ETV Bharat / entertainment

'బాబాయ్ టైటిల్ వాడినందుకు వణికిపోయా!': వరుణ్​ తేజ్​ - VARUN TEAJ MATKA

'తొలిప్రేమ' టైటిల్​పై వరుణ్ రియాక్షన్- మట్కా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్​లో క్లారిటీ!

Varun Teaj Pawan Kalyan
Varun Teaj Pawan Kalyan (Source: Getty Images (Left), ETV Bharat (Right))
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 2, 2024, 4:00 PM IST

Varun Teaj Matka Trailer : మెగా హీరో వరుణ్‌ తేజ్‌ లీడ్​ రోల్​లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'మట్కా'. డైరెక్టర్ కరుణకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. నవంబర్ 14న ఈ సినిమా థియేటర్లలో గ్రాండ్​గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో శనివారం మేకర్స్​ హైదరాబాద్​లో ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

అయితే ఈ ఈవెంట్​లో వరుణ్​కు తన బ్లాక్​బస్టర్ మూవీ 'తొలి ప్రేమ' గురించి ఓ ప్రశ్న ఎదురైంది. 'పవన్ కల్యాణ్ తొలి ప్రేమ టైటిల్ వాడారు. మరి మెగాస్టార్ టైటిల్ ఏది వాడాలని అనుకుంటున్నారు?' అన్న ప్రశ్నకు వరుణ్ సమాధానమిచ్చారు. 'ఆ టైటిల్ వాడేటప్పుడు నేను వణికిపోయా. బాబాయ్​కి అది కల్ట్ హిట్ సినిమా. దాని పేరు పాడు చేయకూడదని 100సార్లు ఆలోచించాకే ఆ పేరు పెట్టుకున్నాం. సినిమా చూసిన తర్వాత తప్పకుండా హిట్ అవుతుందనిపించాకే ఆ టైటిల్ పెట్టుకున్నాం' అని అన్నారు. 1958లో చిన్నతనంలోనే శరణార్థిగా బర్మా నుంచి వైజాగ్‌కు వచ్చిన హీరో వాసు ఒక్కో మెట్టు ఎక్కుతూ 'మట్కా' కింగ్‌లా ఎలా మారాడు? అనేది సినిమా కథ. ఈ సినిమా కోసం లుక్​తోపాటు డబ్బింగ్​లోనూ ఎంతో శ్రద్ధ తీసుకున్నామని వరుణ్ అన్నారు. ఇక ఈ 'మట్కా' పై ఎంతో కాన్ఫిడెంట్​గా ఉన్నట్లు వరుణ్ చెప్పారు.

40 ఏళ్ల క్రితం జరిగిన ఓ వాస్తవ సంఘటనను ఆధారంగా చేసుకొని తెరకెక్కించినట్లు డైరెక్టర్ కరుణ కుమార్‌ చెప్పారు. ఆ సమయంలో విశాఖపట్నం ఎలా ఉండేది? అక్కడ మనుషులు ఎలా ఉండేవారు? హీరో ప్రస్థానం ఎలా మొదలైంది? అనే విషయాలను సినిమాలో చూపించనున్నారు. 'వరుణ్‌తేజ్‌ని ఏవిధంగా చూడాలని అభిమానులు కోరుకుంటున్నారో ఈ సినిమాలో ఆ విధంగానే చూపించా. టీమ్‌ అంతా ఎంతో శ్రమించి దీనిని తీర్చిదిద్దాం. ఈరోజు నుంచి వరుస అప్డేట్స్​ ఇస్తాం' అని దర్శకుడు కరుణకుమార్‌ తెలిపారు.

కాగా, ఈ సినిమాలో యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్​గా నటించింది. నవీన్ చంద్ర కీలక పాత్ర పోషిస్తున్నారు. వైర ఎంటర్టైన్మెంట్ బ్యానర్​పై విజేంధర్ రెడ్డి, రజని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సుధీర్ 'మా నాన్న సూపర్‌ హీరో', వరుణ్ 'మట్కా' క్రేజీ గ్లింప్సెస్​- మీరు చూశారా? - Maa Nanna Super Hero

'OG స్టోరీ బాబాయ్ కంటే ముందు నేనే విన్నా - ఇది మీ ఊహకు అందదు' - Varun Tej on OG Movie

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.