ETV Bharat / entertainment

జయం రవి షాకింగ్ డెసిషన్​ - భార్య ఆర్తితో డివోర్స్ అనౌన్స్​మెంట్​ - Actor Jayam Ravi Divorce - ACTOR JAYAM RAVI DIVORCE

Jayam Ravi Divorce : కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి తాజాగా డివోర్స్​ ప్రకటించి అభిమానులను షాక్​కు గురిచేశారు. ఆయన ఓ ఎమోషనల్ నోట్ షేర్ చేసి ఈ విషయాన్ని తెలిపారు.

Jayam Ravi Divorce
Aarthi, Jayam Ravi (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 9, 2024, 1:48 PM IST

Jayam Ravi Divorce : 'పొన్నియిన్​ సెల్వం' ఫేమ్​ ప్రముఖ కోలీవుడ్ నటుడు జయం రవి తాజగా సంచలన ప్రకటన చేశారు. తన సతీమణి ఆర్తితో విడాకులు తీసుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు. అయితే గత కొన్ని రోజులుగా ఈ ఇద్దరూ విడాకులు తీసుకోనున్నట్లు నెట్టింట వార్తలు వచ్చాయి. అయితే నేడు అదే విషయాన్ని ఖరారు చేస్తూ రవి ఓ పోస్ట్‌ పెట్టారు. ఇష్టపూర్వకంగానే తాము విడాకులు తీసుకుంటున్నట్లు ఆ లెటర్​లో ఆయన తెలిపారు.

"జీవితం ఎన్నో అధ్యాయాలతో నిండిన ఓ ప్రయాణం లాంటిది. ఇందులో ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీలో చాలామంది నన్ను ఆదరించారు అలాగే నాకు మద్దతుగానూ నిలిచారు. అందుకే నేనెప్పుడు నా అభిమానులతో, మీడియాతో ట్రాన్స్​పరెంట్​గా, అలాగే నిజాయతీగా ఉంటాను. అందుకే నేడు మీ అందరితోనూ ఓ వ్యక్తిగత విషయాన్ని పంచుకుంటున్నాను. భారమైన హృదయంతో ఈ విషయాన్ని మీకు చెప్పాల్సి వస్తోంది. ఎన్నో ఆలోచనలు, చర్చల జరిపిన తర్వాత నేను, నా వైఫ్​ ఆర్తి విడాకులు తీసుకోవాలనే కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నాం. మా ఇద్దరి ప్రయోజనం కోసమే ఇలా చేస్తున్నాం. ఈ సమయంలో మాతో పాటు మా కుటుంబసభ్యుల ప్రైవసీని గౌరవించాలని మీ అందరినీ కోరుతున్నాను. దీనిపై రూమర్స్‌, ఆరోపణలు మానేయాలని కోరుతున్నా. ఇది పూర్తిగా మా వ్యక్తిగత విషయం. నేను సినిమాల్లో నటిస్తూనే ఉంటాను. మూవీస్​ విషయంలో నా ప్రాధాన్యం ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. మీ అందరికీ వినోదాన్ని పంచడం కోసం నేను కష్టపడతాను. ఎప్పటికీ మీ జయం రవిగా మీ గుండెల్లో ఉంటాను. నన్ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు చాలా ధన్యవాదాలు. నాకు ఎప్పటికీ మీరు ఇలానే మద్దతిస్తారని ఆశిస్తున్నాను" అంటూ జయం రవి ఎమోషనల్ నోట్ షేర్ చేశారు.

ఇక 2009లో రవి, ఆర్తిని పెళ్లి చేసుకున్నారు. సుమారు 15 ఏళ్ల పాటు ఈ జంట తమ వైవాహిక జీవితాన్ని గడిపారు. వీరికి ఆరవ్, అయాన్​ అనే​ ఇద్దరు కుమారులు ఉన్నారు.

మొదటి భార్యకు విడాకులు ఇచ్చి - మళ్లీ ప్రేమలో పడ్డ హీరోలు వీరే! - Nagachaitanya Sobhitha Dhulipala

ఐశ్వర్యారాయ్ దగ్గరున్న 5 లగ్జరీ కార్లు, ఖరీదైన వస్తువులు ఇవే- ఈమె ఆస్తి ఎన్ని కోట్లంటే? - Aishwarya Rai Net Worth

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.