Hero Raviteja Injured : టాలీవుడ్ స్టార్ హీరో రవితేజ తాజాగా షూటింగ్లో గాయపడ్డారు. 'ఆర్టీ 75' చిత్రీకరణ సమయంలో రవితేజ కుడిచేతికి గాయమవ్వగా, ఆ నొప్పితోనే షూటింగ్లో ఆయన పాల్గొన్నారు. అయినప్పటికీ గాయం ఎక్కువ కావడం వల్ల చిత్ర యూనియ్ ఆయన్ను ఆస్పత్రికి తరలించగా, అక్కడ డాక్టర్లు రవితేజకు శస్త్రచికిత్స చేసి, ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.
ఏమైందంటే?
హీరో రవితేజ ప్రస్తుతం '#RT75' అనే వర్కింగ్ టైటిల్‌తో తెరక్కెక్కుతున్న సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే సినిమా చిత్రీకరణలో భాగంగానే గురువారం షూట్ జరుగుతున్న సమంలో రవితేజకు గాయమైంది. ఇక రవితేజ గాయపడిన విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా 'గెట్ వెల్ సూన్' అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక '#RT 75'లో రవితేజ సరసన శ్రీలీల నటిస్తుండగా, ఈ మూవీతోనే రచయిత భాను భోగవరపు డైరెక్టర్‌గా ఇండస్ట్రీకి పరిచయమవుతున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతున్నట్లు సినీ వర్గాల మాట.
మిస్టర్ బచ్చన్ టాక్ ఎలా నడిచిందంటే?
ఇదిలా ఉండగా, తాజాగా రవితేజ 'మిస్టర్ బచ్చన్' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. యంగ్ డైరెక్టర్ హరీశ్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రస్తుతం యావరేజ్ టాక్‌తో నడుస్తోంది. అయితే తొలి రోజు మాత్రం డిసెంట్ కలెక్షన్లే వసూల్ చేసింది. ప్రీమియర్స్ కలిపి దేశవ్యాప్తంగా రూ.5.3 కోట్ల నెట్ కలెక్షన్ చెసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా. ఇక రవితేజ- హరీశ్ శంకర్ కాంబోలో తెరకెక్కిన మూడో సినిమా ఇది. నటన పరంగా రవితేజ అదరగొట్టినప్పటికీ సినిమా ఆశించినస్థాయిలో టాక్ అందుకోలేకపోయింది. అయితే హీరోయిన్ భాగ్య శ్రీ బోర్సే డ్యాన్స్, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది మంచి మార్కులు కొట్టేసింది. ఈ సినిమాతో పాటు బాక్సాఫీస్ ముందుకొచ్చిన రామ్, పూరి డబుల్ ఇస్మార్ట్ కూడా మిక్స్డ్ టాక్‌తో సరిపెట్టుకుంది. ఈ రెండు చిత్రాలు భారీ అంచనాలతోనే వచ్చినప్పటికీ అభిమానులను మెప్పించలేకపోయాయి.
'ఓవర్ చేయకు'- హరీశ్ శంకర్‌కు రవితేజ స్వీట్ వార్నింగ్! - Ravi Teja Harish Shankar