ETV Bharat / entertainment

ఆ హీరోయిన్​కు గత 8 ఏళ్లుగా నో హిట్​ - కానీ ప్రైవేట్​ ఐలాండ్​కు బాస్!​ - ఎవరంటే? - Heroine Own Private Island - HEROINE OWN PRIVATE ISLAND

ఒకప్పుడు వరుస భారీ హిట్లతో స్టార్ కథనాయికురాలిగా ఎదిగింది ఆమె. అయితే గత 8 ఏళ్లుగా ఆమె ఖాతాలో ఒక్క హిట్​ కూడా పడలేదు. కానీ ఆమె ఓ ప్రైవేట్​ ఐలాండ్​ను కొనుగోలు చేసి లగ్జరీ లైఫ్​ను లీడ్ చేస్తోంది. ఆమె ఐశ్వర్యా రాయ్, అలియా భట్, ప్రియాంక చోప్రా, దీపికా పదుకొణె మాత్రం కాదు. ఇంతకీ ఆమె ఎవరంటే?

source Getty Images
Private Island Celebrity India (source Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 27, 2024, 1:10 PM IST

Private Island Celebrity Heroine India : సెలబ్రిటీల లైఫ్​ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కోట్లలో రెమ్యునరేషన్​ అందుకుంటూ ఎంతో లగ్జరీగా లైఫ్​ లీడ్ చేస్తుంటారు. చాలా మంది తారలు తమ సంపాదించే డబ్బులో ఎక్కువ మొత్తాన్ని రియల్​ ఎస్టేట్​లో పెట్టుబడిగా పెడుతుంటారు. విలాసవంతమైన, అత్యాధునిక సౌకర్యాలు ఉన్న ప్రాపర్టీస్​ను కొనుగోలు చేస్తుంటారు. అయితే చాలా తక్కువ మంది తారలు మాత్రమే ప్రైవేట్​ ఐలాండ్​లను కొనుగోలు చేస్తుంటారు. ఇండియాలో కేవలం ముగ్గురు బాలీవుడ్​ తారలకు మాత్రమే ప్రైవేట్​ ఇలాండ్​ ఉందట! వారిలో ఒకరు బాలీవుడ్​ నటి అని తెలిసిందే.

ఇంతకీ ఆమె ఎవరంటే? - ఇండియాలో రెచెస్ట్​ యాక్ట్రెస్​ అనగానే చాలా మందికి ఐశ్వర్య రాయ్​ పేరే గుర్తొస్తుంది. కానీ ఆమె ఎటువంటి ఐలాండ్​ను కొనుగోలు చేయలేదంట. ఇక ప్రస్తుతం ప్రియాంక చోప్రా, దీపికా పదుకొణె అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్లుగా కొనసాగుతున్నారు. అయితే వారికి కూడా ప్రైవేట్​ ఐలాండ్​ను ఏమీ లేవట. అలానే టాప్ హీరోయిన్లుగా రాణిస్తున్న అలియా భట్​, కత్రినా కైఫ్​, కరీనా కపూర్​ ఇలా వీరు కూడా బంగ్లాను లేదా ఇతర స్థలాలను కొనుగోలు చేశారే కానీ ఐలాండ్​ను కొనలేదట. అయితే మరి ఇంతకీ ప్రైవేట్​ ఐలాండ్​ను కొన్న నటి ఎవరంటే జాక్వెలిన్​ ఫెర్నాండెజ్(Jacquelin Fernandez​ Own Island) అని తెలిసింది. డీఎన్​ఏ ఇంగ్లీష్ మీడియా ఎంటర్​టైనర్​ వెబ్​సైట్​లో ఈ వార్త రాసి ఉంది.

గత ఎనిమిదేళ్లుగా నో హిట్ (Jacquelin Fernandez Movies)​​ - ఈ శ్రీలంక నటి గత 15 ఏళ్లుగా బాలీవుడ్​లో కొనసాగుతోంది. ​ 2009లో 'అలాడిన్'​తో బాలీవుడ్​లోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ మొదటి విజయాన్ని ఇండస్ట్రీకి వచ్చిన రెండేళ్లకు 'మర్డర్ 2'తో అందుకుంది. అనంతరం ఐదేళ్లలో ఐదు భారీ హిట్లను సొంతం చేసుకుంది. మర్డర్​ 2, హౌస్​ ఫుల్​ 2, రేస్ 2, కిక్ వంటి బ్యాక్​ టు బ్యాక్ హిట్ చిత్రాలతో స్టార్ నటిగా ఎదిగింది. అయితే గత ఎనిమిదేళ్లుగా ఆమెకు ఎలాంటి హిట్ పడలేదు. 2016లో హౌస్​ ఫుల్ 3తో చివరిసారిగా విజయాన్ని అందుకుంది. చివరిసారిగా ఆమె 2022లో సర్కస్​ చిత్రంతో బాక్సాఫీస్ ముందు సందడి చేసింది. 2023లో సెల్ఫీ చిత్రంలో అతిథి పాత్రలో మెరిసింది. ప్రస్తుతం ఆమె అక్షయ్ కుమార్ నటిస్తున్న వెల్​కమ్​ టు జంగిల్ చిత్రంలో నటిస్తోంది.

రూ.3 కోట్లకు కొనుగోలు - అయితే జాక్వెలిన్ ఫెర్నాండెజ్​, 2012లో తన హోమ్ కంట్రీ లంకలో ఓ ప్రైవేట్ ఐలాంట్​ను కొనుగోలు చేసిందట. అప్పట్లో కేవలం రూ.3 కోట్లకే దాన్ని సొంతం చేసుకుందట. మర్డర్ 2, హౌస్​ఫుల్ 2 చిత్రాలు బ్యాక్​ టు బ్యాక్ హిట్​ అందుకున్న సమయంలో, రేస్​ 2కు సైన్​ చేసే ముందు తీసుకుందట. ఈ ప్రైవేట్​ ద్వీపాంలో ఓ విలాసవంతమైన భవనాన్ని నిర్మించాలని అనుకుందట. మరి దాన్ని నివాసంగా ఉపయోగించుకోవాలనుకుందా? లేదా వాణిజ్య ప్రయోజనాల కోసమా అనేది క్లారిటీ లేదు.

'దేవర' రాకకు మరో నెల రోజులే - ఇంట్రెస్టింగ్​గా తారక్​ డబుల్ షేడ్​ పోస్టర్​ - NTR Devara
చిరు నటించిన ఆ రెండ్ బ్లాక్ బస్టర్స్​కు సీక్వెల్​! : అనౌన్స్ చేసిన అశ్వినీ దత్​ - Chiranjeevi Hit Movie Sequel

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.