Janhvi Kapoor Devara Pre Release : తాజాగా జరగాల్సిన 'దేవర' ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దవ్వడం పట్ల అటు మూవీ లవర్స్ ఇటు ఎన్టీఆర్ అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్న తరుణంలో నటి జాన్వీ కపూర్ ఓ స్పెషల్ వీడియో షేర్ చేసి అభిమానులను ఉత్తేజపరిచారు. తనను ఎంతో ఆదరిస్తున్న తెలుగు ఆడియెన్స్‌కు ధన్యవాదాలు చెప్పారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడం వల్ల అక్కడ చెప్పాలనుకున్న మాటలను ఓ వీడియో ద్వారా తెలిపారు.
"అందరికీ నమస్కారం. నన్ను ఇంతగా ఆదరిస్తున్నందుకు, నాపై ఇంత ప్రేమను చూపిస్తున్నందుకు తెలుగు ఆడియన్స్‌కు ధన్యవాదాలు. నన్ను జానూ పాప అని పిలుస్తున్న ఎన్టీఆర్ అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు. నన్ను మీరు మీ సొంత మనిషిలా భావించడం చాలా సంతోషాన్నిస్తోంది. మా అమ్మ మీకు ఎంత ముఖ్యమో నాకు తెలుసు. మా అమ్మకు, నాకు కూడా మీరందరూ అంతే ముఖ్యం. నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తున్న మీఅందరినీ గర్వపడేలా ప్రతిరోజు కష్టపడతాను. 'దేవర' నా మొదటి అడుగు. శివ సర్, ఎన్టీఆర్ నన్ను ఈ సినిమాకు ఎంపిక చేయడం నా అదృష్టం. మా ఈ ప్రయత్నం అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. నాకు ఈ సపోర్ట్ ఇచ్చినందుకు దేవర టీమ్ అందరికీ నా ధన్యవాదాలు" అంటూ జాన్వీ తెలుగులో మాట్లాడి అభిమానులను ఆశ్చర్యపరిచారు. ఇలా జాన్వీ అచ్చ తెలుగులో మాట్లాడటం చూసి అందరూ ఆమెను ప్రశంసిస్తున్నారు. శ్రీదేవిని గుర్తు చేశారంటూ కామెంట్ చేస్తున్నారు.
Devara Movie Cast : ఇక 'దేవర' సినిమా విషయానికి వస్తే ఈ చిత్రంలో తారక్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. సీనియర్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటించనున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యుయల్ రోల్లో కనిపించనున్నారు. శ్రీకాంత్, శ్రుతి మారాఠే, చైత్ర రాయ్, షైన్ టామ్, మురళీ శర్మ, ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ తదితరులు నటించారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీంతం అందించగా, రత్నవేలు డీఓపీ బాధ్యతలు చూశారు. ఎన్టీఆర్, యువసుధ బ్యానర్లపై సంయుక్తంగా రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది.
ప్రీ రిలీజ్ రద్దు బాధాకరం - కానీ సినిమా చూసి కాలర్ ఎగరేస్తారు! - Devara Pre Release
భయమంటే ఏంటో తెలియాలంటే 'దేవర' కథ వినాలి! - ఇంట్రెస్టింగ్గా రిలీజ్ ట్రైలర్! - Devara Release Trailer