ETV Bharat / entertainment

పుష్పరాజ్​కు జాన్వీ కపూర్ సపోర్ట్ - ఆ ట్రోల్స్ చేసిన వారికి స్ట్రాంగ్​ రిప్లై! - JANHVI KAPOOR PUSHPA 2

'పుష్ప 2'పై నార్త్​లో ట్రోల్స్​ - స్పందించిన జాన్వీ కపూర్త్ - సినిమాకు సపోర్ట్ చేస్తూ ట్రోలర్స్​కు స్ట్రాంగ్ రిప్లై!

Janhvi Kapoor Support Pushpa2
Pushpa 2 Janhvi Kapoor (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 7, 2024, 10:18 AM IST

Updated : Dec 7, 2024, 10:24 AM IST

Janhvi Kapoor Pushpa 2 : 'పుష్ప 2' సినిమాకు నార్త్​లో ఎక్కువ థియేటర్‌లు కేటాయించడంపై కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా కారణంగా హాలీవుడ్‌ హిట్ మూవీ 'ఇంటర్‌స్టెల్లార్‌' రీ రిలీజ్‌ వాయిదా పడిందంటూ నెట్టింట విమర్శిస్తూ పలు పోస్ట్‌లు పెడుతున్నారు. అయితే ఈ అంశంపై తాజాగా బాలీవుడ్ నటి జాన్వీ కపూర్‌ స్పందించారు.

"పుష్ప 2 కూడా ఒక సినిమానే కదా. ఎందుకు దాన్ని మరొక మూవీతో పోలుస్తూ తక్కువ చేస్తున్నారు. మీరు ఏదైతే హాలీవుడ్‌ సినిమాను సపోర్ట్‌ చేస్తున్నారో వారే మన సినిమాలపై ఇప్పుడు ప్రశంసలు కురిపిస్తున్నారు. కానీ మనం మాత్రం మన చిత్రాలను ఇంకా తక్కువ చేసుకుంటూ మనల్ని మనమే అవమానించుకుంటూ ఉండిపోతున్నాం. ఇటువంటివి చూసినప్పుడు బాధగా ఉంటుంది" అని జాన్వీ అసహనం వ్యక్తం చేశారు.

ఇదీ జరిగింది :
ప్రపంచవ్యాప్తంగా పాపులరైన సినిమాల్లో 'ఇంటర్‌ స్టెల్లార్‌' ఒకటి. హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్‌ నటించిన ఈ చిత్రం 2014లో విడుదలైంది. ఇక తాజాగా ఈ చిత్రం విడుదలై 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా 'ఇంటర్​ స్టెల్లార్'​ను రీరిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. అయితే ఎక్కువ శాతం ఐమాక్స్‌ల్లో ‘పుష్ప2’ ఉండటం వల్ల ఇండియాలో దీని రీరిలీజ్‌ను పోస్ట్​పోన్ చేశారు. దీంతో కొందరు 'పుష్ప2'కు ఎందుకు అన్ని ఎక్కువ థియేటర్‌లు ఇచ్చారంటూ కామెంట్ చేయడం మొదలెట్టారు. అలా సోషల్ మీడియాలో ఓ మీమ్స్‌ పేజ్‌ పెట్టిన పోస్ట్​కు జాన్వీకపూర్‌ ఈ మేరకు రిప్లై ఇచ్చి 'పుష్ప 2'కు సపోర్ట్‌ చేశారు.

ఇక జాన్వీ కెరీర్ విషయానికి వస్తే, 'దేవర'తో తెలుగు తెరకు పరిచయమైన ఈ బీటౌన్ బ్యూటీ త్వరలో​ మరో టాలీవుడ్ సినిమాలో మెరవనుంది. ప్రస్తుతం రామ్‌చరణ్‌ - బుచ్చిబాబు సానా కాంబోలో రానున్న చిత్రంలో ఆమె ఫీమేల్​ లీడ్​గా నటిస్తున్నారు. 'ఆర్‌సీ 16' అనే వర్కింగ్ టైటిల్​తో ఇది షూటింగ్ దశలో ఉంది. మ్యూజికల్ సెన్సేషన్​ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నారు. వృద్ధి సినిమాస్‌, మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 'పెద్ది' అనే టైటిల్​ను ఖారరు చేసే యోచనలో మేకర్స్ ఉన్నట్లు సినీ వర్గాల సమాచారం.

ఆల్​టైమ్ రికార్డ్- 'RRR'ను దాటేసిన 'పుష్ప'- ఒక్కరోజే రూ.300 కోట్లు!

చిరంజీవిని కలిసిన 'పుష్ప' టీమ్‌

Last Updated : Dec 7, 2024, 10:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.