ETV Bharat / entertainment

'అమితాబ్, హృతిక్ కాదు- తారక్​తోనే చేయాలని ఉంది!' - Janhvi Kapoor Jr Ntr - JANHVI KAPOOR JR NTR

Janhvi Kapoor Jr NTR: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ రీసెంట్​గా జూనియన్ ఎన్టీఆర్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

Janhvi Kapoor Jr Ntr
Janhvi Kapoor Jr Ntr (Source: ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 21, 2024, 10:02 PM IST

Janhvi Kapoor Jr NTR: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ వరుస సినిమాలతో కెరీర్​లో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో ఆమె నటించిన తాజా చిత్రం 'ఉలఝ్‌' రిలీజ్​కు రెడీ అవుతోంది. ఈ సినిమా ఆగస్టు 2 నుంచి థియేటర్లలో సందడి చేయనుంది. దీంతో జాన్వీ మూవీ ప్రమోషన్స్​లో పాల్గొంటుంది. ఇక రీసెంట్​గా పలు ఇంటర్వ్యూల్లోనూ జాన్వీ మాట్లాడింది. ఈ క్రమంలోనే ఓ సందర్భంలో గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ పట్ల తనకు ఉన్న క్రేజ్ చాటుకుంది.

రీసెంట్​గా ఓ ఇంటర్వ్యూలో జాన్వీకి ఇంట్రెస్టింగ్ ప్రశ్న ఎదురైంది. 'హృతిక్ రోషన్, విక్కీ కౌశల్​ ఇద్దరిలో ఒకరితో డ్యాన్స్ లేదా అమితాబ్ బచ్చన్​తో నటించడం. ఏది ఎంపిక చేసుకుంటారు?' అని జాన్వీని అడిగారు. దీంతో జాన్వీ ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా 'నేను ఎన్టీఆర్ సర్​తో రీసెంట్​గా ఓ పాట పూర్తి చేశాను. ఇక వెంటనే ఆయనతో ఇంకో పాటకు స్టెప్పులేయాలని ఉంది' అని రిప్లై ఇచ్చింది. బాలీవుడ్ స్టార్లను కాకుండా, జూనియర్ ఎన్టీఆర్​తో డ్యాన్స్ చేయాలని ఉంది అనడంతో బాలీవుడ్​లోనూ తారక్​కు ఫుల్ క్రేజ్ వచ్చేసిందని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

​'దేవరలో నా పాత్ర'
కాగా, ఎన్టీఆర్ లీడ్ రోల్​లో తెరకెక్కుతున్న 'దేవర'లో జాన్వీ హీరోయిన్​గా నటిస్తోంది. ఈ సినిమాతో జాన్వీ టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం కానుంది. అయితే ఇదే ఇంటర్వ్యూలో దేవరలో తన పాత్ర గురించి మాట్లాడింది. 'నా పాత్ర ప్రభావం తొలి భాగంలో కంటే, రెండో భాగంలోనే ఎక్కువగా ఉంటుంది​' అని చెప్పింది. కాగా, ఈ సినిమాలో ఓ పల్లెటూరి అమ్మాయిగా కనిపించనుంది.

ఇక దేవర పార్ట్- 1ను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. ముఖ్యమైన సన్నివేశాలు సహా దాదాపు 90 శాతం షూటింగ్ పూర్తైనట్లు తెలుస్తోంది. త్వరలోనే అది కూడా కంప్లీట్ చేసి, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభించనున్నారు. ఈ సినిమాకు మ్యూజిక్ సంచలనం అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. కాగా, సెప్టెంబర్ 27న దేవర వరల్డ్​వైడ్ గ్రాండ్​గా రిలీజ్ కానుంది.

భారీగా 'దేవర' థియేట్రికల్ బిజినెస్ - షూటింగ్​ ఎక్కడి దాకా వచ్చిందంటే?

'ఉలఝ్' - దేశద్రోహం కేసు నుంచి జాన్వీ ఎలా బయటపడింది!?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.