Jabardast Actress Priyanka Nalkari Divorce : సినీ సెలబ్రిటీలు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో ఎప్పుడు విడిపోతారో అస్సలు చెప్పలేం. వీరి కాపురం మూడునాళ్ల ముచ్చటగానే ముగిసిపోవడం వారి అభిమానులను షాక్‌కు గురి చేస్తోంది. అప్పట్లో సమంత-నాగ చైతన్య, ఈ మధ్య ఐశ్వర్య-ధనుశ్, మెగా డాటర్ నిహారిక ఇలా పలువురు తమ బంధాల్ని తెగదెంపులు చేసుకున్నారు. వీటిని ఇంకా మర్చిపోనేలేదు ఇప్పుడు మరో నటి కూడా ఆ బాటలోనే నడిచింది. ఇంకా చెప్పాలంటే అసలీ నటి పెళ్లి చేసుకోవడమే ఓ సస్పెన్స్ అయితే, విడిపోవడం కూడా అలానే జరిగింది.
వివరాల్లోకి వెళితే. తెలుగమ్మాయి ప్రియాంక నల్కరి గురించి చాలా మంది బుల్లితెర ప్రేక్షకులకు తెలిసే ఉంటుంది. పలు తెలుగు టీవీ సీరియళ్లు, షోస్‌తో పాటు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి బాగానే పాపులర్ అయింది. జబర్దస్త్ లాంటి షోలతోనూ ప్రేక్షకులను అలరించింది. యాంకర్‌గానూ కొన్ని షోలు చేసి ఆకట్టుకుంది. ఆ తర్వాత తమిళ ధారావాహికలతో బిజీ అయిపోయింది. ఈమెనే తాజాగా విడాకులు తీసుకున్నట్లు తెలిసింది.
ప్రియాంక నల్కరి సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్‌తో ఎప్పటి లాగే ముచ్చటించింది. అయితే ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ మీరు, మీ భర్తతో విడిపోయారా అని ప్రశ్నించారు. దీనికి ఆమె అవును అని సమాధానం ఇచ్చింది. ఇక ఇది తెలుసుకున్నవారంతా షాక్ అవుతున్నారు. ఎందుకంటే అసలు కనీసం రూమర్స్ కూడా రాలేదు. డైరెక్ట్‌గా ఆమె విడిపోయామని సమాధానం చెప్పగానే ఈ విషయం హాట్ టాపిక్‌గా మారిపోయింది. మరి ఇందులో నిజమెంతో తెలీదు కానీ అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు.
ప్రియాంక గత ఏడాది మార్చిలో రాహుల్ వర్మ అనే నటుడిని మలేషియాలోని ఓ ఆలయంలో సైలెంట్ అండ్ సీక్రెట్‌గా వివాహమాడింది. అనంతరం పెళ్లి చేసుకున్న ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అభిమానులతో పంచుకుంది. కానీ ఆ తర్వాత ఇది సీక్రెట్ కాదు అనీ కుటుంబ సభ్యుల సమక్షంలోనే అని చెప్పింది. దీంతో ప్రేమించి సీక్రెట్‌గా పెళ్ళి చేసుకున్న ప్రియాంక రాహుల్ ఏడాది కూడా తిరక్కుండానే విడిపోవడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.
వాలంటైన్స్ డే : అనుపమ టు మృణాల్ ఠాకూర్ - ఈ ముద్దుగుమ్మల ప్రేమ కథలు తెలుసా?
రూట్ మార్చిన టాలీవుడ్ స్టార్స్ - ఈసారి సమ్మర్లో మరింత కొత్తగా!