ETV Bharat / entertainment

SSMB 29పై రానా ఇంట్రెస్టింగ్ కామెంట్స్​ - MAHESH BABU SS RAJAMOULI SSMB 29

మహేశ్‌ బాబు - రాజమౌళి సినిమా SSMB 29పై హీరో రానా ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌.

Mahesh Babu Rana SS Rajamouli
Mahesh Babu Rana SS Rajamouli (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 21, 2024, 6:38 AM IST

Mahesh Babu SS Rajamouli : సూపర్ స్టార్ మహేశ్‌ బాబు - దర్శకుడు రాజమౌళి కాంబోలో రూపొందనున్న సినిమా #SSMB 29. తాజాగా దీనిపై హీరో రానా ఇంట్రెస్టింగ్ కామెంట్స్​ చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ - ఆ చిత్రం అన్ని బారియర్స్‌ను బ్రేక్‌ చేస్తుందని చెప్పారు.

"హాలీవుడ్‌ మూవీ అమెరికాలో ఎలా రిలీజ్‌ అవుతుందో SSMB 29 కూడా ఆ రేంజ్‌లోనే రిలీజ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కచ్చితంగా అది జరిగి తీరుతుంది. అంతకుముందు ఇండియన్‌ మూవీ అంటే వేరే దేశాల వారికి హిందీ సినిమాలు మాత్రమే తెలుసు.

ఇతర భాషల్లోనూ ఉంటాయన్న సంగతి తెలీదు. ఇప్పుడు మన చిత్రాల గురించి మాట్లాడుకుంటున్నారు. ఓటీటీల వల్ల సినిమాల పరంగా భాష పరిధులు తొలిగిపోయాయి. పెద్ద సినిమాలే కాకుండా, మన స్థానిక కథలతో రూపొందిన ఇండిపెండెంట్ చిత్రాలను కూడా చూసేందుకు ఈ ప్రపంచం సిద్ధంగా ఉంది" అని రానా అన్నారు.

ఇకపోతే తాను వ్యాఖ్యాతగా వ్యవహరించిన కొత్త టాక్‌ షో 'ది రానా దగ్గుబాటి షో' ప్రమోషన్స్‌లో రానా ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా ఈ నెల 23 నుంచి ఈ రానా దగ్గుబాటి షో స్ట్రీమింగ్‌ కానుంది. రిషబ్‌ శెట్టి, నాని సహా పలువురు ఈ కార్యక్రమంలో సందడి చేశారు. సీజన్‌ 1లో 8 ఎపిసోడ్లు ఉన్నాయి. ఒక్కో ఎపిసోడ్‌ 40 నిమిషాల నిడివితో రూపొందినట్లు రానా తెలిపారు.

ఇకపోతే మహేశ్‌ - రాజమౌళి సినిమా ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా? అని సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. #SSMB29 వర్కింగ్‌ టైటిల్‌తో ఇది రూపొందనుంది. ఇప్పటికే ఈ చిత్రం కోసం మహేశ్​ లుక్ మార్చిన సంగతి తెలిసిందే.

ఈ చిత్రంలో ఆర్‌ఆర్‌ఆర్‌లో ఉన్న జంతువుల కన్నా ఎక్కువ జంతువులు ఉంటాయని దర్శకుడు రాజమౌళి ఆ మధ్య ఓ ఈవెంట్‌లో చెప్పారు. అమెజాన్‌ అడవుల బ్యాక్​డ్రాప్​తో సాగే ఈ కథలో పలువురు విదేశీ నటులు కూడా నటించనున్నారు. భారతీయ భాషలతో పాటు, విదేశీ భాషల్లోనూ ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి గరుడ అనే టైటిల్‌ పరిశీలనలో ఉంది.

ఇకపై థియేటర్లలోకి వారికి నో ఎంట్రీ - చిత్ర నిర్మాతల మండలి కీలక నిర్ణయం

భాగ్య‌శ్రీ బోర్సేకు మరో సూపర్ ఛాన్స్​ - బడా నిర్మాణ సంస్థ బ్యానర్​లో

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.