Jabardasth Getup Srinu : జబర్దస్ట్లో తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాడు గెటప్ శ్రీను. సినిమాల్లోనూ చిన్న పాత్రలతో మెప్పిస్తుంటాడు. ఈ మధ్య కాస్త ప్రాధాన్యమున్న పాత్రలతో గుర్తింపు కూడా తెచ్చుకున్నాడు. అలా ఇప్పుడు ప్రధాన పాత్రలో రాజు యాదవ్ అనే మూవీలో నటించాడు. ఈ చిత్రం మే 17న థియేటర్లలో విడుదల కానుంది. అయితే మామూలుగా సోషల్ మీడియాలోనే చిన్న బడ్జెట్ సినిమాలకు ఎక్కువ ప్రమోషన్స్ జరుగుతాయి. కానీ తాను ప్రధాన పాత్రలో నటించిన రాజు యాదవ్ మూవీ విడుదలయ్యే సమయంలో శ్రీను షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు. తాను సోషల్ మీడియాకు కొన్నాళ్లు దూరంగా ఉంటున్నట్టు పోస్ట్ చేశాడు. కానీ అందుకు గల కారణాన్ని తెలుపలేదు.
శ్రీను తన సోషల్ మీడియాలో పెట్టిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్గా మారింది. దీనిపై రకరకాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. శ్రీను మే 13వరకు సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ జనసేన తరపున ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. అందుకే ఎన్నికల ఫలితాలు వచ్చేవరకు సోషల్ మీడియాకు దూరంగా ఉంటాడు అని కొందరు అంటున్నారు. మరికొందరు మాత్రం తన సినిమా రిలీజ్ అయ్యాక మళ్లీ సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతాడు అని చెబుతున్నారు. అయితే ఇంకొందరు మాత్రం ఇది ఒక రకమైన మూవీ ప్రమోషన్ స్టంట్ అని, తన పోస్ట్ ద్వారా రాజు యాదవ్ సినిమాపై బజ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడని అంటున్నారు. ఏదిఏమైనా శ్రీను మళ్లీ సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యేవరకు ఈ విషయం మీద క్లారిటీ రాదు.
ఇక రాజు యాదవ్ చిత్రంలో - క్రికెట్ ఆడుతున్నప్పుడు బాల్ తగిలి ముఖం ఎప్పుడూ నవ్వుతూ ఉండిపోయే అబ్బాయి పాత్రలో శ్రీను కనిపించనున్నాడు. నీది నాది ఓకే కథ, విరాటపర్వం సినిమాలకు అసోసియేట్ డైరెక్టర్గా పనిచేసిన కృష్ణమాచారి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీకి హర్షవర్థన్ రామేశ్వర్ సంగీతం అందించగా కె. ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లెపల్లి కలిసి నిర్మించారు.
మరో హాలీవుడ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన టబు - Tabu Hollywood Film