ETV Bharat / entertainment

9 ఏళ్లు నో హిట్​, పుట్​పాత్​లపై నిద్ర - ఇప్పుడు రూ.6300 కోట్లకు అధిపతి ఈ హీరో! - Indias Richest Actor - INDIAS RICHEST ACTOR

ఇండియాలోనే ధనవంతులైన నటులలో ఆయన టాప్‌లో ఉంటారు. ఒకప్పుడు సినిమా ఛాన్స్​ల కోసం ఫుట్​పాత్​లపై పడుకున్నారు. దాదాపు 9 ఏళ్ల పాటు హిట్ కోసం శ్రమపడ్డారు. ఇప్పుడు రూ.6300 కోట్లకు అధిపతిగా ఉన్నారు ఆ హీరో. ఎవరంటే?

Source Getty Images
Sharukh Khan (Source Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 5, 2024, 12:03 PM IST

Indias Richest Actor : అది 1993వ సంవత్సరం. ఒక బాలీవుడ్ నటుడు ఒక సినిమాకు రూ.కోటి రెమ్యూనరేషన్ తీసుకోవడం మొదలుపెట్టారు. అలా అప్పటి నుంచి మూడు దశాబ్దాలుగా ఒక్కో సినిమాకు ఎదుగుతూ, హిట్ కెరీర్‌తో వెలుగొందుతూ ఇండియన్ సినిమా మార్కెట్‌లో కింగ్ అయిపోయారు. ఒక్కో సినిమాకు రూ.100 కోట్ల రెమ్యునరేషన్​ అందుకోవడంతో పాటు సినిమాల్లో లాభాలు కూడా అందుకుంటున్నారు. అలా వేల కోట్లు సంపాదిస్తున్న హీరో మరెవరో కాదు బాలీవుడ్ బాద్ షా షారుక్​ ఖాన్. ఫుట్‌పాత్‌ల దగ్గర మొదలైన ఈయన ప్రయాణం విలాసవంతమైన మన్నత్ బంగ్లా వరకూ ఎలా సాగిందో తెలుసుకుందాం.

Sharukh Khan Net Worth : 30 ఏళ్లుగా బాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్ హీరోగా దూసుకెళ్తున్నారు షారుక్​ ఖాన్. సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్​లతో పాటు బాక్సాఫీస్​ దగ్గర పోటీపడుతూనే ఉన్నారు. అదే ఆయన్ను దేశంలోనే కాదు, ప్రపంచంలోనే అత్యంత ధనికుడైన నటుడిగా మార్చింది. ఇంగ్లీష్ మీడియా కథనాల ప్రకారం సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్ ఆస్తులు రూ.3వేల కోట్లు, రూ.1500 కోట్లు ఉంటే, అమితాబ్ బచ్చన్ ఆస్తుల విలువ రూ.3300 కోట్లు అని సమాచారం. కానీ, షారుక్​ ఖాన్​ ఆస్తులు విలువ మాత్రం రూ.6300 కోట్లు అని చెబుతున్నారు.

మిడిల్​ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన షారుక్ ఖాన్ తల్లి పబ్లిక్ సర్వెంట్​. షారుక్​ను​ దిల్లీ టాప్ స్కూల్స్​లో చదివించారు. అయితే బాద్​ షా చదువును పక్కకు పెట్టేసి టీవీ యాక్టర్ అవుదామనుకున్న వెంటనే ఆయన కష్టాలు మొదలయ్యాయి. ముంబయికు వచ్చిన వెంటనే ఎవరూ తెలియని సమయంలో ఎక్కడికీ వెళ్లేందుకు డబ్బుల్లేక రైల్వేస్టేషన్లో, ఫుట్‌పాత్‌ల మీద పడుకున్నారట. ఆ తర్వాత ఒక్కో మెట్టు ఎదుగుతూ వచ్చిన అవకాశాల్ని వినియోగించుకుంటూ బాంద్రాలో వందల కోట్లు విలువ చేసే మన్నత్ అనే ఇంటిని కట్టుకోగలిగారు.

కాగా, 2010 వరకు బాలీవుడ్‌లో కింగ్​లా వెలిగిపోయిన షారుక్​ 2013-14లోనూ 'చెన్నై ఎక్స్‌ప్రెస్', 'హ్యాపీ న్యూ ఇయర్' సినిమాలతో ఫర్వాలేదనిపించుకున్నారు. ఆ తర్వాత హిట్ కోసం తొమ్మిదేళ్లు ఆగాల్సి వచ్చింది. ఫ్యాన్, రాయీస్, జీరో చిత్రాలు ఘోరంగా విఫలమయ్యాయి. దీంతో 2018 నుంచి ఐదేళ్ల పాటు కంటెంట్​ కథలపై దృష్టి సారించి 2023లో 'పఠాన్', 'జవాన్'​తో వెయ్యి కోట్లు వసూలు చేసి స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చారు. ఆ తర్వాత నటించిన 'డంకీ' కూడా రూ.470కోట్లతో మంచి విజయాన్నే అందుకుంది.

ఆ విషయాన్ని నెగటివ్​గా చూడను : సమంత

సౌత్​ ఇండస్ట్రీపై కాజల్ షాకింగ్​ కామెంట్స్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.