ETV Bharat / entertainment

'దావూదీ' జాన్వీ డ్యాన్స్ - హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్‌ అయిన మూడో రోజుల్లోనే షూటింగ్​! - Janhvi Kapoor Devara - JANHVI KAPOOR DEVARA

Janhvi Kapoor Daavudi Song: దేవర నుంచి రీసెంట్​గా రిలీజైన దావుదీ పాట యూట్యుబ్​లో దూసుకుపోతోంది. ఈ పాటకు ఎన్టీఆర్- జాన్వీ కపూర్ డ్యాన్స్ హైలైట్​గా నిలిచింది. అయితే ఈ సాంగ్‌ కోసం హీరోయిన్ జాన్వీ ఎంతలా కష్టపడింతో తెలుసా? ప్రస్తుతం ఈ విషయం నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది.

Janhvi Kapoor
Janhvi Kapoor (Source: ETV Bharat)
author img

By ETV Bharat Sports Team

Published : Sep 5, 2024, 6:25 PM IST

Janhvi Kapoor Daavudi Song : యంగ్ టైగర్ ఎన్టీఆర్ - జాన్వీ కపూర్ లీడ్ రోల్స్​లో తెరకెక్కిన 'దేవర' సెప్టెంబర్ 27న రిలీజ్​కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో మూవీ మేకర్స్​ ప్రమోషన్స్​లో భాగంగా రీసెంట్​గా సినిమా నుంచి 'దావుదీ' అనే పాటను విడుదల చేశారు. ఈ సాంగ్‌కు ఆడియెన్స్​ నుంచి మాసివ్‌ రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా పాటలో ఎన్టీఆర్ - జాన్వీ కపూర్ ఎనర్జిటిక్ స్టెప్పులు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. వీరిద్దరి డ్యాన్స్​కు ఆడియెన్స్​ ఫిదా అవుతున్నారు. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన మూడో రోజే జాన్వీ ఈ పాట షూటింగ్​లో పాల్గొందట. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్, నెటిజన్లు వృత్తి పట్ల ఆమెకున్న డెడికేషన్​కు హ్యాట్సాఫ్ అంటున్నారు.

అసలేం జరిగిందంటే? - జులై 18న జాన్వీ స్వల్ప అస్వస్థతకు గురైంది. వైద్యపరీక్షల అనంతరం ఫుడ్ పాయిజన్‌‌కు గురైనట్టు డాక్టర్లు తెలపడం వల్ల ఆసుపత్రిలోనే ఉండి ట్రీట్‌మెంట్ తీసుకుంది జాన్వీ. మూడు రోజుల చికిత్స తర్వాత జులై 21న ఆమె ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్​ అయింది. ఇక డిశ్ఛార్జ్ అయిన మూడు రోజులకే జాన్వీ సినిమా సెట్స్​కు వెళ్లి, 'దావుదీ' పాట షూటింగ్​లో పాల్గొందట. అలానే ఈ సాంగ్​లో ఎన్టీఆర్‌కు దీటుగా డ్యాన్స్ అదరగొట్టి ప్రశంసలు అందుకుంటోంది.

ఎన్టీఆర్ కూడా! - ఇక మామూలుగానే డ్యాన్స్​ అదరగొట్టే తారక్ ఈ దావూదీ పాటలోనూ ఫుల్ ఎనర్జిటిక్​గా కనిపించారు. చాలా రోజుల తర్వాత తన స్టెప్పులతో ఎన్టీఆర్ ఫ్యాన్స్​కు కనువిందు చేశారు. అయితే ఈ సాంగ్‌ షూటింగ్​లో ఎన్టీఆర్ కండరాల నొప్పితో ఇబ్బంది పడ్డారట. ఈ విషయం సినిమాటోగ్రాఫర్ రత్నవేలు చెప్పారు. కండరాల నొప్పి ఇబ్బంది పెడుతున్నా పాటలో తారక్‌ డ్యాన్స్ ఇరగదీశారంటూ ట్విట్టర్​లో తెలిపారు. 'కండరాల నొప్పి, గాయం ఇబ్బందిపెట్టినప్పటికీ ఫాస్ట్ బీట్ సాంగ్​లో మీ స్టైలిష్ డ్యాన్స్​కు హ్యాట్సాఫ్' అని ట్వీట్​లో రాసుకొచ్చారు. దీంతో తారక్ డెడికేషన్ సూపర్ అంటూ ఫ్యాన్స్​ ప్రశంసిస్తున్నారు.

కాగా, ఈ దావూడీ పాట రిలీజైన 24 గంటల్లోనే దాదాపు 20 మిలియన్ వ్యూస్​తో దూసుకుపోతోంది. ప్రస్తుతం యూట్యూబ్​లో దావుదీ ట్రెండింగ్ నెం. 1లో ఉంది. ఇప్పటికే విడుదలైన మొదటి రెండు పాటలకు కూడా మంచి ఆదరణ దక్కుతోంది. కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. బాలీవుడ్ సీనియర్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్రలో నటించారు.

దేవర మూడో సాంగ్ రిలీజ్- ఎన్టీఆర్, జాన్వీ ఎనర్జిటిక్ స్టెప్పులు చూశారా! - Devara Songs

'ఆ పని నేర్చుకునేందుకు ఎన్​టీఆర్​కు ఒక్క సెకను - నాకైతే 10 రోజులు' - Janhvi Kapoor Jr NTR

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.