ETV Bharat / entertainment

అతడితో పెళ్లి పీటలెక్కనున్న హీరోయిన్ రెజీనా​!

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 2, 2024, 7:02 PM IST

Regina Cassandra Marriage : ఇండస్ట్రీలో మరో హీరోయిన్​ పెళ్లి చేసుకోబోతుందని తెలుస్తోంది. ఓ బిజినెస్​మెన్​ను వివాహం చేసుకోబోతుందని అంటున్నారు. దాని గురించే ఈ కథనం.

అతడితో పెళ్లి పీటలెక్కనున్న హీరోయిన్ రెజీనా​!
అతడితో పెళ్లి పీటలెక్కనున్న హీరోయిన్ రెజీనా​!

Regina Cassandra Marriage : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు వస్తుంటారు. కానీ అందులో కొంతమంది మాత్రమే ఎక్కువ కాలం కొనసాగుతుంటారు. మిగతా వారు కొన్ని సినిమాలు చేసి స్టార్ స్టేటస్ సంపాదించుకున్నాక మళ్లీ మాయమైపోతారు. అలాంటి వారిలో రెజీనా ఒకరు. తక్కువ కాలంలోనే హీరోయిన్​గా మంచి క్రేజ్ దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ తన హాట్ అందాలతో, నటనతో అందరిని ఆకట్టుకుంటుంది. అయితే ఈమె త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నట్లు తెలుస్తోంది.

వివరాల్లోకి వెళితే : చెన్నైలో పుట్టి పెరిగింది రెజీనా. మొదటగా మోడలింగ్​తో కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత హీరోయిన్​గా మారిపోయింది. 2012లో శివ మనసులో శృతి అనే చిత్రంతో హీరోయిన్​గా ఎంట్రీ ఇచ్చి ఈ భామ ఆ తర్వాత కొత్తజంట, పిల్ల నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, రొటీన్ లవ్ స్టోరీ వంటి చిత్రాలతో విజయాలను అందుకుంది. అలా వరుస సినిమాలు చేస్తూ మంచి యూత్​లో మంచి క్రేజ్ దక్కించుకుంది. సోషల్ మీడియాలోనూ యాక్టివ్​గా ఉంటూ అందాలను ఆరబోసేది. కుర్రాళ్లు కూడా ఈమె గ్లామర్​కు బాగానే కనెక్ట్ అయ్యేవారు.

అయితే ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన పలు రూమర్స్​ కూడా ఎక్కువగానే వినిపించేవి. గతంలో హీరో సందీప్ కిషన్​తో రెజినా రిలేషన్​షిప్​లో ఉందని ప్రచారం సాగింది. ఆ ప్రచారాన్ని సందీప్ కిషన్ కొట్టి పారేశారు. ఆ తర్వాత మెగా హీరో సాయి ధరమ్ తేజను పెళ్లి చేసుకోబోతుందని అంతా అన్నారు. కానీ ఇది కూడా జరగలేదు. ఓ తమిళ్ స్టార్ హీరోతో రెజీనా లవలో పడిందని బాగానే వార్తలు వచ్చాయి.

అయితే అవన్నీ ఆ తర్వాత అసత్య ప్రచారాలేనని తేలిపోయింది. ఈ మధ్య ఆమె సినిమాల్లో కూడా ఎక్కువ కనపడట్లేదు. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఇతర హీరోయిన్స్​ తరహాలోనే ఆమె కూడా పెళ్లి పీటలెక్కబోతుందని అంటున్నారు. ఓ బిజినెస్ మ్యాన్​ను పెళ్లి చేసుకోబోతుందని చెబుతున్నారు. ఇప్పటికే ఇరు కుటుంబాల మధ్య చర్చలు కూడా జరిగాయని తెలిసింది. దసరాలోపు రెజీనా పెళ్లి జరిగే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. మరి ఇందులో నిజమెంతో తెలీదు. మరి ఇది కూడా ప్రచారంగానే మిగిలిపోతుందో లేదా నిజం అవుతుందో చూడాలి.

సెలైంట్​గా వరలక్ష్మీ శరత్​కుమార్ ఎంగేజ్​మెంట్​​ - కాబోయే మొగుడు ఎవరంటే?

ఓ ఊపు ఊపేసిన జాన్వీ - అనంత్‌ అంబానీ ప్రీ వెడ్డింగ్‌ వేడుకల్లో డ్యాన్స్ హంగామా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.