ETV Bharat / entertainment

'జై హనుమాన్‌'లో ఆంజనేయుడిగా స్టార్‌ హీరో : ప్రశాంత్‌ వర్మ - ​ జై హనుమాన్​లో స్టార్​ హీరో

Jai Hanuma sequel Star Hero : రీసెంట్‌ బ్లాక్‌బస్టర్‌ 'హనుమాన్‌' సీక్వెల్​ 'జై హనుమాన్‌'లో హీరోగా ఎవరు నటించనున్నారో క్లారిటీ ఇచ్చారు దర్శకుడు ప్రశాంత్‌ వర్మ. ఆ వివరాలు.

'జై హనుమాన్‌'లో ఆంజనేయుడిగా స్టార్‌ హీరో : ప్రశాంత్‌ వర్మ

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 22, 2024, 3:13 PM IST

Updated : Jan 22, 2024, 4:02 PM IST

Jai Hanuman sequel Star Hero : సూపర్‌ హీరో కథకు ఇతిహాసాన్ని ముడిపెట్టి దర్శకుడు ప్రశాంత్‌ వర్మ తెరకెక్కించిన చిత్రం 'హనుమాన్‌'. తేజ సజ్జా కథానాయకుడిగా నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలై ఘన విజయాన్ని అందుకుంది. అయితే ఈ చిత్రానికి కొనసాగింపుగా 'జై హనుమాన్‌' రానున్నట్లు దర్శకుడు ప్రశాంత్​ ఇప్పటికే క్లారిటీ చేశారు. అయితే తాజాగా ఈ సీక్వెల్​ను ఉద్దేశించి ప్రశాంత్‌ వర్మ తాజాగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్​ చేశారు. సీక్వెల్‌లో తేజ హీరో కాదని స్పష్టత ఇచ్చారు. 'హనుమాన్‌' సక్సెస్​లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని షేర్​ చేశారు.

"హనుమాన్‌ కన్నా వందరెట్లు భారీ స్థాయిలో 'జై హనుమాన్‌' ఉంటుంది. సీక్వెల్‌లో తేజ సజ్జా హీరో కాదు. సీక్వెల్‌లోనూ ఆయన హనుమంతు పాత్రలో కనిపిస్తారు. ఈ సీక్వెల్​ సినిమా హీరో ఆంజనేయ స్వామి. ఆ పాత్రలో ఓ స్టార్‌ హీరో నటిస్తారు. 2025లో ఇది రిలీజ్ అవుతుంది. దీని కన్నా ముందు నా నుంచి మరో రెండు సినిమాలు రాబోతున్నాయి. అందులో ఒకటి 'అధీర'. మరొకటి 'మహాకాళి' అని ప్రశాంత్‌ వర్మ చెప్పుకొచ్చారు. టీమ్‌ సహకారంతోనే తాను ఈ భారీ విజయాన్ని అందుకోగలినట్లు తెలిపారు. కాగా, ఇప్పటికే ఈ జై హనుమన్​ సీక్వెల్ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్​చరణ్​ నటిస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. చూడాలి మరి ఏ స్టార్​ హీరో నటిస్తారో.

ఇకపోతే ఈ హనుమాన్ సినిమా బడ్జెట్​ రూ.30కోట్ల లోపే అని అంటున్నారు. ఈ చిత్రం విడుదలైన పది రోజుల్లోనే వరల్డ్​ వైడ్​గా దాదాపు రూ.200 కోట్లు కలెక్ట్ చేసినట్లు సినీ విశ్లేషకుల అంచనా వేస్తున్నారు.

Hanuman Movie Cast : హనుమాన్​లో తేజ సజ్జా- అమృత అయ్యార్ హీరోహీరోయిన్లుగా నటించగా స్టైలిష్​ విలన్​గా వినయ్​ రాయ్ నటించారు. వరలక్ష్మి శరత్ కుమార్, సముద్రఖని, గెటప్ శ్రీను, సత్య, వెన్నెల కిషోర్ వంటి తదితురులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ప్రైమ్​షో ఎంటర్​టైన్​మెంట్ బ్యానర్​పై నిరంజన్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు.

రామాయణంపై మరో పాన్ ఇండియా మూవీ - ఈసారి ఎవరికీ తెలియని కథతో

'భారతీయుడు-2', 'గేమ్​ఛేంజర్' రిలీజ్​ అప్పుడే- 2024లో శంకర్​దే హవా!

Last Updated : Jan 22, 2024, 4:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.