ETV Bharat / entertainment

'ప్రభాస్ మేం చెప్పిన రోల్ చేయట్లేదు- తనకి నచ్చింది చేస్తున్నాడు' - Kannappa Prabhas - KANNAPPA PRABHAS

Kannappa Prabhas: మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న కన్నప్ప సినిమాపై కీలక అప్‌డేట్ వచ్చింది. హీరో విష్ణు స్వయంగా ఈ అప్డేట్ గురించి, ప్రభాస్ పాత్ర గురించి వెల్లడించారు.

Kannappa Prabhas
Kannappa Prabhas (Source: ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 12, 2024, 12:11 PM IST

Updated : May 12, 2024, 12:30 PM IST

Kannappa Prabhas: మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. విష్ణు ఎప్పటికప్పుడు ఈ ప్రాజెక్ట్​ అప్డేట్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. రీసెంట్​గా రెబల్ స్టార్ ప్రభాస్ కూడా షూటింగ్​లో జాయిన్ అయ్యారని విష్ణు ట్వీట్ చేశారు. పాన్ఇండియా స్టార్ ప్రభాస్ రాకతో సోషల్ మీడియాలో కన్నప్ప ఒక్కసారిగా ట్రెండింగ్​లోకి దూసుకొచ్చింది. ఈ నేపథ్యంలో సినిమా గురించి ఓ అప్డేట్ ఇస్తూ, ప్రభాస్ పాత్ర గురించి హీరో విష్ణు స్వయంగా పలు విషయాలు షేర్ చేసుకున్నారు.

'కన్నప్ప అప్‌డేట్స్‌లో భాగంగా ప్రభాస్ సెట్స్‌లోకి వస్తున్నాడని ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే ఇది ట్విట్టర్​లో ట్రెండ్ అయిపోయింది. ఎంటర్‌టైన్మెంట్ కేటగిరీలో దేశం మొత్తం అదే హాట్ టాపిక్​గా నిలిచింది. వాస్తవానికి కన్నప్ప మల్టీ స్టారర్ కాదు. చాలా మంది సూపర్ స్టార్స్ నటిస్తున్న సాలిడ్ కథాంశంతో కూడిన సినిమా. ఇందులోని పాత్రలకు టాప్ స్టార్స్ మాత్రమే కావాలని ప్లాన్ చేశాం. ప్రభాస్‌ను కూడా నటించమని అడిగి కథ వినిపించాం. తర్వాత మేం ఒక పాత్ర చేయమని అడిగితే ప్రభాస్ ఇంకొక రోల్‌కు యస్ చెప్పాడు. ప్రభాస్ చెప్పిన దానికి నేను కూడా ఓకే అన్నాను. ఆయన శైలికి తగ్గట్టుగా పాత్రను కూడా డెవలప్ చేశాం' అని విష్ణు అన్నారు.

'మనం అడిగిన దాని కంటే ఆయనకు నచ్చిన పాత్ర చేయడం వల్ల ఇంకా బెస్ట్ ఇవ్వగలడని నా అభిప్రాయం. అయితే ఈ సినిమాలో ఎవరెవరు ఏ పాత్రలో నటిస్తున్నారో ఒకొక్కటిగా సమయాన్ని బట్టి అప్‌డేట్స్ ఇస్తుంటాం. క్యారెక్టర్లను మేం పరిచయం చేసేంతవరకూ ఎటువంటి నిర్ధారణకు రావద్దు. పుకార్లను విని నిజమనుకోకండి. సిల్వర్ స్క్రీన్ మీద చూడాలని మీరు ఎంతగా ఎదురుచూస్తున్నారో, దానిని మీ ముందుకు తీసుకురావాలని మేం కూడా అంతే ఆత్రుతగా ఉన్నాం. సోమవారం మే 12న మీకు సూపర్ అప్‌డేట్ ఉంటుంది' అని మంచు విష్ణు వెల్లడించారు.

ముకేశ్ కుమార్ సింగ్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో టైటిల్ రోల్‌ అయిన కన్నప్పను మంచు విష్ణు పోషిస్తున్నారు. సోమవారం మరో లేటెస్ట్ అప్‌డేట్‌ ఇవ్వనున్నారు. ఈ సినిమాలో మోహన్ బాబు, అక్షయ్ కుమార్, మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్, నయనతార, మధుబాలతోపాటు ఇతర ప్రముఖులు నటిస్తున్నారు. ఈ సినిమాను మంచు విష్ణు సొంత బ్యానర్ Ava ఎంటర్‌టైన్మెంట్‌తో పాటు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. ఈ సినిమాకు స్టీఫెన్ డేవస్సీ, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

'కన్నప్ప' సెట్స్​లోకి ప్రభాస్ ఎంట్రీ- నందీశ్వరుడి పాత్రేనా? - Kannappa Movie Shooting

కన్నప్పలో ప్రభాస్​ శివుడు కాదట - ఏ పాత్రలో కనిపించనున్నారంటే? - Prabhas Kannappa

Last Updated : May 12, 2024, 12:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.