ETV Bharat / entertainment

'అలాంటి సినిమాలు చూడటమంటే ఇష్టం' - Pawan Kalyan Favourite Movies - PAWAN KALYAN FAVOURITE MOVIES

HariHara Veeramallu Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల గురించి, పొలిటికల్ కెరీర్ గురించి అందరికీ తెలిసిందే. కానీ తన పర్సనల్ ఇష్టాల గురించి, అలవాట్లు గురించి చాలా వరకూ సీక్రెట్​గానే​ మెయిన్​టెయిన్​ చేసే పవన్ తాాజాగా తాను రాత్రి పూట ఎలాంటి సినిమాలు చూసేందుకు ఇష్టపడతారో చెప్పుకొచ్చారు.

.
.
author img

By ETV Bharat Telugu Team

Published : May 2, 2024, 11:08 AM IST

HariHara Veeramallu Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు సినిమాలతో, ఇటు పాలిటిక్స్​తో బిజీగా ఉంటున్నారు. ప్రస్తుతం ఏపీ సాధారణ ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ రోడ్ షోలు, బహిరంగ సభలు అంటూ గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఓ నేషనల్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో ర్యాపిడ్ ఫైర్ పేరుతో అడిగిన ప్రశ్నలకు ఆశ్చర్యకరమైన సమాధానాలిచ్చారు.

అలానే తనకు రాత్రి సమయంలో హార్రర్ సినిమాలు చూడటమంటే ఇష్టమని తెలిపారు. అలా చూడటం వల్ల తన మైండ్‌ను ప్రశాంతంగా ఉంచుకోగలనని వివరించారు. "నేను బయట ప్రపంచంలో కనిపించే దెయ్యాల కన్నా, స్క్రీన్​లో కనిపించే దెయ్యాలను చూడటానికే ఇష్టపడతాను" అని అనూహ్యమైన సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట్లో బాగా వైరల్ అవుతోంది. యాక్షన్ లవ్​ సినిమాలు చేసే పవన్ ఈ ఆన్సర్ చెప్పడం కొత్తగా ఉందంటూ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

కాగా, పొలిటీషియన్ కమ్ యాక్టర్ అయిన పవన్ కళ్యాణ్ ఈ మధ్య రాజకీయాలకు సింక్ అయ్యే డైలాగులను సినిమాల్లో వాడేస్తూ ప్రత్యర్థులకు కౌంటర్లు విసిరుతున్నారు. రీసెంట్​గా హరీశ్ శంకర్ డైరక్షన్‌లో రాబోయే ఉస్తాద్ భగత్ సింగ్‌లో "గ్లాస్ పగిలే కొద్దీ పదునెక్కుద్ది" అంటూ చెప్పిన డైలాగ్, తాజాగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న హరిహర వీరమల్లు సినిమాలో "దొంగ దొరల లెక్కలు సరి చేయడానికి దేవుడొకరిని పంపిస్తాడని" చెప్పిన వాయీస్ ఓవర్ అభిమానుల్ని తెగ ఆకట్టుకుంటున్నాయి.

ప్రస్తుతం పవన్ చేతిలో బోలెడు ప్రాజెక్టులు ఉన్నాయి. దే కాల్ హిమ్ ఓజీ (OG), ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh), హరి హర వీర మల్లు (Hari Hara Veera Mallu) సినిమాలను ఈయన పూర్తి చేయాల్సి ఉంది. వీటిల్లో ముందుగా 2024 సెప్టెంబర్ 27న "ఓజీ" చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు తెలిసింది. ఈ చిత్రానికి సుజిత్ దర్శకత్వం వహిస్తుండగా, డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రూ.250 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టులో బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అలానే పవన్ నటిస్తున్న హరిహర వీరమల్లు కూడా ఈ ఏడాదే రాబోతున్నట్లు అఫీషియల్​గా అనౌన్స్​ చేశారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ధర్మం కోసం యుద్ధం - రెండు భాగాలుగా వీరమల్లు - పవర్​ఫుల్​ టీజర్​ చూశారా? - HARI HARA VEERA MALLU TEASER

'ఆ దర్శకుడిని ముసుగేసి కొడితే రూ.10 వేలు'- జక్కన్న షాకింగ్ ఆఫర్! - Rajamouli

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.