Indian Superhero Movies : సూపర్ హీరో మూవీస్ అంటే వెంటనే గుర్తొచ్చేవి హాలీవుడ్ చిత్రాలు. అయితే మేం కూడా తక్కువేం కాదు అంటున్నాయి మన ఇండియన్ సూపర్ హీరో సినిమాలు. మరి ఆ సినిమాలు ఏవి ? వాటి స్ట్రీ ఏంటో ఈ వార్తలో చూసేద్దామా.
హనుమాన్ : ఇంతవరకు ఫిక్షన్ స్టోరీలో పాత్రలనే సూపర్ హీరోలుగా చూపించారు. కానీ ఇతిహాసాలలో ఉన్న పాత్రలను కూడా సూపర్ హీరోలుగా చూపించచ్చు అని నిరూపించారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఈ ఏడాది సంక్రాంతి బరిలో దిగి పెద్ద బడ్జెట్ చిత్రాలతో పోటీపడి అతిపెద్ద హిట్‌గా నిలిచింది 'హనుమాన్' మూవీ. స్టోరీ, గ్రాఫిక్స్, నటీనటుల యాక్షన్ ఇలా అన్నీ సూపర్‌గా ఉంటడం వల్ల ఈ సినిమా సూమారు 100 రోజుల పాటు థియేటర్లలో ఆడింది. ఇక ఈ మూవీ జియో సినిమాతో పాటు ఆహాలోనూ అందుబాటులో ఉంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
రావన్ : బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, కరీనా కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం 2011లో విడుదలైంది. శేఖర్ సుబ్రహ్మణ్యం అనే ఒక గేమ్ డెవలపర్, వర్చ్యువల్ రియాల్టీ గేమ్ కోసం పవర్ఫుల్ విలన్ అయిన రావన్‌ను తయారు చేస్తాడు. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో జరిగిన పొరపాటు వలన రావన్ ఈ ప్రపంచంలోకి వచ్చి శేఖర్ చావుకు కారణమవుతాడు. దీంతో శేఖర్ తనయుడు గేమ్‌లో ఉన్న శేఖర్ అవతార్ జీవన్ కూడా నిజమైన ప్రపంచంలోక్ తీసుకొస్తాడు. ఆ తర్వాత వారిద్దరి మధ్య జరిగే యుద్ధంలో ఎవరు గెలుస్తారనేది ఈ మూవీ స్టోరీ. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.
మిన్నల్ మురళి : లాక్డౌన్లో నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఓటీటీలో విడుదలైన 'మిన్నల్ మురళి' భిన్నమైన స్టోరీ లైన్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. టొవినో థామస్ సూపర్ హీరోగా నటించిన ఈ మూవీ ఫ్రెష్ సూపర్ హీరో కాన్సెప్ట్‌తో ఆడియెన్స్‌ను ఎంటర్టైన్ చేసింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
మిస్టర్ ఇండియా : బాలీవుడ్ స్టార్ హీరో అనిల్ కపూర్ లీడ్ రోల్లో నటించిన ఈ చిత్రం 90స్లో సంచలనం సృష్టించింది. తెలుగులో చిరంజీవి నటించిన జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమాకి రీమేక్‌గా హిందీలో తెరకెక్కిన ఈ మూవీలో రెండు భాషల్లో శ్రీ దేవి హీరోయిన్ గా నటించారు. అనాథ పిల్లలను పెంచుతున్న అరుణ్ వర్మకు ఓ వాచ్ లాంటి వస్తువు దొరుకుతుంది. ఆ వస్తువు వలన అరుణ్‌కు కొన్ని శక్తులు వస్తాయి. అతను మొగంబో అనే దుర్మార్గుడిని ఎలా ఎదుర్కొంటాడనేదే ఈ మూవీ స్టోరీ. ఈ చిత్రం జీ5లో అందుబాటులో ఉంది.
క్రిష్ : హృతిక్ రోషన్ లీడ్ రోల్లో వచ్చిన సూపర్ హిట్ మూవీ 'క్రిష్'. హిందీలో సెస్సేషన్ క్రియేట్ చేసిన 'కోయి మిల్ గయా' అనే సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ అందుకుంది. అయితే 'కోయి మిల్ గయా' జాదు క్రిష్ తండ్రి రోహిత్‌కి శక్తి ఇవ్వడం, ఆ తర్వాత బుద్ధి మాంద్యం ఉన్న రోహిత్ తెలివైనవాడిగా మారడం చూపించారు.
కానీ క్రిష్ మూవీలో మాత్రమే హృతిక్‌ను పూర్తి స్థాయి సూపర్ హీరోలా చూపించారు. ఇండియన్ సూపర్ హీరో సినిమాల్లో టాప్ ప్లేస్‌లో ఉన్న ఈ సినిమాకు మూడో పార్ట్ కూడా వచ్చింది. ఇక 'కోయి మిల్ గయా' జీ5లో స్ట్రీమ్ అవుతుండగా, 'క్రిష్' యూట్యూబ్‌లో ఫ్రీగా చూడొచ్చు. 'క్రిష్ 3' మాత్రం యూట్యూబ్‌లో రెంటల్ బేసిస్‌లో దొరుకుతుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
Krrish 4 Shooting : 'క్రిష్-4' కథకు హృతిక్ గ్రీన్ సిగ్నల్!.. త్వరలో సెట్స్‌పైకి సూపర్ హీరో మూవీ!