Highest Paid Film Actor : ఏ పరిశ్రమకు సంబంధించిన సినిమాలో అయినా హీరో ఆ చిత్రాన్ని ముందుకు నడిపిస్తాడు. తన పాత్రకు అతను ఎంత న్యాయం చేస్తే సినిమా అంత బాగా వస్తుంది. తన యాక్టింగ్, డైలాగ్ డెలివిరీతో ఆ నటుడు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంటారు. అయితే ఒక వేళ ఏదైనా హీరో పాత్రకు పెద్దగా మాటలు లేకపోతే మరి ఏమవుతుంది ? ఓ స్టార్ హీరో చేసే పాత్రలు దాదాపు అలానే ఉంటాయి. కొన్ని సినిమాల్లో ఆ నటుడికి పెద్దగా డైలాగులు ఉండవు. కానీ సైలెంట్‌గా వచ్చి సంచలన విజయాలను అందుకుంటూ అత్యధిక రెమ్యూనరేషన్ అందుకుని రికార్డుకెక్కారు. ఆయన చెప్పే ఒక్కో పదానికి అక్షరాల రూ. 75 లక్షలను ఛార్జ్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇంతకీ ఆయన ఎవరంటే ?
హాలీవుడ్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన విజయం సాధించింది 'మ్యాట్రిక్స్' ఫ్రాంచైజీ. ఈ సినిమా నాలుగు భాగాలుగా తెరకెక్కింది. 1999లో వచ్చిన తొలి పార్ట్ సూపర్ హిట్ టాక్ అందుకోగా, ఆ తర్వాత 2003లో 'ద మ్యాట్రిక్స్ రీలోడెడ్', 'ద మ్యాట్రిక్స్ రెవల్యూషన్' అనే రెండు సీక్వెల్ థియేటర్లలో సందడి చేశాయి. భారీ అంచనాలతో వచ్చిన ఈ రెండు సినిమాలు అప్పట్లోనే సూపర్‌హిట్ టాక్ అందుకుని రికార్డుకెక్కాయి.
అందులో ప్రధాన పాత్ర పోషించిన ఇంగ్లీష్ నటుడు కీను రీవ్స్ పెద్ద స్టార్ అయిపోయారు. తన నటనతో ఆకట్టుకున్న ఈ స్టార్ వరల్డ్‌వైడ్ ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నారు. ఇక ఆ సీక్వెల్స్ ఆయన్ను సినీ చరిత్రలోనే అత్యధిక పారితోషికం అందుకున్న నటుడిగా చేశాయి. ఆ రెండు సినిమాలకు కలిపి ఆయన దాదాపు 100 మిలియన్ డాలర్లు ( అప్పటి ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ. 450 కోట్లు) రెమ్యూనరేషన్ అందుకున్నారు.
ఇందులో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆ రెండు సినిమాల్లో కీను పాత్ర కేవలం 638 పదాలు మాత్రమే మాట్లాడింది. దీనికి ఆయన 159,000 డాలర్లు(రూ. 75 లక్షలు) రెమ్యూనరేషన్ అందుకున్నట్లు సమాచారం.