IIFA Utsavam 2024 Winners : సినీరంగంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఐఫా (IIFA-2024) అవార్డుల వేడుక అబుదాబి వేదికగా ఘనంగా జరుగుతోంది. ఈ ఈవెంట్‌లో రెండో రోజు ఏఆర్ రెహమన్, రానా, సమంత, బాలకృష్ణ, వెంకటేశ్ హాజరై సందడి చేశారు. ఈ వేడుకలో టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్‌కు చెందిన నటీనటులు పలు జాబితాల్లో అవార్డులు దక్కించుకున్నారు. ఈ వేడుకలో టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి మరో ప్రతిష్ఠాత్మక అవార్డును కైవసం చేసుకున్నారు. 'ఔట్ స్టాండింగ్ అచీవ్‌మెంట్ ఇన్ ఇండియన్ సినిమా' పురస్కారం అందుకున్నారు.నేచురల్ స్టార్ నాని ఉత్తమ నటుడు అవార్డును ముద్దాడారు. నందమూరి బాలకృష్ణ గోల్డెన్ లెగసీ అవార్డు సొంతం చేసుకున్నారు. ఉత్తమ విలన్ (తెలుగు) అవార్డ్ షైన్ టామ్ (దసర) దక్కించుకున్నారు. ఉమెన్ ఆఫ్‌ది ఇయర్ అవార్డును స్టార్ హీరోయిన్ సమంత గెలుచుకున్నారు. ఇంకా ఎవరెవరు ఏ కేటగిరీల్లో అవార్డులు గెలుచుకున్నారంటే?
- ఔట్ స్టాండింగ్ అచీవ్‌మెంట్ ఇన్ ఇండియన్ సినిమా - చిరంజీవి
- ఔట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఇండియన్ సినిమా - ప్రియదర్శన్
- ఉమెన్ ఆఫ్‌ది ఇయర్ - సమంత
- గోల్డెన్ లెగసీ అవార్డు - బాలకృష్ణ
- ఔట్ స్టాండింగ్ ఎక్సెలెన్స్ (కన్నడ)- రిషబ్ శెట్టి
- ఉత్తమ చిత్రం (తమిళం) - జైలర్
- ఉత్తమ నటుడు (తెలుగు)- నాని
- ఉత్తమ నటుడు (తమిళం)- విక్రమ్ (పొన్నియిన్ సెల్వన్ 2)
- ఉత్తమ నటి (తమిళం) - ఐశ్వర్యారాయ్ (పొన్నియిన్ సెల్వన్ 2)
- ఉత్తమ దర్శకుడు (తమిళం) - మణిరత్నం (పొన్నియిన్ సెల్వన్ 2)
- ఉత్తమ సంగీత దర్శకుడు (తమిళం) - ఏఆర్ రెహమన్ (పొన్నియిన్ సెల్వన్ 2)
- ఉత్తమ విలన్ (తమిళం) - ఎస్‌జే సూర్య (మార్క్ ఆంటోనీ)
- ఉత్తమ విలన్ (తెలుగు) - షైన్ టామ్ (దసర)
- ఉత్తమ సహాయ నటుడు (తమిళం) - జయరామ్ (పొన్నియిన్ సెల్వన్ 2)
- ఉత్తమ సినిమాటోగ్రఫీ - మిస్‌శెట్టి మిస్టర్ పోలిశెట్టి
- ఉత్తమ సాహిత్యం - జైలర్ (హుకుం)
- ఉత్తమ నేపథ్య గాయకుడు - చిన్నంజిరు (పొన్నియిన్ సెల్వన్ 2)
- ఉత్తమ నేపపథ్య గాయని - శక్తిశ్రీ గోపాలన్ (పొన్నియిన్ సెల్వన్ 2)
- ఉత్తమ విలన్ (మలయాళం) - అర్జున్ రాధాకృష్ణన్
#MegastarChiranjeevi garu received the " outstanding achievement in indian cinema" award in the presence of natasimham #NandamuriBalakrishna Garu and Victory @VenkyMama garu at the IIFA event in Abu Dhabi. ❤️
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) September 28, 2024
MEGASTAR #Chiranjeevi ✨ @KChiruTweets @IIFA @IIFAUtsavam pic.twitter.com/QsblNXta0D
'సత్యం సుందరం' రివ్యూ - మనసును హత్తుకునేలా ఫీల్ గుడ్ స్టోరీ! - Satyam Sundaram Movie Review