ETV Bharat / entertainment

ఓటీటీలో కామెడీ సర్వైవల్ థ్రిల్లర్ - డాగ్ లవర్స్​ కోసం స్పెషల్ మూవీ - GRRR MOVIE OTT RELEASE DATE - GRRR MOVIE OTT RELEASE DATE

Grrr Movie OTT Release Date : మాలీవుడ్​లో మంచి టాక్ సాధించిన సర్వైవల్‌ కామెడీ ఫిల్మ్‌ 'గర్ర్‌' మూవీ ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. దీంతో పాటు మరో ఇంట్రెస్టింగ్ మూవీ కూడా స్ట్రీమ్ అవుతోంది. అదేంటంటే?

Grrr movie ott release date
Grrr movie ott release date (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 13, 2024, 10:59 PM IST

Grrr Movie OTT Release Date : మాలీవుడ్​లో మంచి టాక్ సాధించిన సర్వైవల్‌ కామెడీ ఫిల్మ్‌ 'గర్ర్‌' మూవీ ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా ఆగస్టు 20న మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడలో ఈ మూవీ స్ట్రీమింగ్‌కు తీసుకొస్తున్నట్లు సదరు ఓటీటీ సంస్థ ప్రకటించింది. స్టార్ నటులు కుంచకో బోబన్‌, సూరజ్‌ వెంజరమూడు ఈ సినిమాలో తమ నటనతో ఆకట్టుకున్నారు.

స్టోరీ ఏంటంటే ?
తాను ప్రేమించిన రచన (అనఘ) దూరమవ్వడం వల్ల ఫుల్‌గా మందు తాగుతాడు. రెజిమెన్‌ నాడర్‌ (కుంచకో బోబన్‌). ఆ మత్తులో జూకి వెళ్తాడు. ఈ క్రమంలో సింహం ఉన్న ప్లేస్​కు వెళ్తాడు. అంతేకాకుండా లోపలికి వెళ్లకుండా ఏర్పాటు చేసిన కంచెను కూడా దాటి సింహం డెన్‌లోకి వెళ్తాడు. ఇదిలా ఉండగా, జూ ఉద్యోగి హరిదాస్‌ నాయర్‌ (సూరజ్‌ వెంజరమూడు)కు ఎప్పుడూ ఏదో ఒక సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి. జూలో ఏదోఒక అవినీతికి పాల్పడటం ఏరి కోరి సమస్యలు తెచ్చుకోవడం ఆయనకు అలవాటే.

అయితే రెజిమెన్‌ నాడార్​ సింహం ఉన్న ప్రాంతానికి వెళ్లాడని తెలుసుకున్న హరిదాస్​ అతడిని కాపాడేందుకు వెళ్తాడు.కానీ ఆయన కూడా అక్కడే ఇరుక్కుపోతాడు. సింహం వారికి దగ్గరగా ఉండటం వల్ల ఇద్దరూ ప్రమాదంలో పడతారు. ఈ ఇద్దరినీ సింహం నుంచి కాపాడేందుకు పోలీసులు, జూ అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తుంటారు. ఇంతలోనే ఈ విషయం కాస్తా మీడియాకు తెలియడం వల్ల అది కాస్తా వైరల్‌ అవుతుంది. మరి రెజిమెన్‌ ఇంకా హరిదాస్‌లు ఆ సింహం బారి నుంచి తప్పించుకున్నారా? లేదా అన్న విషయాలను తెలుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

కుక్కల లవ్​ స్టోరీ
ఇటీవలే హాట్​స్టార్ వేదికగా మరో ఇంట్రెస్టింగ్ మూవీ విడుదలై సందడి చేస్తోంది. దాని పేరు 'వాలట్టి'. ఇందులో కుక్కల మధ్య లవ్ స్టోరీని డైరెక్టర్స్​ ఎంతో చక్కగా చూపించారు. సౌబిన్ షాహిర్, సన్నీ వైన్, రవినా రవి, రోషన్ మాథ్యూ, అజూ వర్గీస్, రజిని హరిదాస్, ఇంద్రన్స్ సైజు కురుప్ లాంటి స్టార్స్ సినిమాలో ఉన్న కుక్కలకు వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం.

రాజమౌళి డాక్యుమెంటరీ హైలైట్స్- జక్కన్నను కార్తికేయ అలా పిలిచేవారంట! - Rajamouli Documentary

'జై బాలయ్య'- 'ఆహా'లో కమింగ్ సూన్- నటసింహం వీరాభిమానిగా! - New Movie Jai Balayya

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.