Jabardast Pavithra Breakup Reason : తెలుగు బుల్లితెరపై క్రేజ్ సంపాదించుకున్న వారిలో జబర్దస్త్ ఫేమ్ పవిత్ర ఒకరు. కెరీర్ పరంగా ఆమె మంచిగానే రాణిస్తోంది. మరోవైపు పర్సనల్ లైఫ్‌లో సంతోశ్ అనే కుర్రాడితో ప్రేమాయణం కూడా నడిపింది. అయితే రీసెంట్గా అతడికి బ్రేకప్ చెప్పి నెటిజన్లకు షాక్ ఇచ్చింది. తాజాగా పవిత్ర అతడికి ఎందుకు బ్రేకప్ చెప్పిందనే విషయం గురించి సమాచారం అందింది.
వివరాల్లోకి వెళితే. టిక్ టాక్ వీడియోలతో మొదటగా పాపులర్ అయింది పవిత్ర. ఆ తర్వాత జబర్దస్త్‌లోకి అడుగు పెట్టి ఆకట్టుకుంది. తనదైన కామెడీతో చాలా తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో ఆమెకు మంచి ఆఫర్లు వచ్చాయి. ఎన్నో షోలు, ఈవెంట్లలో భాగమై ఆడియెన్స్ అలరిస్తూ లైఫ్‌ను జబర్దస్త్‌గా గడుపుతోంది.
అలా కెరీర్ పరంగా మంచిగా రాణిస్తున్న జబర్దస్త్ పవిత్ర పర్సనల్ లైఫ్‌లో సంతోశ్ అనే కుర్రాడితో ప్రేమాయణం సాగించింది. ఈ విషయాన్ని తనే సోషల్ మీడియా ద్వారా అఫీషియల్‌గా కూడా తెలిపింది. అతడితో కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేసింది. ఆ తర్వాత ఓ షోలో భాగంగా వీరిద్దరు కలిసి మరీ సందడి చేశారు. సదరు షోలో వీరిద్దరికి డమ్మీ పెళ్లి కూడా చేశారు.
అయితే రీసెంట్గా వాలంటైన్స్ డేన పవిత్ర నెటిజన్లకు షాక్ ఇచ్చింది. ఇన్‌స్టాలో 'నా శ్రేయోభిలాషులు అందరికీ ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. పరస్పర అంగీకారంతో నేను, సంతోశ్ విడిపోయాం. మా దారులు వేరైనా ఒకరిపై ఒకరికి ఉన్న గౌరవం అలానే ఉంటుంది. ఈ కష్ట సమయంలో మా శ్రేయోభిలాషులు అర్థం చేసుకొని మాకు ప్రైవసీ ఇవ్వండి' అంటూ రాసుకొచ్చింది.
దీంతో చాలా మంది నెటిజన్లు షాక్ అయ్యారు. అదే సమయంలో ఇంత హడావిడి చేసి ప్రియుడికి జబర్ధస్త్ పవిత్ర బ్రేకప్ ఎందుకు చెప్పిందా అని ఆరాతీయడం మొదలుపెట్టారు. అసలు వీరిద్దరి మధ్య ఏం జరిగిందా అని తెగ ఆలోచించారు. ఈ క్రమంలోనే తాజాగా మరో సమాచారం బయటకు వచ్చింది. పెళ్లి తర్వాత ఇండస్ట్రీలో కొనసాగడానికి ఆమె ప్రియుడు అంగీకరించలేదట. అందుకే పవిత్ర అతడికి బ్రేకప్ చెెప్పిందని అంటున్నారు.
డీజే టిల్లునా మాజాకా - ఊహించని రేంజ్లో ఓటీటీ రైట్స్ డీల్!
రకుల్ తొలి జీతం ఎంతో తెలుసా? - అలాంటి పని చేసి సంపాదించిందట!