RRR Re Release: టాలీవుడ్ స్టార్లు జూనియర్ ఎన్టీఆర్- రామ్‌చరణ్ బ్లాక్‌బస్టర్ మూవీ 'ఆర్ఆర్ఆర్' మరోసారి థియేటర్లలో సందడి చేయడానికి రెడీ అవుతోంది. ఈ సినిమాను రీ రిలీజ్ చేసేందుకు మూవీటీమ్ డిసైడైంది. ఈనెల (మే)10న దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన థియేటర్లలో తెలుగు, హిందీ భాషల్లో 'ఆర్ఆర్ఆర్' రీ రిలీజ్ కానుంది. అయితే అదనంగా 3D ఫార్మాట్లో కూడా అందుబాటులోకి తెస్తున్నారు. దీంతో రాజమౌళి మూవీఫెస్ట్ను 3Dలో ఎక్స్పీరియన్స్ చేయవచ్చని మూవీలవర్స్ తెగ సంతోషపడుతున్నారు.
ఇక 2022 మార్చిలో రిలీజైన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ సినిమాలోని 'నాటు నాటు' పాటకు ఆస్కార్ అవార్డు సైతం దక్కింది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ను గ్లోబల్ స్టార్లుగా మార్చింది. 2022 మార్చిలో రిలీజైన ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా రూ.1000+ కోట్లు వసూల్ చేసి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాలో సీనియర్ నటి శ్రియా శరణ్ బాలీవుడ్ స్టార్లు ఆలియా భట్, అజయ్ దేవగన్, హాలీవుడ్ స్టార్ ఒలివియ మోరిస్ తదితరులు నటించారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమాకు ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందించారు.
-
RRR Re Release On 10th May In 2D &3D In Hindi And Telugu Languages
— Surya Sujith (@ntrfansujith) May 6, 2024
Let's Celebrate It Again @RRRMovie @tarak9999 🥳🥳🥳#DevaraFirstSingle #DevaraGlimpse #Devara #ManOfMassesNTR #JrNTR #NTRBirthdayCDP #NTRBirthdayMonth #NTR #AdvanceHappyBirthdayNTR #AllHailTheTiger #War2 pic.twitter.com/nz8xbbbWiL
కాగా, పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఆర్ఆర్ఆర్ చిత్రంలో అల్లూరి సీతా రామరాజుగా రామ్‌చరణ్, కొమురం భీమ్‌గా తారక్ కనిపించారు. వీరి నటనకు గ్లోబల్ వైడ్‌గా ఉన్న సినీ లవర్స్, సినీ సెలబ్రిటీలు ఫిదా అయిపోయారు. ముఖ్యంగా వీరి ఇంట్రొడక్షన్ సీన్స్‌కు థియేటర్లలో విజిల్స్ పడ్డాయి. అందులో తారక్ టైగర్ ఫైట్, ఇంటర్వెల్ సీన్ సినిమాకు హైలైట్‌గా నిలిచాయి.
జపాన్‌లో రికార్డు: జపాన్‌లో గతేడాది అక్టోబరు 21న రిలీజైంది. విడుదలైన ఈ సినిమా అప్పట్నుంచి థియేటర్లలో నడుస్తోంది. 44 నగరాల్లో 209 థియేటర్లు, 31 ఐమాక్స్ స్క్రీన్స్‌పై ప్రదర్శించారు. అలాగే 34 రోజుల్లోనే అత్యధిక కలెక్షన్లు సాధించి 300 మిలియన్ జపాన్ యెన్‌ల క్లబ్‌లోనూ చేరింది. ఇప్పటికీ హౌస్‌ఫుల్ షోస్‌తో రన్ అవుతున్నట్లు ఆర్ఆర్ఆర్ మేకర్స్ రీసెంట్గా తెలిపారు. దీంతో మార్చిలో థియేటర్లో సినిమా చూసేందుకు డైరెక్టర్ రాజమౌళి జపాన్ వెళ్లారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఎన్టీఆర్ బర్త్‌డే - 'దేవర'తో పాటు ఆ రెండు చిత్రాల అప్డేట్స్ కూడా! - Jr NTR Devara Movie
బడ్జెట్ మించిన కలెక్షన్స్ - ప్రీ రిలీజ్ బిజినెస్‌లోనూ 'కల్కి' జోరు! - Kalki 2898 AD Movie