చిత్రం : జిగ్రా;
నటీనటులు : అలియా భట్, వేదాంగ్ రైనా, మనోజ్ పవా, రాహుల్ రవీంద్రన్;
రచన దర్శకత్వం : వాసన్ బాల;
హీరోయిన్ అలియా భట్ నటించిన లేటెస్ట్ మూవీ జిగ్రా. తమ్ముడిని కాపాడుకునేందుకు ఓ అక్క చేసిన పోరాటమే ఈ సినిమా కథ. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందంటే?
కథ ఇదే - చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన సత్యభామ ఆనంద్ (అలియా భట్), అంకుర్ ఆనంద్ (వేదాం రైనా) - బంధువుల దగ్గర పెరుగుతారు. బిజినెస్ పని మీద మరో సోదరుడితో కలిసి వెళ్లిన అంకుర్ చేయని తప్పునకు మాదక ద్రవ్యాల కేసులో ఇరుక్కుంటాడు. అతడికి మరణదండన విధిస్తుంది కోర్టు. ఈ విషయం తెలుసుకున్న సత్య తన తమ్ముడిని కాపాడేందుకు పోరాటం చేస్తుంది. ఈ క్రమంలో సత్యకు ఎదురైన పరిస్థితులేంటి? తమ్ముడికి పడిన మరణశిక్షను తప్పించేందుకు ఆమె ఏం చేసింది? అన్నదే ఈ చిత్ర కథ.
ఎలా ఉందంటే? - ఇలాంటి కథలతో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. దర్శకుడు వాసన్ బాలా తెరకెక్కించిన ఈ కథలో కొత్తదనం లేదు. అక్కడక్కడా చిన్న మెరుపులతో రొటీన్ కథతోనే తెరకెక్కించాడు. తమ్ముడిని కాపాడేందుకు సత్య చేసే ప్రయత్నాలన్నీ రొటీన్‌గానే సాగాయి. అక్కాతమ్ముళ్ల మధ్య బలమైన అనుబంధాన్ని సరిగా బిల్డ్ చేయలేదు. అయితే తన తమ్ముడికి ఉరిశిక్షను కాస్త ముందుగా అమలు చేసేందుకు అధికారులు నిర్ణయించడంతో సత్యభామ పూర్తి యాక్షన్ మోడ్‌లోకి దిగుతుంది. అప్పుడు చివరి అరగంటలో వచ్చే ఆ సన్నివేశాలు అలరిస్తాయి. ఇకపోతే జిగ్రాకు మరో ప్రధాన లోపం నిడివి.
ఎవరెలా చేశారంటే? - అలియా భట్ నటనపరంగా సినిమా మొత్తం ప్రభావం చూపింది. వేదాంగ్ రైనా, మనోజ్ పవా, రాహుల్ రవీంద్రన్ తమ పాత్రల పరిధిమేరకు నటించారు. దర్శకుడు వాసన్ బాల కథను తెరకెక్కించడంలో నిరాశపరిచాడనే అంటున్నారు.
చివరిగా: జిగ్రా కొత్తదనం లేని కథరా! అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
'మార్టిన్' రివ్యూ - ధృవ సర్జా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
దసరా వీకెండ్ స్పెషల్ - ఓటీటీలోకి 4 సూపర్ హిట్ సినిమాలు, 2 సిరీస్‌లు