ETV Bharat / entertainment

సీక్రెట్​గా లవర్​ను పెళ్లి చేసుకున్న హీరోయిన్ తాప్సీ - ఫొటోస్ వైరల్​! - Heroine Tapsee Pannu Marriage - HEROINE TAPSEE PANNU MARRIAGE

Heroine Tapsee Pannu Marriage : హీరోయిన్ తాప్సీ సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కొన్ని ఫొటోలు చక్కర్లు కొడుతున్నాయి.

సీక్రెట్​గా లవర్​ను పెళ్లి చేసుకున్న హీరోయిన్ తాప్సీ - ఫొటోస్ వైరల్​!

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 25, 2024, 2:01 PM IST

Heroine Tapsee Pannu Marriage : హీరోయిన్ తాప్సీ సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. డెన్మార్క్‌ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ మథియాస్‌ బోతో ఆమె చాలా కాలంగా రిలేషన్​షిప్​లో ఉంది. దాదాపు పదేళ్ల నుంచి వీరిద్దరూ కలిసి డేటింగ్ చేస్తున్నారు. అయితే తాజాగా ఈ లవ్ బర్డ్స్​ వివాహబంధంతో ఒక్కటైనట్లు మీడియాలో వార్తలు కనిపిస్తున్నాయి. మార్చి 20నే ప్రీవెడ్డింగ్‌ వేడుకలు ప్రారంభమైనట్లు ఆ కథనాల్లో రాసి ఉంది. 23న ఉదయ్‌పుర్‌లో తాప్సీ- మథియాస్‌ బోతో పెళ్లి జరిగిందని అంటున్నారు. అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ వివాహానికి హాజరైనట్లు సమాచారం అందుతోంది.

అలానే ఈ వార్తలకు బలం చేకూరేలా తాప్సీ బెస్ట్ ఫ్రెండ్‌, ప్రొడ్యూసర్‌ కనిక కూడా కొన్ని పిక్స్​ను షేర్ చేసింది. నా స్నేహితుల పెళ్లిలో అంటూ రాసుకొచ్చింది. దీంతో కనిక ఈ పెళ్లికే వెళ్లిందంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇంకా ఈ వేడుకకు బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రాలేదు. దీంతో అందరూ అఫీషియల్ అనౌన్స్​మెంట్​ కోసం తాప్సీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే చాలా మంది తనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇక్కడ ఫ్లాప్​ - అక్కడ హిట్ : ​ఇకపోతే టాలీవుడ్​లో సొట్ట బుగ్గల సుందరిగా తాప్సీ పేరు సంపాదించుకుంది. 'ఝమ్మంది నాదం' చిత్రంతో టాలీవుడ్​కు ఎంట్రీ ఇచ్చిన ఈ భామను రింగుల జుట్టు సుందరి అని కూడా అంటుంటారు. మాస్ మహారాజా రవితేజ, మంచు మనోజ్, గోపిచంద్, ప్రభాస్​​ సహా పలువురు హీరోలతో కలిసి యాక్ట్ చేసింది. కానీ తెలుగులో ఎన్ని చిత్రాలు చేసినప్పటికీ స్టార్ స్టేటస్ రాలేదు. కోలీవుడ్​లోనూ ఫెయిల్ అయింది. అనంతరం బాలీవుడ్​ చెక్కేసి వరుసగా సినిమాలు చేస్తూ హిట్స్​ను ఖాతాలో వేసుకుంది. ముల్క్ , బడ్లా, తప్పడ్ వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ఎక్కువగా విజయాలను అందుకుంది. రీసెంట్​గా గతేడాది డిసెంబర్​లో షారుక్ ఖాన్​ డంకీ చిత్రంతో ప్రేక్షకుల అలరించింది. ఈ సినిమా ఆశించినంత స్థాయిలో ఆడలేదు.

'కల్కి' విషయంలో బాంబ్ పేల్చిన కమల్ హాసన్ - ఇలా షాకిచ్చారేంటి? - Kalki 2898 Ad kamal Haasan

కళ్లు చెదిరిపోయాయి వర్మ - 53ఏళ్ల వయసులో రమ్యకృష్ణ అందం వేరే లెవల్​! - Ramya Krishna photoshoot

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.