Gaami Twitter Review: మాస్ కా దాస్ విశ్వక్ సేన్- యంగ్బ్యూటీ చాందిని చౌదరి కాంబోలో తెరకెక్కిన సినిమా 'గామి' (Gaami Twitter Review). డెబ్యూ డైరెక్టర్ విద్యాధర్ కాగిత దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 8న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శుక్రవారం తెల్లవారుజామున నుంచే హైదరాబాద్ సహా పలు నగరాల్లో ప్రీమియర్ షోస్ పడ్డాయి. భారీ అంచనాల నడుమ రిలీజైన ఈ సినిమా టాక్ ఏంటంటే?
కొత్త జానర్ ప్రయత్నాల్లో భాగంగా తెరకెక్కిన టాలీవుడ్ సినిమాల్లో 'గామి' ఒకటి. స్టన్నింగ్ విజువల్స్, కొత్త సినిమాటిక్ జానర్లో రూపొందిన గామికి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఫస్ట్ హాఫ్, ప్రీ ఇంటర్వెల్ సీన్ (Pre Interval Scene), క్లైమాక్స్‌లో లయన్ యాక్షన్ సన్నివేశాలు సినిమాకు ప్లస్ పాయింట్‌గా నిలిచాయని నెటిజన్లు అంటున్నారు. కొన్ని సీన్స్‌లో గుస్పంప్స్ పక్కా అని చెబుతున్నారు. సెకండ్ హాఫ్‌లో ఏదో ట్విస్ట్ ఉందని కూడా కామెంట్ చేస్తున్నారు.
అయితే సెకండ్ హాఫ్‌లో కథ చాలా స్లోగా నడుస్తుందంటున్నారు. సినిమాలో ఒకేసారి మూడు స్టోరీలు చెప్పడం వల్ల కాస్త డల్‌గా అనిపిస్తుంది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. అయితే ఈ కొద్దిపాటి నెగిటివ్ వదిలేస్తే, ఓవరాల్‌గా సినిమా ఓకే అంటున్నారు. హీరో విశ్వక్ సేన్ అఘోర పాత్రలో నటన అదరగొట్టేశారట. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ (Background Music), సినిమాటోగ్రఫీ లెవెల్స్, సౌండ్ క్వాలిటీ, నిర్మాణ విలువలు బాగున్నాయట. కంప్లీట్ టీమ్ వర్క్‌తో డైరెక్టర్ విద్యాధర్ సినిమా నెక్ట్స్ లెవెల్లో తెరెక్కించారట.
ఇక సినిమా విషయానికొస్తే, డైరెక్టర్ విద్యాధర్ దాదాపు నాలుగేళ్లపాటు శ్రమించి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ మూవీ తెరకెక్కించారు. సెల్యూలాయిడ్, తమడా మీడియా బ్యానర్స్‌పై కార్తీక్ శబరీష్ చిత్రాన్ని నిర్మించారు. నటులు ఎంజి అభినయ, హారిక పెడాడ, మహ్మద్ సమద్, దయానంద్ రెడ్డి, హారికా తదితరులు పలు కీలక పాత్రలు పోషించారు. నరేశ్ కుమారన్ సంగీతం అందించగా, విశ్వనాథ్ రెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
విశ్వక్ సినిమాపై జక్కన్న ప్రశంసలు - ఆ ఇద్దరికి పూర్తి క్రెడిట్స్!
మైనస్ 40 డిగ్రీల చలిలో షూటింగ్ - విశ్వక్‌ను చూసి వాళ్లు అలా చేశారట