ETV Bharat / entertainment

షాకింగ్​ : విడాకులు తీసుకున్న స్టార్ హీరోయిన్​ - esha deol husband

ఫిల్మ్​ ఇండిస్ట్రీలో మరో స్టార్ హీరోయిన్​ విడాకులు తీసుకుంది. అఫీషియల్​గా అనౌన్స్​మెంట్ చేసింది. ప్రస్తుతం ఈ విషయం చిత్ర సీమలో హాట్ టాపిక్​గా మారింది.

విడాకులు తీసుకున్న స్టార్ హీరోయిన్​ - 12ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 7, 2024, 6:29 AM IST

Updated : Feb 7, 2024, 8:21 AM IST

Heroine Esha Deol Divorce : ఫిల్మ్​ ఇండిస్ట్రీలో డివొర్స్​ అంశం ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా మరో స్టార్ హీరోయిన్​ తన భర్త నుంచి విడాకులు తీసుకుంది.​ ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు హేమమాలిని పెద్ద కూతురు ఈషా దేఓల్​(హీరోయిన్​) తన భర్త నుంచి విడిపోయింది. తన 12 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి చెబుతూ ఈ విషయాన్ని ఆఫీషియల్‌గా ప్రకటించింది. పరస్పరం అంగీకారంతోనే విడిపోయినట్లు తెలిపింది. "పరస్పరం అంగీకారంతోనే భరత్‌ - నేను విడిపోయాం. అయితే పిల్లలు మాత్రం మాకు చాలా ముఖ్యం. భార్యభర్తలుగా విడిపోయినప్పటికీ తల్లిదండ్రులుగా వారికి ఎలాంటి ఇబ్బంది రానివ్వకుండా చూసుకుంటాం" అని చెప్పుకొచ్చింది. కానీ డివొర్స్​కు గల అసలు కారణాన్ని చెప్పలేదు ఈషా. దీంతో ఒక్కసారిగా ఆమె అభిమానులంతా షాక్‌ అవుతున్నారు. ప్రస్తుతం ఈ విషయం బీటౌన్​లో హాట్‌ టాపిక్​గా మారింది. అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు.

అప్పుడే లాస్ట్​ పోస్ట్​ : స్టార్‌ హీరోయిన్‌గా క్రేజ్ ఉన్న సమయంలోనే 2012లో భరత్‌ తక్తానీని పెళ్లాడింది ఈషా దేఓల్. ఆ తర్వాత యాక్టింగ్​కు బ్రేక్‌ ఇచ్చింది. ఇద్దరు పిల్లలకు తల్లైంది. గతేడాది వరకు భర్తతో అన్యోన్యంగా కనిపించింది. గత సంవత్సరంలో తమ పెళ్లి రోజు భర్తతో సన్నిహితంగా ఉన్న ఫొటోనూ కూడా షేర్ చేసింది. కానీ అదే లాస్ట్ పోస్ట్​. ఆ తర్వాత ఏమైందో గానీ తన పోస్ట్ చేసే ఫొటోల్లో పిల్లలు, తను మాత్రమే కనిపించేది. దీంతో వారి మధ్య మనస్పర్థలు తలెత్తినట్లు గుసగుసలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే తాజాగా ఆమె డివోర్స్ అంటూ షాక్ ఇచ్చింది.

కాగా, బాలీవుడ్‌ స్టార్‌ కపుల్‌ ధర్మేంద్ర-హేమమాలిని పెద్ద కుతురు ఈషా దేఓల్​. తల్లిదండ్రుల నటవారసత్వాన్ని పుణికిపుచ్చుకుని అతి చిన్న వయసులోనే ఈమె ఇండస్రీలోకి అడుగుపెట్టింది. అన్ని భాషల్లో కలిపి 30కి పైగా చిత్రాల్లో నటించి మెప్పించింది. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన 'యువ' సినిమాలో సూర్య సరసన నటించి సౌత్​లో ఫ్యాన్​ ఫాలోయింగ్​ను పెంచుకుంది.

గ్యారేజీలో నివాసం - 200 రూపాయల సంపాదన - ఇప్పుడు బీటౌన్​ సూపర్ స్టార్​

'ఓజీ' రిలీజ్ డేట్​ ఫిక్స్​ - హంగ్రీ చీతా ఆ రోజే రానున్నాడు

Last Updated : Feb 7, 2024, 8:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.