ETV Bharat / entertainment

'మెగా' క్రేజ్ - క్షణాల్లో అమ్ముడైన ఇంద్ర టికెట్స్!​ - హైప్​ ఎలా ఉందంటే? - Indra Movie Re Release

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 18, 2024, 12:52 PM IST

Indra Movie Re Release : మెగాస్టార్ చిరంజీవి, ఆర్తి అగర్వాల్​, సోనాలీ బేంద్రే లీడ్​ రోల్స్​లో వచ్చిన బ్లాక్​ బస్టర్ మూవీ 'ఇంద్ర' రీ రీలీజ్​ కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. మరీ బుకింగ్స్​ ఎలా ఉన్నాయంటే ?

Indra Movie Re Release
Indra Movie Re Release (ETV Bharat)

Indra Movie Re Release : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి బర్త్​డే (ఆగస్టు 22) స్పెషల్​గా సూపర్ హిట్​ బ్లాక్​బస్టర్ మూవీ 'ఇంద్ర'ను రీరిలీజ్ చేసేందుకు భారీ సన్నాహాలు జరగుతున్నాయి. రెండు రాష్ట్రాల్లో గ్రాండ్​గా విడుదల చేసేందుకు వైజయంతీ మూవీస్ సంస్థ ప్లాన్ చేస్తోంది. అయితే వీకెండ్ ప్లాన్స్​లో ఉన్న యూత్​, చిరు అభిమానులు ఈ అవకాశాన్ని బాగానే అందిపుచ్చుకున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా జోరుగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. చాలా చోట్ల హౌస్​ఫుల్​ బోర్డ్స్​ పెట్టేంతలా బుక్కింగ్స్ అయ్యాయి. కొన్ని చోట్ల అయితే క్షణాల్లోనే టిక్కెట్లు అమ్మడుపోతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో సింగిల్ స్క్రీన్స్ కూడా సోల్డవుట్ అయ్యాయని సమాచారం.

ఇదిలా ఉండగా, కేవలం 24 గంటల్లోనే దాదాపు 12 వేలకు పైగా టికెట్లు సేల్ జరిగినట్లు ట్రేడ్​ వర్గాల్లో టాక్ నడుస్తోంది. చూస్తుంటే ఈ బుకింగ్స్‌తోనే దాదాపు రూ. కోటి గ్రాస్ కలెక్షన్స్ రానున్నట్లు తెలుస్తోంది. నిర్మాణ సంస్థ కూడా పలు చోట్ల మరిన్నీ షోస్ యాడ్ చేస్తామని అధికారికంగా ప్రకటించడం వల్ల ఈ చిత్రానికి మరింత హైప్​ పెరిగింది.

ఇంద్ర సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు

  • తొలుత ఈ సినిమాలో ఓ హీరోయిన్‌గా కోలీవుడ్ నటి సిమ్రన్‌ని ఎంచుకున్నారు. కానీ ఆ తర్వాత ఆమె స్థానంలో ఆర్తి అగర్వాల్‌ని ఎంపిక చేశారు. సెకెండ్ లీడ్​గా బాలీవుడ్ బ్యూటీ సోనాలి బింద్రేని ఫైనల్ చేశారు.
  • చిరు రెమ్యూనరేషన్ కాకుండా సినిమా బడ్జెట్ సుమారు రూ.7 కోట్లు.
  • 120 రోజుల్లో సినిమా పనులను కంప్లీట్ చేశారు. అయితే మొత్తం పదకొండు పాటలను రూపొందించగా, అందులో అందులో 5 మాత్రమే ఫైనలైజ్ అయ్యింది. ఇందులో 'అయ్యో అయ్యో' సాంగ్‌కి మణిశర్మ అందుబాటులో లేనందున ఆ పాట బాధ్యతలను టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్ స్వరాలు సమకూర్చారు.
  • బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్లకుపైగా వసూళ్లు (గ్రాస్‌) సాధించిన తొలి టాలీవుడ్ సినిమాగా ఇంద్ర రికార్డుకెక్కింది. అయితే ఆ తర్వాత 'పోకిరి' మూవీ ఆ రికార్డును బ్రేక్ చేసింది. మొత్తం 268 స్క్రీన్‌లలో రిలీజైన ఈ చిత్రం పలు కేంద్రాల్లో 50, 100 అలాగే కొన్నింటిలో 175 రోజులు ఆడింది.

'ఇంద్ర' @20 ఇయర్స్​.. ఆ డైలాగ్​లను అలా రాశారు!

ఫ్యాన్స్ గెట్‌ రెడీ - ఒకే వేదికపై బాలయ్య, చిరు! - Chiranjeevi Balakrishna

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.