ETV Bharat / entertainment

రైతుల క్రౌడ్ ఫండింగ్​తో రూ.12 లక్షల బడ్జెట్ సినిమా - కట్ చేస్తే రూ. 52వేల కోట్లు! - Farmers Croud Funding Movie - FARMERS CROUD FUNDING MOVIE

Farmers Croud Funding Movie: ప్రొడక్షన్ బ్యానర్, నిర్మాతలు కాకుండా రైతుల క్రౌడ్ ఫండింగ్​తో ఓ సినిమా రూపొందిదని మీకు తెలుసా? మరి ఆ మూవీ ఏంటి? దాని విశేషం ఏంటో తెలుసుకుందామా?

Farmers Croud Funding Movie
Farmers Croud Funding Movie (Source: ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : May 4, 2024, 3:30 PM IST

Farmers Croud Funding Movie: ఓ భారీ బడ్జెట్ సినిమాను ఇద్దరు, ముగ్గురు నిర్మాతలు సంయుక్తంగా నిర్మించడం మామూలే. కానీ, బాలీవుడ్​లో ఓ సినిమా మాత్రం క్రౌడ్ ఫండింగ్ ద్వారా రూపొందని మీకు తెలుసా? అది కూడా 50 ఏళ్ల కిందట రైతులు ద్వారా సేకరించిన నగదు ద్వారా సినిమా రూపొందింది. ఇంతకీ ఆ సినిమా ఏంటి? రైతుల క్రౌడ్ ఫండింగ్ విషయం ఏంటంటే?

భారతీయ డెయిరీ ఇంజనీర్ 'డాక్టర్ వేరిగెస్ కురియన్' భారత్​లో డైరీ ఉత్పత్తుల కోసం చేసిన శ్వేత విప్లవం కథాంశం ఆధారంగా ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనెగల్ 1978లో 'మంథన్' పేరుతో ఓ సినిమా తెరకెక్కించాలనుకున్నారు. కానీ, ఆ సినిమా కమర్షియల్​ సక్సెస్ అయ్యే ఛాన్స్ లేదని అప్పట్లో నిర్మాతలు భావించారు. దీంతో సినిమా రూపొందించడానికి ఎవరూ ముందుకురాలేదు.

డెయిరీ ఉత్పత్తుల ఆధారంగా తెరకెక్కిస్తున్న సినిమా కాబట్టి, దర్శకుడు బెనెగల్ రైతుల మద్దతు పొందాలని భావించారు. ఈ నేపథ్యంలో అప్పట్లోనే 5 లక్షల మంది డెయిరీ రైతుల నుంచి ఒక్కొక్కరి దగ్గర రూ.2 చొప్పున విరాళాలు తీసుకున్నారు. ఈ విరాళాల మొత్తం దాదాపు రూ.10 లక్షలు అయ్యాయి. అదనంగా ఇంకొక రూ. 2 లక్షల విరాళాలతో కలిపి రూ.12 లక్షల బడ్జెట్​తో ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈ సినిమాలో స్మితా పాటిల్, గిరీష్ కర్నాడ్, నసిరుద్దీన్ షా, అమ్రిష్ పురి ప్రధాన పాత్రల్లో నటించారు. స్మితా పాటిల్ మొదటిసారి లీడ్ రోల్​లో నటించిన చిత్రం కూడా ఇదే. అప్పటికీ నసీరుద్దీన్ షా కూడా మాములు కమర్షియల్ నటుల లిస్ట్​లో లేరు. రూ.12 లక్షల బడ్జెట్​తో రూపొందిన 'మంథన్' అంతకన్నా కొన్ని రేట్లు ఎక్కువ లాభం పొందింది.

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శన: ఇక 2024 మేలో జరగనున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్​లో 4k క్లారిటీతో ఈ సినిమాను ఈవెంట్​లో ప్రదర్శించనున్నారు. గుజరాత్​- కో ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్(GCMMF) ఈ చిత్రం గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్​లో భాగంగా ఈ మూవీకి 4k రెస్టరేషన్ చేయించారు. కేన్స్ క్లాసిక్ సెక్షన్ ఫెస్టివల్ ఆఫ్ ది ఇయర్​లో సెలెక్టైన ఒకే ఒక్క సినిమా 'మంథన్'. GCMMF తమ ప్రొడక్ట్స్ ను అమూల్ బ్రాండ్ లో మార్కెటింగ్ చేస్తూ ఉంటుంది. ఈ మూవీలో వచ్చే ఒక పాటను అమూల్ బ్రాండ్ వాళ్లు 80ల్లో, 90ల్లో తమ యాడ్స్​లో ఉపయోగించుకున్నారు. అమూల్ రూ. 52 వేల కోట్ల బ్రాండ్​గా ఎదగడానికి 'మంథన్' సినిమా చాలా ఉపయోగపడింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

యాక్షన్ మోడ్​లో అందాల భామలు - తుపాకీతో బాక్సాఫీస్​కు గురి పెట్టి! - Tollywood Heroine Action Movies

మేం ముగ్గురం కలిసి సినిమా చేస్తాం : ఖాన్ త్రయం! - Aamir Salman Sharukh

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.