ETV Bharat / entertainment

'ఆర్​సీ 16' రోల్​పై జాన్వీ క్లారిటీ​ - 'ఇప్పట్లో దాని గురించి నేనేం చెప్పలేను' - జాన్వీ కపూర్ రామ్ చరణ్ మూవీ

Janhvi Kapoor RC 16 : బాలీవుడ్‌ స్టార్ జాన్వీ కపూర్‌ ప్రస్తుతం 'దేవర' మూవీ షూటింగ్​లో బిజీగా ఉంది. అయితే దీని తర్వాత ఆమె 'ఆర్​సీ 16' సినిమాలో నటిస్తుందన్న వార్తలు నెట్టింట ట్రెండ్​ అవుతోంది. ఈ విషయం గురించి జాన్వీ తాజాగా క్లారిటీ ఇచ్చింది.

Janhvi Kapoor RC 16
Janhvi Kapoor RC 16
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 23, 2024, 7:11 AM IST

Updated : Feb 23, 2024, 8:38 AM IST

Janhvi Kapoor RC 16 : బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ప్రస్తుతం ఇటు టాలీవుడ్​తో పాటు అటు బాలీవుడ్​లోనూ వరుస ఆఫర్లతో బిజీ బిజీగా ఉంది. 'దేవర' సినిమా షూటింగ్​లో పాల్గొంటూనే తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలకు సైన్ చేస్తూ సందడి చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవలే ఈ అమ్మడిపై వచ్చిన ఓ రూమర్ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది.

ప్రస్తుతం 'దేవర' సినిమాలో కీలక పాత్రలో పోషిస్తున్న జాన్వీ, త్వరలో రామ్​ చరణ్​ బుచ్చిబాబు కాంబినేషన్​లో తెరకెక్కుతున్న' ఆర్​సీ 16'లోనూ మెరవనుందంటూ సోషల్ మీడియలో ఇటీవలే పలు వార్తలు ట్రెండ్ అయ్యాయి. అందులో దాదాపు ఆమె రోల్ ఖాయమంటూ పలువురు కామెంట్​ కూడా చేశారు. అయితే ఇదే విషయం గురించి ఆ ఇంటర్వ్యూలో యాంకర్ జాన్వీని అడగ్గా దానికి ఈ చిన్నది ఇలా సమాధానమిచ్చింది.

"రీసెంట్​గా మా నాన్న (బోనీ కపూర్‌) నా తదుపరి సినిమాల అప్డేట్స్‌ గురించి పలు విషయాలను మీడియాతో పంచుకున్నారు. అయితే ఆయన నన్ను సంప్రదించకుండానే ఈ విషయంపై అటువంటి స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. ఆయన చెప్పిన సినిమాల గురించి నేను ఇప్పట్లో మాట్లాడలేను. ప్రస్తుతానికి మాత్రం నేను తెలుగులో 'దేవర', అలాగే హిందీలో 'మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి', 'ఉలఝ్‌' సినిమాలకు మాత్రమే వర్క్ చేస్తున్నాను." అంటూ ఫ్యాన్స్​కు షాకిచ్చింది.

'దేవరలో మరాఠి బ్యూటీ'
మరోవైపు 'దేవర'తో ఓ మరాఠీ నటి కూడా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్నట్లు ప్రచారం సాగుతోంది. మరాఠీ బ్యూటీ శ్రుతి మరాటే ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్​గా నటించనుందట. 'దేవర'లో హీరో ఎన్​టీఆర్ డ్యుయల్ రోల్​ చేయనున్నారట. అందులో ఒక రోల్​కు జాన్వీ హీరోయిన్​గా నటించగా, రెండో పాత్రకోసం శ్రుతి మరాటే జతకట్టనుందని టాక్. కానీ, ఈ విషయంపై అఫీషియల్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. మరోవైపు ఈ విషయాన్ని ఎన్​టీఆర్ ఫ్యాన్ పేజ్​లో షేర్ చేశారు. ఈ పోస్ట్​కు​ నటి శ్రుతి కూడ స్పందించడం వల్ల ఇది నిజమేనని అంటున్నారు. ఇక మూవీ టీమ్ దీనిపై క్లారిటీ ఇస్తే కానీ అసలు విషయం తెలియదంటూ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

'వాళ్లతో ఎప్పటికీ డేటింగ్‌ చేయను - అది చెబితే నా చెల్లి నవ్వుతుంది'

''దేవర' సెట్​లోకి వెళితే సొంతింటికి వచ్చినట్లు అనిపిస్తోంది- కారణం అదేనేమో!'

Last Updated : Feb 23, 2024, 8:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.