన్లను లాంచ్ చేసింది. ఇంతకీ, జియో సినిమా తీసుకొచ్చిన ఆ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
నెట్‌ఫ్లిక్స్(Netflix), అమెజాన్ ప్రైమ్(Amazon Prime), హాట్ స్టార్, జీ5, ఆహా(AHA) వంటి ఓటిటి ప్లాట్‌ఫార్మ్స్ లాగానే జియో సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు ఎప్పటికప్పుడు కొత్త సినిమాలను తీసుకొస్తుంది. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్‌ను ఉచితంగా వ్యూయర్స్‌కి అందిస్తున్న జియో సినిమా తన సబ్‌స్క్రైబర్స్‌ను మరింత పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది. అలాగే వీడియో స్ట్రీమింగ్ మీద పట్టు సాధించేందుకు క్రమంగా సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా అందరికీ అందుబాటు ధరలో రూ. 29, రూ. 89లకు రెండు కొత్త ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లను లాంచ్ చేసింది. పాత ప్లాన్లలోని అధిక ధర, వీడియోలో నాణ్యతలేమి, డివైజ్‌ల సంఖ్య వంటి పరిమితులను తాజాగా అధిగమించింది జియో సినిమా.
ఎయిర్టెల్ యూజర్లకు గుడ్‌న్యూస్ - అమెజాన్ ప్రైమ్‌తో నయా ప్రీపెయిడ్ ప్లాన్స్!
రూ.29 ప్లాన్ : గతంలో జియో సినిమాలో ప్రీమియం కంటెంట్‌ను చూడాలంటే.. రూ. 59 సబ్‌స్క్రిప్షన్ ధర చెల్లించాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు తీసుకొచ్చిన ఈ ప్రీమియం ప్లాన్ కింద రూ. 29 కే చూడవచ్చు. కేవలం నెలకు రూ.29 చెల్లిస్తే ఒక డివైజ్‌లో ఎలాంటి యాడ్స్ లేకుండా కంటెంట్‌ను వీక్షించే సదుపాయం కల్పిస్తోంది జియో సినిమా. అది కూడా 4K వీడియో క్వాలిటీతో. పైగా డౌన్‌లోడ్ చేసుకొని ఆఫ్‌లైన్‌లోనూ కంటెంట్‌ను ఎంజాయ్ చేయొచ్చు. పిల్లల షోలు, సినిమాలు, హాలీవుడ్ బ్లాక్‌బస్టర్లు, టీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ను స్మార్ట్ టీవీ సహా ఏ డివైజ్‌లోనైనా వీక్షించే ఛాన్స్ ఉంటుంది. అయితే, లైవ్ టెలికాస్ట్‌లు, స్పోర్ట్స్ మాత్రం యాడ్స్‌తో వస్తాయి.
ఫ్యామిలీ ప్లాన్ : ఫ్యామిలీలకూ చేరువ కావడంలో భాగంగా జియో సినిమా గతంలో రూ. 149 ఫ్యామిలీ ప్లాన్‌ను ఇప్పుడు రూ. 89కే అందిస్తోంది. ఇది కూడా నెలవారి ఫ్లాన్. అయితే ఈ ప్లాన్ తీసుకున్నవారు ఒకేసారి నాలుగు డివైజ్‌ల్లో కంటెంట్‌ను వీక్షించొచ్చు. దీనికి రూ.29 ప్లాన్‌లో ఉన్న అన్ని ఫీచర్లూ వర్తిస్తాయి. ఇప్పటికే జియో సినిమా ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌లో ఉన్నవారు ఆటోమేటిక్‌గా ఫ్యామిలీ ప్లాన్‌కు అప్‌గ్రేడ్ అవుతారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఐపీఎల్ సీజన్ 17ను యాడ్స్‌తో ఉచితంగానే వీక్షించొచ్చు.
అదేవిధంగా జియోసినిమా ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ తీసుకున్నవారు ఇంటర్నేషనల్ కంటెంట్‌ను స్థానిక భాషల్లోనే ఎంజాయ్ చేయొచ్చు. గేమ్ ఆఫ్ థ్రోన్స్, హౌస్ ఆఫ్ ది డ్రాగన్ వంటి ప్రముఖ సిరీస్‌లు సహా పీకాక్, హెచ్‌బీఓ, ప్యారామౌంట్, వార్నర్ బ్రదర్స్, డిస్కవరీ వంటి ప్రధాన స్టూడియోలు నిర్మించిన చిత్రాలు చూడొచ్చు. మోటూ పత్లూ, పోకీమాన్ వంటి పిల్లల షోలు కూడా ఉంటాయి. పైగా పిల్లలు చూసే కంటెంట్‌ను పేరెంట్స్ నియంత్రించే ఆప్షన్ కూడా ఉంటుంది.
ఓటీటీ లవర్స్ స్పెషల్ - అమెజాన్ ప్రైమ్ అదిరిపోయే ప్లాన్స్ - 30 డేస్ ఫ్రీ ట్రయల్ కూడా!