ETV Bharat / entertainment

రూ. 75 కోట్లకు అమ్ముడుపోయిన 'గేమ్ ఛేంజర్' నార్త్ రైట్స్! - మరి భారతీయుడు 2 ? - Game Changer Movie North Rights - GAME CHANGER MOVIE NORTH RIGHTS

Game Changer Movie North Rights : డైరెక్టర్ శంకర్​ రూపొందిస్తున్న 'గేమ్ ఛేంజర్', 'భారతీయుడు 2' సినిమాల గురించి అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నార్త్ థియేట్రికల్ రైట్స్ గురించి ఓ అప్​డేట్​ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇంతకీ అదేంటంటే ?

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 19, 2024, 3:29 PM IST

Game Changer Movie North Rights : తమిళ డైరెక్టర్ శంకర్ ఇప్పుడు ఫుల్ బిజీ షెడ్యూల్​లో ఉన్నారు. కమల్ హాసన్​తో భారతీయుడు 2, అలాగే రామ్ చరణ్ తేజ్​తో 'గేమ్ ఛేంజర్' ఇలా రెండూ భారీ బడ్జెట్​ సినిమాలను ప్రేక్షకుల మందుకు తీసుకురానున్నారు. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలను ఈ ఏడాది రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఎప్పుడు లేనిది తొలిసారిగా ఒకే ఏడాదిలో రెండు సినిమాలతో వస్తుండటం వల్ల అభిమానుల్లో ఆయన లైనప్​పై మరింత ఆసక్తి పెరిగింది. పైగా రెండూ స్టార్ హీరోల సినిమాలు అవ్వడం వల్ల బాక్సాఫీస్ వద్ద ఇతర సినిమాలకు గట్టి పోటీనివ్వనుంది. సౌత్​లోనే కాకుండా నార్త్​లోనూ వీటిపై హై ఎక్స్​పెక్టేషన్సే ఉన్నాయి.

ఇలా భారీ అంచనాల నడుమ వస్తున్న ఈ మూవీస్​కు సంబంధించిన ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. తాజాగా అందిన సమాచారం ప్రకారం రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' నార్త్ థియేటర్ రైట్స్ రూ. 75 కోట్లకు అమ్ముడుపోయిందట. గ్లోబల్ స్టార్​కు నార్త్​లో ఉన్న క్రేజ్ వల్ల ఈ సినిమా అక్కడ ఆ రేంజ్​లో క్లిక్ అయ్యింది. అంతే కాకుండా ఈ స్టోరీ లైన్ కూడా చిత్రంపై మరింత ఆసక్తి పెంచుతోంది.

అయితే ఎప్పుడో అనౌన్స్​ చేసిన 'భారతీయుడు 2' థియేటర్ రైట్స్ డీల్ మాత్రం రూ.20 కోట్లకు మించలేకుండా పోయింది. భారతీయుడు 2 చిత్రానికి అట్రాక్ట్ చేసే అప్డేట్స్ లేవు. పైగా ఆ సినిమా షూటింగ్ చాలా ఏళ్లుగా సాగుతుంది. ఆ ఫిల్మ్ పై క్రేజీ పెంచే ప్రయత్నాలు ఏవీ ఆ మూవీ టీమ్ చేయకపోవడం కూడా మార్కెట్ పెరగకపోవడానికి కారణమని విశ్లేషకుల మాట. గేమ్ ఛేంజర్ కనీసం అక్టోబర్​లోనో లేకుంటే దీపావళికి వచ్చే అవకాశం ఉందని అనౌన్స్ చేశారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'భారతీయుడు 2' రిలీజ్ డేట్​పై ఇంతవరకు ఎటువంటి లేకపోవడం కూడా ఈ సినిమాకు డ్రా బ్యాక్​గా నిలిచింది. అయితే ఇటీవల మేకర్స్ ఈ సినిమాను ఈ ఏడాది జూన్​లో విడుదల చేస్తామని మూవీ టీమ్ వెల్లడించింది. కానీ డేట్​ను చెప్పలేదు. ఇక ఈ మూవీలో కమల్ హాసన్ తో పాటు కాజల్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్దార్ద్, ఎస్ జె సూర్య ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

ఇదిలా ఉండగా, శంకర్ తన కూతురు పెళ్లి పనుల్లో బిజీగా ఉండటం వలన ఈ రెండు సినిమాల రిలీజ్ అప్డేట్స్ గురించి ఒకింత గందరగోళం నెలకొంది. పెళ్లి అయ్యాక ఈ రెండు సినిమాల గురించి మరిన్ని అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది.

రామ్​చరణ్ బర్త్ డే స్పెషల్- 'జరగండి' సాంగ్ వచ్చేసిందోచ్​- చెర్రీ, కియారా స్టెప్పులు చూశారా? - Game Changer Jaragandi Song

'సేనాపతి తిరిగి వచ్చేస్తున్నాడు'- భారతీయుడు 2 రిలీజ్ ఎప్పుడంటే ? - Bharateeyudu 2 Release Date

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.