ETV Bharat / entertainment

'జై హనుమాన్' పక్కనపెట్టి అనుపమ వెనకపడుతున్న ప్రశాంత్ వర్మ! - Jai HanuMan Shoot Delayed

Prasanth Varma Anupama Parameshwaran : హనుమాన్ భారీ సక్సెస్ అయిన నేపథ్యంలో జై హనుమాన్ సినిమాను ఆ మధ్య ప్రకటించారు దర్శకుడు ప్రశాంత్​ వర్మ. కానీ ఇప్పుడీ సినిమా ఆలస్యం అయ్యేటట్టు ఉంది. ఎందుకంటే ప్రశాంత్ వర్మ జై హనుమాన్ కన్నా ముందే అనుపమతో ఓ సినిమా చేయనున్నారని తెలిసింది. ఆ వివరాలు.

'జై హనుమాన్' పక్కనపెట్టి అనుపమ వెనకపడుతున్న ప్రశాంత్ వర్మ!

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 19, 2024, 1:49 PM IST

Jai HanuMan Shoot Postpone : సంక్రాంతి రేసులో పెద్ద బడ్జెట్ సినిమాలతో పోటీపడి మరీ రిలీజై రికార్డులు అన్ని తిరగరాసి సూపర్ హిట్ అయింది హనుమాన్. ఈ పాన్ ఇండియా హిట్​తో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ టాప్ డైరెక్టర్ల రేసులోకి వెళ్లాడు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్లు కలెక్షన్స్​ సాధించింది. అయితే హనుమాన్ సినిమా చివర్లో జై హనుమాన్ 2025లో విడుదల అవుతుందని ప్రకటించారు ప్రశాంత్ వర్మ.

దీంతో ప్రశాంత్ వర్మ నెక్ట్స్ సినిమా జై హనుమానే ఉంటుందని అంతా ఆశించారు. కానీ అది కాదని తెలుస్తోంది. జై హనుమాన్ షూటింగ్​ కోసం నటీనటుల ఎంపిక ప్రక్రియ ఇంకా పూర్తి కాకపోవడంతో తన పాత పెండింగ్ ఉన్న చిత్రంపై ఫోకస్ పెట్టారట ప్రశాంత్. ఇప్పటికే 65 శాతం పూర్తి చేసిన ఆక్టోపస్ సినిమా షూటింగ్​ను మళ్లీ ప్రారంభించినట్లు తెలుస్తోంది.

Prasanth Varma Anupama Parameshwaran : ఆక్టోపస్ సినిమా ప్రశాంత్ వర్మ మార్క్ సినిమాలలాగా ఉండదని, ఇది పూర్తిగా మహిళా ప్రాధాన్యత చిత్రం అని తెలుస్తోంది. ఇందులో ఐదు మహిళా ప్రధాన పాత్రలు ఉంటాయని ఆ మధ్య తెలిపారు ప్రశాంత్ వర్మ. ఇందులో ఒక పాత్రలో అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. ఐదుగురు మహిళలు ఒక ప్రమాదకరమైన పరిస్థితిలో చిక్కుకుపోయినప్పుడు ఏమి జరిగింది అనేది ఈ సినిమా స్టోరీ లైన్. అయితే ఈ సినిమాను మొదటగా ఫిల్మ్ ఫెస్టివల్స్​కు పంపించిన తర్వాత థియేటర్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఇప్పటివరకు చిన్న బడ్జెట్​తో వివిధ జానర్ సినిమాలతో పెద్ద హిట్లు కొట్టిన ప్రశాంత్ వర్మ ఈ లేడి ఓరియెంటెడ్ సినిమాతో ఎలాంటి రిజల్ట్​ను అందుకుంటారో చూడాలి.

ఇకపోతే అనుపమకు ఇలాంటి లేడి ఓరియెంటెడ్ సినిమాల్లో నటించడం కొత్తేమీ కాదు. ఇప్పటికే డైరెక్ట్ ఓటీటీలో రిలీజైన బటర్ ఫ్లై సినిమాతో ఆడియెన్స్​ను ఆకట్టుకుంది. త్వరలోనే రిలీజ్ కానున్న డీజే టిల్లు స్క్వేర్ సినిమాతోనూ ప్రేక్షకులను పలకరించనుంది. ఇందులో యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డకు జోడీగా నటించింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఎట్టకేలకు బాయ్​ఫ్రెండ్​కు మిల్కీ బ్యూటీ గ్రీన్​ సిగ్నల్​ - ఆ పద్ధతిలో వివాహం!

DJ Tillu బోల్డ్​ రోల్​ - స్టేజ్​పైనే అనుపమ స్ట్రాంగ్ ఆన్సర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.