IPL 2024 Tickets Online : ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 17 మరికొద్దిసేపట్లో అట్టహాసంగా ప్రారంభం కాబోతోంది. క్రికెట్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ మెగా టోర్నీ ఈ సాయంత్రం 6.30 గంటలకు (మార్చి 22) షురూ కానుంది. చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు తలపడడం వల్ల ఈ మ్యాచ్ పై భారీ హైప్ నెలకొంది. అటు ధోని, ఇటు కోహ్లీ ఫ్యాన్స్ చెపాక్ స్టేడియానికి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఈ మ్యాచ్‌లను నేరుగా తిలకించేందుకు ఆసక్తి చూపించే ఫ్యాన్స్ కోసం ఆయా ఫ్రాంచైజీలు టిక్కెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచాయి. మరి ఆ టిక్కెట్స్‌ను ఎలా, ఎక్కడ బుక్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
స్టెప్ 1: మీ ఫోన్ లేదా డెస్క్ టాప్ బ్రౌజర్‌ను ఉపయోగించి పేటీఎం ఇన్సైడర్ సైట్లో ఐపీఎల్ టిక్కెట్ బుకింగ్ పేజీని ఓపెన్ చేయండి. ఈ పేజ్ పేటీఎం మొబైల్ యాప్‌లోనూ ఉంటుంది.
స్టెప్ 2 : మీరు ఏ మ్యాచ్ అయితే చూడాలనుకుంటున్నారో దాన్ని సెలక్ట్ చేసుకోండి.
స్టెప్ 3: మీకు కావాల్సిన జట్టును సెలక్ట్ చేసుకుని BUY NOW బటన్ పై నొక్కండి.
స్టెప్ 4: ఇక్కడ మీరు ఏ స్టేడియంలో సీట్లను కొనుగోలు చేయాలనుకుంటున్నారో సెలక్ట్ చేసుకోండి.
స్టెప్ 5: మీకు కావాల్సిన బ్లాక్‌లో అందుబాటులో ఉన్న సీట్లను సెలక్ట్ చేసుకోండి.
స్టెప్ 6 : మీ సీట్లను సెలక్ట్ చేసుకున్న తర్వాత కార్డుకు జోడించు (ADD TO CART)బటన్ నొక్కితే అవి మీ కార్డును యాడ్ అవుతాయి.
స్టెప్ 7: టిక్కెట్స్ కోసం మీ పికస్ స్టేటస్‌ను సెలక్ట్ చేసుకోండి. డైరెక్టుగా టిక్కెట్లు తీసుకునేందుకు లేదంటే ఇ టికెట్ కోసం ఐడీని తీసుకెళ్లాల్సి ఉంటుంది.
స్టెప్ 8 : ఇప్పుడు పేమెంట్ చేసేందుకు మీ పర్సనల్ డీటెయిల్స్‌ను ఎంటర్ చేసి కంటిన్యూ బటన్ పై క్లిక్ చేయండి.
కేకేఆర్, ముంబయి ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్, లఖ్‌నవూ జట్ల మ్యాచ్‌ల కోసం బుక్ మై షోలో ఇలా టిక్కెట్స్ బుక్ చేసుకోవచ్చు :
స్టెప్ 1: బ్రౌజర్ లేదా మొబైల్ యాప్ ద్వారా BookMyShow స్పోర్ట్స్ విభాగానికి వెళ్లండి.
స్టెప్ 2: 'క్రికెట్'ని సెలక్ట్ చేసుకుని, మీరు చూడాలనుకుంటున్న మ్యాచ్‌ను ఎంచుకోండి.
స్టెప్ 3: కంటిన్యూ చేసేందుకు 'బుక్' నొక్కండి.
స్టెప్ 4: మీకు ఎన్ని సీట్లు కావాలో సెలక్ట్ చేసుకుని, 'సీట్లను ఎంచుకోండి' పై క్లిక్ చేయండి.
స్టెప్ 5: మీకు కావలసిన స్టేడియం బ్లాక్‌ని సెలక్ట్ చేసుకుని మీ బుకింగ్‌ను కన్ఫర్మ్ చేసుకోండి.
స్టెప్ 6: మీ పర్సనల్ వివరాలను ఎంటర్ చేయండి. టిక్కెట్ పికప్ లోకేషన్ వెరిఫై చేసుకోండి.
స్టెప్ 7: 'ప్రొసీడ్ టు పే' పై క్లిక్ చేసి, డబ్బులు చెల్లించండి.
ఆర్సీబీ మ్యాచ్‌ల టిక్కెట్‌ల కోసం నేరుగా ఆర్సీబీ వెబ్‌సైట్‌కి వెళ్లి బుక్ చేసుకోవల్సి ఉంటుంది:
స్టెప్ 1:రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు వెబ్‌సైట్‌కి వెళ్లి, 'టిక్కెట్‌లను కొనండి'పై క్లిక్ చేయండి.
స్టెప్ 2: జాబితా నుండి మీకు నచ్చిన మ్యాచులను సెలక్ట్ చేసుకోండి.
స్టెప్ 3: ఇప్పుడు మీకు కావాల్సిన స్టేడియం స్టాండ్, టిక్కెట్స్ ను సెలక్ట్ చేసుకోండి.
స్టెప్ 4: పికప్ లొకేషన్‌ని చెక్ చేసి, మీ వివరాలను ఎంటర్ చేయండి
స్టెప్ 5: ఇప్పుడు టిక్కెట్స్ కొనుగోలుకు కావాల్సిన పేమెంట్ ఆఫ్షన్‌ను ఎంపిక చేయండి. అంతే మీ టికెట్స్ రెడీ
ఐపీఎల్ 16 సీజన్లలో ఇప్పటివరకు బ్రేక్ కాని రికార్డులు ఏంటో తెలుసా ? - IPL 2024 CSK VS RCB