Hanuman Movie OTT: సంక్రాంతికి పెద్ద పెద్ద హీరోలతో పోటీ పడి కూడా టాలీవుడ్ రికార్డులను బ్రేక్ చేసిన సినిమా హనుమాన్. తేజా సజ్జ నటించిన ఈ సినిమా థియేటర్లలో సూపర్ రెస్పాన్స్ అందుకొని కలెక్షన్ల వర్షం కురిపించింది. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ విజువల్ వండర్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక కొంతకాలంగా ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా, మళ్లీ ఎప్పుడు చూద్దామా అని ఎంతో ఆత్రుతగా ఎదురుచూశారు.
ఇక అందరి ఎదురు చూపులకు తెరదించుతూ మార్చి 17న ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ-5 (Zee 5) సంస్థ హనుమాన్ సినిమాను స్ట్రీమింగ్కు అందుబాటులోకి తెచ్చింది. అంతే ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్న ఆడియెన్స్, ఊహించిన స్థాయికన్నా ఎక్కువగా స్ట్రీమ్ చేస్తున్నారు. దీంతో హనమాన్ బిగ్‌స్క్రీన్‌లోనే కాదు. ఓటీటీలోనూ దూసుకుపోతోంది. ఈ క్రమంలో అనేక రికార్డులు బద్దలుకొడుతోంది.
అయితే జీ- 5లో స్ట్రీమింగ్ అవుతున్న హనుమాన్ ఓటీటీలోకి వచ్చిన 11గంటల్లోనే 102మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాల (102 Million Streaming Minutes)ను నమోదు చేసింది. ఒక్క హనుమాన్ సినిమాతో జీ- 5 యాప్ పాత రికార్డుల్నీ బద్దలయ్యాయట. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో తెలుగులో రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రస్తుతం ఓటీటీ ప్రపంచంలోనే ట్రెండింగ్ నెం.1లో ఉందట. సమయం గడిచే కొద్దీ హనుమాన్ మరిన్ని రికార్డులను బ్రేక్ చేయండం ఖాయమని అంటున్నారు. అయితే కేవలం తెలుగు రిలీజ్‌కే ఇంతంటి క్రేజ్ దక్కితే వేరే భాషల్లోనూ రిలీజ్ అయితే దాని ఊపు ఏ రేంజ్లో ఉంటుందో ఉహించలేం అనిపిస్తుంది.
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా నటించిన ఈ సినిమాలో అమృత అయ్యర్ హీరోయిగా కనిపించారు. తెలుగుతో పాటు మలయాళం, తమిళ సినిమాల్లో నటించిన వరలక్ష్మీ శరత్ కుమార్ ఇందులో కీలక పాత్రను పోషించారు. వీరితో పాటు వినయ్ రాయ్, సముద్రఖని, గెటప్ శ్రీను, సత్య, వెన్నెల కిషోర్‌లు ముఖ్య పాత్రలు పోషించారు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కే నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">