ETV Bharat / entertainment

రిచెస్ట్​ ప్లేస్​లో ప్రాపర్టీ కొన్న కృతిసనన్​ - ఎన్ని కోట్లో తెలిస్తే షాకే! - kriti sanon Alibaug

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 11, 2024, 3:44 PM IST

Kriti Sanon Alibaug property : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ తాజాగా ఓ లగ్జరీయస్​ ప్రాపర్టీని కొనుగోలు చేసిందని తెలిసింది. సినీ, క్రీడా సెలబ్రిటీలు ఉండే ఖరీదైన ప్రాంతం అలీబాగ్​లో ప్లాట్ తీసుకున్నట్లు బీటౌన్ మీడియా వర్గాల్లో కథనాలు వస్తున్నాయి. దాని గురించి తెలుసుకుందాం.

source ETV Bharat
Kritisanon (source ETV Bharat)

Kriti Sanon Alibaug property : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ​ తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. 'వన్- నేనొక్కడినే', 'దోచెయ్' వంటి చిత్రాలతో టాలీవుడ్ ఆడియెన్స్​ను అలరించిన ఈమె చివరగా ప్రభాస్ 'ఆదిపురుష్' చిత్రంలో నటించి మెప్పించింది. తన మెస్మరైజ్​ పెర్​ఫార్మెన్స్​, అదిరిపోయే స్టైల్​, గ్లామర్​తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఆన్​స్క్రీన్​ చరీష్మాతో పాటు ఆఫ్​స్క్రీన్​లోనూ అంతే ఇంప్రెసివ్​గా హుందాగా ఉంటుంది.

యాక్టింగ్​తో పాటు ప్రొడ్యూసర్​గానూ రాణిస్తోంది కృతి. అలానే తన సంపాదనను పెట్టుబడిగా పెట్టి ఇతర వ్యాపారాలను చేస్తోంది. ఫ్యాషన్ రంగంలో 'మిస్ టేకెన్', ఫిట్​నెస్ రంగంలో 'ది ట్రైబ్', నిర్మాణ రంగంలో 'బ్లూ బటర్ ఫ్లై ఫిల్మ్'లతో పాటు సౌందర్య రంగంలో 'హైఫెన్' లాంటి వ్యాపారాల్లో రాణిస్తూ కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ఇక ఇప్పుడు రియల్​ ఎస్టేట్​లో పెట్టుబడులు పెడుతోందని తెలిసింది.

తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ ఖరీదైన ప్రాపర్టీని కొనుగోలు చేసినట్లు తెలిసింది. కృతిసనన్​కు ఇప్పటికే బెంగళూరులో ఓ కమర్షియల్ స్పేస్​, గోవాలో ఓ లగ్జరీ విల్లా ఉన్నాయట. ఇప్పుడు ముంబయి మెట్రోపొలిటన్​ రీజన్​, సెలబ్రిటీలు ఉండే అలీబాగ్​లో ఓ ప్రాపర్టీని కొనుగోలు చేసిందట. 2000వేల స్క్వేర్​ ఫీట్​ ప్లాట్​ను తీసుకుందట. ఇందులో గ్రీనరీ, అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయట. దీని విలువ రూ.2 కోట్లకుపైనే ఉంటుందని అంటున్నారు.

సుందరమైన ప్రాంతాల‌లో ఒక‌టిగా పేరు గాంచింది అలీబాగ్‌. బీచ్ కలిగి ఉన్న ఈ ప్రాంతం పర్యాటక ప్రదేశం కూడా. ఇప్పటికే అక్కడ బాలీవుడ్ బిగ్​ బీ అమితాబ్​ బచ్చన్, షారుక్ ఖాన్, క్రికెట్ దిగ్గజం స‌చిన్ టెందూల్కర్‌తో పాటు టీమ్‌ఇండియా స్టార్స్ ప్లేయర్స్​ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, మాజీ క్రికెటర్‌ అజిత్ అగార్క‌ర్‌, మాజీ కోచ్‌ ర‌విశాస్త్రికి సహా పలువురు సినీ, క్రీడా ప్రముఖులకు ఈ ఖరీదైన ప్రాంతంలో ప్రాపర్టీస్ ఉన్నాయి.

ఇక కృతి సనన్ సినిమాల విషయానికొస్తే రీసెంట్​గా 'క్రూ' సినిమాతో రూ.100 కోట్ల కలెక్షన్లను అందుకుంది. ప్రస్తుతం 'దో పత్తి' అనే సినిమాలో నటిస్తోంది.

'నాకు కాబోయే వాడు అలా ఉండాలి' - Kritisanon Relationship

రూ. 31 కోట్ల బంగ్లా - సొంత ప్రొడక్షన్ హౌస్​ - కృతి నెట్​వర్త్​ ఎంతంటే ? - Kriti Sanon Networth

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.