ETV Bharat / entertainment

'అందుకే నా మొఖంలో మార్పు' - ప్లాస్టిక్ సర్జరీపై మాట్లాడిన నయనతార - NAYANTHARA PLASTIC SURGERY

తాను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్లు చాలా కాలం నుంచి వస్తోన్న రూమర్స్​పై మాట్లాడిన హీరోయిన్ నయనతార!

Heroine Nayanthara Comments on Plastic Surgery
Heroine Nayanthara Comments on Plastic Surgery (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 28, 2024, 10:37 AM IST

Heroine Nayanthara Comments on Plastic Surgery : ప్రస్తుతం చిత్ర సీమలో హీరోయిన్స్​ ప్లాస్టిక్​ సర్జరీపై తీవ్రంగా చర్చ సాగుతోంది. వరుసగా హీరోయిన్లు తాము ఈ సర్జరీ చేయించుకున్నట్లు వస్తోన్న వార్తలపై స్పందిస్తున్నారు. తాజాగా హీరోయిన్ నయనతార కూడా ఈ విషయంపై స్పందించింది. తాను ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకున్నట్లు గతంలో వచ్చిన వార్తలను ఖండించింది. తన ముఖాన్ని మార్చుకోవాలని ఎప్పుడూ ప్రయత్నించలేదని తెలిపింది. ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అంశంపై మాట్లాడింది.

"నా కను బొమలు అంటే చాలా ఇష్టం. వాటి ఆకారాన్ని ఎప్పుడూ మార్చుకుంటూ ఉంటాను. ప్రతి రెడ్‌ కార్పెట్‌ ఈవెంట్లకు ముందు వీటిని మార్చుతాను. వాటి కోసం ఎంతో సమయాన్ని కేటాయిస్తాను. కనుబొమల ఆకారం మారినప్పుడల్లా నా ముఖంలో మార్పు కనిపిస్తుంది. బహుశా అందుకే నా ఫేస్​లో మార్పులు వచ్చాయని ప్రజలు అనుకుని ఉండొచ్చు. వాళ్లు అనుకున్నది మాత్రం నిజం కాదు. అలాగే డైటింగ్‌ వల్ల కూడా నా ముఖంలో మార్పులు రావొచ్చు. ఒక్కో సారి బుగ్గులు వచ్చినట్లు కనిపిస్తాయి. మరోసారి అవి లోపలికి వెళ్లినట్లు కనిపిస్తాయి. కావాలంటే మీరు నన్ను గిచ్చి కూడా చూడొచ్చు. నా శరీరంలో ఎక్కడా ప్లాస్టిక్‌ ఉండదు" అని నయనతార చెప్పుకొచ్చింది.

Nayanthara upcoming Movies : కాగా, 2003లో మలయాళం చిత్రంతో నయన తార చిత్ర పరిశ్రమకు పరిచయం అయింది. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో ఆమె చాలా సన్నగా కనిపించారు. దీంతో ఆమె ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకున్నారనే ప్రచారం మొదలైంది. తాజాగా నయనతార ఈ రూమర్స్​కు ఫుల్‌ స్టాప్‌ పెట్టింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లో వరుస సినిమాలు చేస్తోంది. గతేడాది ఏకంగా 3 సినిమాలతో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం ఐదు సినిమాలతో బిజీగా ఉంటోంది. ప్రస్తుతం టెస్ట్, మన్నన్​గట్టి సిన్స్​ 1960, డియర్ స్టూడెంట్స్, తని ఒరువన్ 2, మూకుథి అమ్మన్ 2 చిత్రాల్లో నటిస్తోంది.

టాలీవుడ్ హీరోలపై సూర్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్​

గయ్యాళి అత్త సూర్యకాంతంనే భయపెట్టిన 'ఆమె'- అప్పట్లో జరిగిన ఈ ఆసక్తికర సంఘటన తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.