ETV Bharat / entertainment

'హనుమాన్' సక్సెస్​ - ఆ స్టార్ హీరోతో వరలక్ష్మీ శరత్​కుమార్ పెళ్లి! - శింబు వరలక్ష్మీ శరత్​ కుమార్ పెళ్లి

Hanuman Movie Varalakshmi Sarathkumar Marriage : క్రాక్​, వీరసింహారెడ్డి, హనమాన్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి వరలక్ష్మీ శరత్​కుమార్ పెళ్లికి సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఓ స్టార్ హీరోతో పెళ్లికి రెడీ అవుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఆ వివరాలు.

'హనుమాన్' సక్సెస్​ -  ఆ స్టార్ హీరోతో వరలక్ష్మీ శరత్​కుమార్ పెళ్లి!

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 30, 2024, 5:20 PM IST

Hanuman Movie Varalakshmi Sarathkumar Marriage : సీనియర్​ హీరో, నటుడు శరత్ కుమార్ కూతురిగా చిత్ర పరిశ్రమలోకి ఎంట్రి ఇచ్చిన నటి వరలక్ష్మీ శరత్​ కుమార్​. ఈమె మొదట హీరోయిన్​గానే వచ్చినప్పటికీ అనుకున్నంత రేంజ్​లో స్టార్ హీరోయిన్​ అవ్వలేకపోయింది. ఆ తర్వాత క్యారెక్టర్​ ఆర్టిస్ట్​గా మాత్రం మంచి పేరు సంపాదించుకుంది. ప్రతినాయికగా, సహాయ నటిగా వైవిధ్యభరితమైన పాత్రలు పోషిస్తూ ఆడియెన్స్​ను ఆకట్టుకుంది. ఈ మధ్యే పాన్ ఇండియా బ్లాక్ బస్టర్​ హిట్​ చిత్రం 'హనుమాన్'​లోనూ అంజ‌మ్మ‌ పాత్రలో తన నటనతో మెస్మరైజ్​ చేసింది. అయితే తాజాగా ఈమె పెళ్లి గురించి మరోసారి వార్తలు తెరపైకి వచ్చాయి. ఓ స్టార్ హీరోను పెళ్లి చేసుకోనుందని బయట కథనాలు చక్కర్లు కొడుతున్నాయి.

వివరాల్లోకి వెళితే సీనియర్ ​నటుడు శరత్​కుమార్ కుమార్తెగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన వరలక్ష్మీ కథానాయకురాలిగా కాకుండా లేడీ విలన్​గా మంచి ఆదరణను దక్కించుకుంది. ఈమె నటించిన సర్కార్, పందెం కోడి 2, తెనాలి రామకృష్ణ బీఎల్, క్రాక్ వంటి పలు తమిళ, తెలుగు చిత్రాలు ఆడియెన్స్​ను బాగా ఆకట్టుకున్నాయి. వీటిలో ఆమె విలనిజంకు అందరూ ఫిదా అయ్యారు. దీంతో ఆమెకు తెలుగులో మరిన్ని అవకాశాలు వచ్చాయి.

అలా గతేడాది బాలయ్య వీరసింహారెడ్డిలో ఓవైపు చెల్లి పాత్రలో మరోవైపు విలన్ పాత్రలో పవర్​ ఫుల్​గా నటించి మరింత పాపులారిటినీ సంపాదించుకుంది. రీసెంట్​గా 'హనుమాన్'(hanuman Movie)​ చిత్రంలోనూ హీరో తేజ సజ్జా అక్కగా అంజ‌మ్మ‌ పాత్రలో ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్​ను అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమా తో విజయోత్సాహంలో ఉన్న ఈమె తన కొత్త చిత్రాల కోసం రెడీ అవుతోంది. అలా వరుసగా తెలుగు చిత్రాల్లో పవర్​ ఫుల్​ పాత్రలు చేస్తూ సక్సెస్​ అందుకుంటున్న ఈమె 40 ఏళ్లకు దగ్గరపడుతున్నా ఇంకా పెళ్లి మాత్రం చేసుకోలేదు.

అయితే అప్పుడప్పుడు ఈమె పెళ్లి గురించి వార్తలు తెరపైకి వస్తుంటాయి. ఆ మధ్య హీరో విశాల్​తో ప్రేమలో ఉన్నట్లు, ఆ తర్వాత విడిపోయినట్లు ప్రచారం సాగింది. ఇప్పుడు మళ్లీ పెళ్లి వార్త తెరపైకి వచ్చింది. తమిళ హీరో శింబుతో పెళ్లికి సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతో తెలీదు కానీ ప్రస్తుతం ఈ వార్తలు జోరుగా ప్రచారం సాగుతున్నాయి. కానీ ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఇరువురి సన్నిహితులు చెబుతున్నారు.

భర్త హీరో సూర్యతో విడాకులు - క్లారిటీ ఇచ్చిన జ్యోతిక

ఎన్టీఆర్​తో 'వార్​ 2' షూటింగ్​ - సూపర్ హింట్ ఇచ్చిన హృతిక్​ రోషన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.