Richest Star Kid Bollywood : ప్రస్తుతం చాలా మంది బాలీవుడ్ ప్రముఖుల వారసులు సినిమాల్లో రాణిస్తున్నారు. ఈ జాబితాలో రణ్‌బీర్ కపూర్, అలియా భట్, జాన్వీ కపూర్, అనన్య పాండే వంటి చాలా మంది ఉన్నారు. వీరికి కుటుంబ నేపథ్యం వల్ల సినిమాల్లో ఎంట్రీ సులువుగా లభించిందని ఎక్కువ మంది భావిస్తారు. అయితే ఈ మచ్చను చెరుపుకొని తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యాక్టర్‌లు కూడా ఉన్నారు. వీరిలో స్టార్ హీరో హృతిక్ రోషన్ ఒకడు.
ప్రముఖుల వారసులకు మూవీ ఇండస్ట్రీలో వైఫల్యాలు ఎదురైనా, మళ్లీ అవకాశాలు లభిస్తూనే ఉంటాయని భావిస్తారు. డబ్బు, పలుకుబడితో చలామణి అవుతారని అంటారు. కానీ, సినిమా నిర్మాత రాకేశ్ రోషన్ కుమారుడు హృతిక్ రోషన్ మాత్రం స్టార్ కిడ్‌గా అడుగుపెట్టినా, కష్టపడి ఎదిగాడు. తన కెరీర్‌ని స్వయం కృషితో నిర్మించుకున్నారు. సినిమా హీరోగానే కాదు సక్సెస్‌ఫుల్ బిజినెస్‌మెన్‌గా కూడా నిలిచారు0.
హృతిక్ ప్రస్థానం
హృతిక్ రోషన్ 2000లో 'కహో నా ప్యార్ హై' మూవీతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత 'ధూమ్ 2', 'వార్', 'జిందగీ నా మిలేగీ దొబారా' వంటి ఇండస్ట్రీ హిట్‌లు అందుకున్నారు. 24 ఏళ్లుగా బాలీవుడ్‌లో టాప్ యాక్టర్‌గా కొనసాగుతున్నారు. అయితే హృతిక్ యాక్టింగ్‌తోనే ఆగిపోలేదు. భారీ వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారు. భారతదేశంలోని అత్యంత సంపన్న స్టార్ కిడ్స్‌లో ఒకడిగా మారారు.
ప్రస్తుతం హృతిక్ రోషన్ నెట్‌వర్త్ దాదాపు రూ.3100 కోట్లు ఉంటుందని అంచనా. అతడి తర్వాత రణ్‌బీర్ కపూర్ రూ.400 కోట్లు, అలియా భట్ రూ.550 కోట్లతో ఉన్నారు. అతడి సంపద ఏకంగా స్టార్ హీరోలు సల్మాన్ ఖాన్ (రూ.2900 కోట్లు), అమీర్ ఖాన్ (రూ.1862 కోట్లు)ను కూడా మించి పోయింది. అయినా బాలీవుడ్‌లో హృతిక్ అత్యంత ధనవంతుడు కాదు. ఈ స్థానాన్ని రూ.7300 కోట్ల నెట్ వర్త్‌తో షారుఖ్ ఖాన్ ఆక్రమించారు.
హెచ్ఆర్‌ఎక్స్ బ్రాండ్
2013లో హృతిక్ సొంత ఫిట్‌నెస్, లైఫ్‌స్టైల్ బ్రాండ్ HRXని ప్రారంభించారు. ఈ బ్రాండ్ దుస్తులు, బూట్లు, యాక్సెసరీల సహా అనేక రకాల ప్రొడక్టులు అందిస్తుంది. ప్రస్తుతం హెచ్‌ఆర్‌ఎక్స్ విలువ రూ.1000 కోట్లు. హృతిక్‌కి దీని నుంచే ఎక్కువ సంపాదన లభిస్తోంది.
నా తప్పులు సరిదిద్దేందుకు షూటింగ్ స్పాట్లో రజనీ అలా చేసేవారు : హృతిక్ రోషన్
అద్దె ఇళ్లలో సెలబ్రిటీలు - రెంట్‌కు ఇచ్చేది కూడా సినీ తారలే! - Celebrities Living In Rental Houses