Game Changer First Single: గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ తేజ్, డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'గేమ్ ఛేంజర్'. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అయితే ఈ సినిమా చిత్రీకరణ మొదలై ఎంతో కాలం గడిచినప్పటికీ ఒక పోస్టర్, టైటిల్ తప్ప మరే అప్డేట్ లేదు. గతంలో ఈ సాంగ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేసినా, కొన్ని కారణాల వల్ల అది జరగలేదు.
కానీ, లీక్స్ కారణంగా అప్పుడు ఈ సాంగ్ చాలా ట్రెండ్ అయ్యింది. ఈ విషయంపై నిర్మాత దిల్‌రాజు కూడా సీరియస్ అయ్యారు. అయితే తాజాగా ఈ సాంగ్ రిలీజ్‌కు డేట్ ఫిక్సైనట్లు తెలుస్తోంది. మార్చి 27న హీరో రామ్‌చరణ్ బర్త్‌డే రోజే 'జరగండి' (Jaragandi song from Game Changer) అనే పాటను రిలీజ్ చేయనున్నారని సమాచారం. ఇక సాంగ్‌తోపాటు, సినిమా విడుదల తేదీని కూడా అదే రోజు అనౌన్స్ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో చెర్రీ ఫ్యాన్స్ మెగాపవర్ స్టార్ బర్త్‌డే (Ram Charan Birthday) కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
ఇక సినిమా విషయానికొస్తే 'ఆర్ఆర్ఆర్' తర్వాత పూర్తి స్థాయిలో చరణ్ నటిస్తున్న సినిమా కావడం, పైగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించడం వల్ల 'గేమ్ ఛేంజర్' పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రానికి మ్యూజిక్ సంచలనం తమన్ సంగీతం అందిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో దిల్ రాజ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కియారా అడ్వాణీ హీరోయిన్గా నటిస్తోంది. ఇక నటి అంజలి, కోలీవుడ్ స్టార్ నటుడు ఎస్జే సూర్య, జయరామ్, సునీల్, శ్రీకాంత్, నవీన్ చంద్ర తదితరులు ఆయా పాత్రల్లో నటించనున్నారు.
RamCharan Buchibabu Movie: మరోవైపు రామ్‌చరణ్ ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సనా కూడా ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు 'ఆర్సీ 16' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రూపొందనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రంలో నేచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్గా నటించనున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ, ఈవిషయంపై క్లారిటీ లేదు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఎన్టీఆర్ పాత్రలో ట్విస్ట్- 'వార్- 2' కోసం తారక్ తొలిసారి ఆలా- ఫ్యాన్స్‌కు పూనకాలు గ్యారెంటీ!
OTTలోకి 12th Fail తెలుగు వెర్షన్ - జీవితంలో ఎదగాలంటే ఈ మూవీ డోంట్ మిస్!