Hari Hara Veera Mallu Teaser : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లీడ్ రోల్లో రూపొందుతున్న హరిహర వీరమల్లు నుంచి త్వరలో సాలిడ్ టీజర్‌ను రానున్నట్లు ఆ మూవీ ప్రొడక్షన్ టీమ్ అయిన మెగా సూర్య ప్రొడక్షన్స్ తాజాగా అనౌన్స్ చేసింది. 'ధర్మం కోసం యుద్ధం' అంటూ ఓ పోస్టర్‌ను విడుదల చేసి అందులో టీజర్ రిలీజ్ డేట్‌ను వెల్లడించారు. మే 2న ఉదయం 9 గంటలకు రానున్నట్లు తెలిపారు. ఇది విన్న ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తున్నారు. 'ఎప్పటి నుంచో దీని కోసమే ఎదురుచూస్తున్నాం. వెయిట్ ఈజ్ ఓవర్' అంటూ కామెంట్లు పెడుతున్నారు.
-
𝐁𝐀𝐓𝐓𝐋𝐄 𝐅𝐎𝐑 𝐃𝐇𝐀𝐑𝐌𝐀 ⚔️🔥
— Mega Surya Production (@MegaSuryaProd) April 30, 2024
Teaser of the much-anticipated #HariHaraVeeraMallu will be out on MAY 2nd @ 9:00 AM! 💥#HHVMTeaserOnMay2nd ❤️🔥@PawanKalyan @DirKrish @thedeol @AgerwalNidhhi @mmkeeravaani @AMRathnamOfl @ADayakarRao2 @rathinamkrish @gnanashekarvs pic.twitter.com/h69e6miNdE
గత కొంత కాలంగా ఈ చిత్రానికి సంబంధించిన ఎటువంటి అప్డేట్స్ రాకపోవడం ఇక ఈ మూవీ ఆగిపోయిందంటూ నెట్టింట రకరకాల రూమర్స్ వినిపించాయి. అయితే ఈ చిత్ర నిర్మాత ఏఎమ్ రత్నం ఇటీవలె వాటన్నింటికీ చెక్ పెట్టారు. ఓ ఈవెంట్లో ఆయన ఈ విషంపై క్లారిటీ ఇచ్చారు.
"పవన్ కల్యాణ్‌తో సినిమా తీసి దాని ద్వారా డబ్బులు సంపాదించుకోవాలంటే 20 రోజులు ఆయన డేట్స్ తీసుకొని మేము ఏదోఒకటి తీయెచ్చు. కానీ, ఆయనతో తీసే సినిమా ఆడియెన్స్‌కు ఎప్పటికీ గుర్తుండిపోవాలి. దాని వల్ల ఆయనకు మంచి పేరు రావాలి. నేను తీస్తోన్న మొదటి పాన్ ఇండియా మూవీ ఇది. ఈ సినిమా షూటింగ్ ఇక ఆగిపోయిందంటూ కొంతమంది సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అందులో ఎటువంటి నిజం లేదు. దాన్ని మీరెవ్వరూ అస్సలు నమ్మకండి. 'హరిహర వీరమల్లు' ఆగిపోలేదు. దీనికి సీక్వెల్ కూడా ఉంటుంది. ఈ సినిమాతో పవన్ మరో స్థాయికి వెళ్తారు" అంటూ నిర్మాత ధీమా వ్యక్తం చేశారు.
Harihara Veeramallu Cast : ఇక సినిమా విషయానికి వస్తే - 17వ శతాబ్దం నేపథ్యంలో సాగే ఈ మూవీలో పవన్ ఓ వీరోచిత బందిపోటుగా కనిపించనున్నారట. ఈయనతో పాటు యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్, బాలీవుడ్ నటుడు బాబీ దేవోల్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. మొఘలుల కాలం నాటి చారిత్రక నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాకు కీరవాణి స్వరాలు అందిస్తున్నారు.
పవన్ కల్యాణ్ 'హరిహర వీరమల్లు' డైలాగ్ లీక్- 'యానిమల్' విలన్ అంత పని చేశాడా!