IPL Elections Effects Telugu Movies : మరికొద్ది రోజుల్లో సమ్మర్ వెకేషన్ ప్రారంభం కానుంది. దీంతో అందరూ తమ వెకేషన్ కోసం ఇప్పటి నుంచే పలు ప్లాన్స్ చేస్తుంటారు. కొందరేమో లాంగ్ టూర్‌కు వెళ్తే, మరికొందరేమో తమ సొంత ఊర్లకు వెళ్లి అక్కడ టైమ్ స్పెండ్ చేస్తుంటారు. అయితే ఇందులో చాలా వరకు థియేటర్లలో సినిమా చూసేందుకు మక్కువ చూపిస్తుంటారు. ఇలాంటి వారికోసమే మేకర్స్ కూడా ఇంట్రెస్టింగ్ సినిమాలతో వెండితెరపై సందడి చేస్తుంటారు.
ఈ సారి కూడా సమ్మర్ స్పెషల్‌గా పలు టాలీవుడ్ సినిమాలు విడుదలయ్యేందుకు సిద్ధమయ్యాయి. అయితే ప్రస్తుతం ఎక్కడ చూసిన ఐపీఎల్ ఫీవర్ నడుస్తోంది. దీంతో పాటు రానున్న కొద్ది రోజుల్లో ఎన్నికల జోరు కూడా ప్రారంభం కానుంది. ఈ రెండింటి ఎఫెక్ట్ సినిమాలపై పడుతుందేమో అంటూ మూవీ టీమ్ ఆందోళన చెందుతోంది.
సాధారణంగా సమ్మర్లో టాప్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ఐపీఎల్ జరుగుతున్నా కూడా ఆ సినిమాలపై అంత ఎఫెక్ట్ ఉండేది కాదు. దీంతో అటు ఐపీఎల్ ఇటు సినిమాలతో వేసవి సెలవులు కాస్త సందడి సందడిగా ఉండేది. కానీ ఈ ఏడాది ఐపీఎల్‌తో పాటు ఎలక్షన్స్ జరుగుతుండటం వల్ల మొత్తం పరిస్థితి తారుమారైంది. గత మూడు వారాలుగా అన్నీ చిన్న చిత్రాలే రిలీజ్ కానున్నాయి. అగ్ర తారల సినిమాలు కూడా రావాల్సింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల చివరి నాటికి, మరికొన్ని జూన్‌కు పోస్ట్‌పోన్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ నెలలో ప్రేక్షకుల ముందుకు వస్తామన్న పలు చిత్రాలు కూడా ఇప్పుడు వెనక్కి తగ్గుతున్నాయి.
ఆశిష్ కథానాయకుడిగా డైరెక్టర్ అరుణ్ రూపొందిన 'లవ్ మి' మూవీని ఈ ఏప్రిల్ 25న రిలీజ్ చేసేందుకుి చిత్ర బృందం భావించింది. ఇప్పుడు సినిమా విడుదల వాయిదా వేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక దీంతో పాటు నవదీప్ కీలక పాత్రలో కనిపించనున్న'లవ్ మౌళి' సినిమాను కూడా చిత్రబృందం పోస్ట్‌పోన్ చేయనుందట. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ఏప్రిల్ 19గా ఖరారు చేయగా, ఇప్పుడు ఈ సినిమా కూడా వాయిదా పడింది. త్వరలోనే కొత్త తేదీ చెబుతామంటూ హీరో నవదీప్ స్వయంగా తెలిపారు.
ఇదిలా ఉండగా, రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ కీలక పాత్రల్లో తెరకెక్కిన 'శశివదనే' సినిమా కూడా పోస్ట్‌పోన్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయట. తొలుత మేకర్స్ ఈ చిత్రాన్ని ఏప్రిల్ 19న విడుదల చేయాలనుకున్నారు. అయితే ఇప్పటివరకూ ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ కూడా రాలేదు. దీంతో ఈ సినిమా కూడా వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి.
OTTలో దూసుకెళ్తోన్న క్రైమ్ కామెడీ థ్రిల్లర్ - ట్విస్టులే ట్విస్ట్‌లు! - Dhanya Balakrishna