Jai Hanuman Movie Rana : 'హను-మాన్' సినిమాతో బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ అందుకున్నారు యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. తేజ సజ్జా లీడ్ రోల్లో తెరకెక్కిన ఆ చిత్రం మంచి టాక్‌తో ఇటు ఇండియాలోనే కాకుండా అటు ఇంటర్నేషనల్గానూ గుర్తింపు పొందింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా 'జై హనుమాన్'ను తెరకెక్కిస్తున్నారు ప్రశాంత్ వర్మ. తాజాగా దీపావళి పండుగ సందర్భంగా కన్నడ స్టార్ హీరో రిషబ్‌శెట్టిని హనుమంతుడిగా చూపించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన, ఇప్పుడు మరో సర్ప్రైజ్ను ఇచ్చారు.
టాలీవుడ్ హీరో రానా , అలాగే కన్నడ స్టార్ రిషబ్‌శెట్టితో కలిసి దిగిన ఓ స్పెషల్ ఫొటోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. దానికి 'జై జై హనుమాన్' అనే క్యాప్షన్ జోడించి రిషబ్‌శెట్టి, రానా దగ్గుబాటి, ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్‌ను ట్యాగ్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అభిమానులు ఈ ఇద్దరిని ఒకే ఫ్రేమ్‌లో చూసి సినిమాపై మరిన్ని అంచనాలు పెట్టుకుంటున్నారు. రానా ఈ PVCUలో ఎటువంటి రోల్లో కనిపించనున్నారో అంటూ ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు.
JAI JAI HANUMAN !! 💪🏽✊🏽😊@shetty_rishab @RanaDaggubati @ThePVCU pic.twitter.com/wwxwOndnr2
— Prasanth Varma (@PrasanthVarma) November 4, 2024
ఇక 'జై హనుమాన్' సినిమా విషయానికి వస్తే, శ్రీరాముడికి హనుమంతుడు ఇచ్చిన మాట ఏంటి? దాన్ని నిలబెట్టుకునేందుకు ఆయన ఏం చేశాడు? అన్న స్టోరీతో ఈ సీక్వెల్ రూపొందనుంది. మొదటి భాగంలో యంగ్ హీరో తేజ సజ్జా కథానాయకుడిగా నటించారు. సూపర్‌హీరో స్టోరీకి ఇతిహాస పురణాలను ముడిపెట్టి తీర్చిదిద్దారు. తేజతో పాటు అమృతా అయ్యర్, వరలక్ష్మి శరత్‌కుమార్, వినయ్ రాయ్, వెన్నెల కిషోర్, గెటప్ శీనూ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.
అతి తక్కువ బడ్జెట్‌తో వచ్చిన ఈ సినిమా తెలుగు, హిందీ సహా రిలీజైన ఇతర భాషల్లోనూ భారీగా వసూళ్ల వర్షాన్ని కురిపించింది. దాదాపు రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లను సంపాదించింది. ఇక ఈ చిత్రంలో హీరో నటనకు ఫుల్ మార్క్స్ పడగా, అక్కగా చేసిన వరలక్ష్మీ శరత్‌కుమార్ అంజమ్మ పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. దీంతో పాటు విలన్‌గా వినయ్ రాయ్ కూడా తనదైన శైలిలో నటించి మెరిశారు.
రిషభ్ శెట్టికి ప్రశాంత్ వర్మ థాంక్స్ - 'హనుమాన్' రోల్‌కు పర్ఫెక్ట్ మ్యాచ్!
'జై హనుమాన్' దీపావళి సర్‌ప్రైజ్- ఆంజనేయుడి పాత్రలో రిషభ్ శెట్టి కన్ఫార్మ్