ETV Bharat / entertainment

'తంగలాన్'​ దర్శకుడితో సూర్య - పొల్లాచ్చిలో వెంకీ పాట - Thangalan Director Suriya Movie - THANGALAN DIRECTOR SURIYA MOVIE

Thangalaan Director with Suriya : తంగలాన్ దర్శకుడు పా.రంజిత్​తో హీరో సూర్య ఓ సినిమా చేయనున్నట్లు తెలిసింది. ఇంకా వెంకటేశ్ - అనిల్​ రావిపూడి మూవీ షూటింగ్​కు సంబంధించిన అప్డేట్​ కూడా బయటకు వచ్చింది. ఈ రెండు చిత్రాలకు సంబంధించిన పూర్తి వివరాలు స్టోరీలో.

source ETV Bharat
suriya venkatesh (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 26, 2024, 6:35 AM IST

Thangalaan Director with Suriya : 'తంగలాన్‌'తో రీసెంట్​గా సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు దర్శకుడు పా.రంజిత్‌. మరోవైపు త్వరలోనే 'కంగువా' చిత్రంతో బాక్సాఫీస్‌ బరిలో దిగనున్నారు హీరో సూర్య. ఈ రెండు సినిమాలకు ప్రొడక్షన్ హౌస్​ స్టూడియో గ్రీన్‌ భాగస్వామిగా ఉంది. అయితే ఇప్పుడీ ముగ్గురు కలయికలో ఓ భారీ ప్రాజెక్ట్‌కు రానుందని సమాచారం.

వాస్తవానికి సూర్య - పా.రంజిత్‌ కాంబోలో ఓ సినిమా రానున్నట్లు ఆ మధ్య ప్రచారం సాగింది. జర్మన్‌ పేరుతో రానుందని వార్తలు వచ్చాయి. కానీ అది కార్యరూపం దాల్చలేదు.

అయితే ఇప్పుడు రంజిత్‌, స్టూడియో గ్రీన్‌తోనే తాజాగా మరో భారీ సినిమా చేసేందుకు అగ్రీమెంట్​ చేసుకున్నట్లు తెలిసింది. అది కూడా ఓ పెద్ద హీరోతో చేయనున్నారట. ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసింది. దీంతో ఈ ప్రాజెక్ట్‌ జర్మన్‌ అని కోలీవుడ్​ మీడియా వర్గాల్లో టాక్ నడుస్తోంది. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది. ఇకపోతే ప్రస్తుతం సూర్య కార్తీక్‌ సుబ్బరాజుతో ఓ సినిమా చేస్తున్నారు. అలానే పా.రంజిత్‌ తంగలాన్‌ 2 కూడా చేయాల్సి ఉంది.

Venkatesh Anil Ravipudi New Movie : విక్టరీ వెంకటేశ్‌ - అనిల్‌ రావిపూడి కాంబోలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 'ఎఫ్‌ 2', 'ఎఫ్‌ 3' చిత్రాల తర్వాత ఈ ఇద్దరి నుంచి రానున్న హ్యాట్రిక్‌ చిత్రమిది. సినిమాలో వెంకీ భార్యగా ఐశ్వర్య, మాజీ లవర్​గా మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. అయితే ఈ మూవీ కొత్త షెడ్యూల్‌ ఈ నెల రెండో వారంలో పొల్లాచ్చిలో మొదలైంది. ప్రస్తుతం అక్కడి బ్యూటీఫుల్​ లోకేషన్లలో వెంకటేశ్, ఐశ్వర్యలపై భార్యాభర్తల ప్రేమను తెలిపేలా ఓ సాంగ్​ను షూట్ చేస్తున్నారు. భీమ్స్‌ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్న ఈ సాంగ్​కు భాస్కర భట్ల సాహిత్యమందించగా, భాను మాస్టర్‌ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. క్రైమ్‌ డ్రామా బ్యాక్​డ్రాప్​తో ఇది రూపొందుతోంది. ఇందులో వెంకీ మాజీ పోలీస్​ ఆఫీసర్​గా కనిపించనున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. దిల్‌రాజు సమర్పణలో శిరీశ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సాయి పల్లవి నటించిన ఫస్ట్ మూవీ ఏంటో తెలుసా? - 'ప్రేమమ్'​ మాత్రం కాదు! - Sai Pallavi Debut Movie

టాలీవుడ్​కు కొత్త అందాలు - నందమూరి వారసుల కోసం ఇద్దరు భామలు - Tollywood Upcoming New Heroines

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.