Janhvi Kapoor Boyfriend : బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్, మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే మనవడు షికర్ పహరియాతో డేటింగ్లో ఉన్నట్లు మీడియాలో చాలా రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ మరోసారి జాన్వీ మీడియాకు దొరికింది.
తాజాగా తండ్రి బోణి కపూర్ నిర్మించిన మైదాన్ సినిమా ప్రమోషన్స్‌లో ప్యాంట్ సూట్ వేసుకుని మీడియా ముందుకు వచ్చింది జాన్వీ. అయితే ఈ ప్రెస్ మీట్లో జాన్వీ డ్రెస్ కన్నా ఆమె మెడలో వేసుకున్న డైమెండ్ నెక్లెస్ మీద అందరి ఫోకస్ పడింది. ఎందుకంటే దానిపై 'షికు' పేరు ఉండటాన్ని అందరూ ఎక్కువగా గమనించారు. దీంతో సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారిపోయింది. కాగా, జాన్వీ మొదటిసారిగా 'కాఫీ విత్ కరణ్' ప్రోగ్రాంలో తన స్పీడ్ డైల్ లిస్ట్‌లో ఎవరు ఉంటారు అన్న ప్రశ్నకు తండ్రి పేరు, చెల్లి పేరు, షికర్ పేరు చెప్పింది. అయితే ఆ వెంటనే చెప్పాల్సిన దానికన్నా ఎక్కువ చెప్పానని అర్థం చేసుకోండంటూ ఆ మాటను దాటేసింది.
ఇక జాన్వీ, షికర్ ఇద్దరూ కలిసి తరుచుగా గుళ్లకు వెళ్తూ మీడియా కంటికి చిక్కుతూనే ఉన్నారు. రీసెంట్గా కూడా వీరిద్దరూ కలిసి సంప్రదాయ దుస్తులలో తిరుమల కూడా వచ్చారు. కానీ తమ మధ్య ఉన్న బంధం గురించి మాత్రం పెదవి విప్పలేదు. దీంతో ఈ ఇద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ ఉందంటూ రోజుకో వార్త బయటకు వస్తూనే ఉంది.
ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలోనూ బోనికపూర్ మాట్లాడుతూ - "అతను(షికర్) నాకు చాలా నచ్చుతాడు. అతడి స్నేహం చాలా అద్భుతంగా ఉంటుంది. నా కోసం, జాన్వీ కోసం, అర్జున్ కోసం ఎప్పుడూ అందుబాటులో ఉంటాడు. అలాంటి వ్యక్తి మా కుటుంబంలో ఉండడం మా అదృష్టం" అంటూ షికర్ను ప్రశంసలతో ముంచెత్తారు. ఇకపోతే ప్రస్తుతం జాన్వీ దేవర సినిమాలో ఎన్టీఆర్‌కు జోడిగా నటిస్తోంది. రామ్‌చరణ్ ఆర్సీ 16లోనూ హీరోయిన్గా ఫిక్స్ అయింది.
వంటలక్క ప్రేమి విశ్వనాథ్‌కు ఒక్క రోజు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? - Vantalakka Remuneration
హీరోగా ఎంట్రీ ఇస్తున్న ప్రభాస్ కజిన్ - సినిమా టైటిల్ ఏంటంటే? - Prabhas Family Hero