Celebrities With Super Fitness: వయసు మీద పడ్డవారు తేలికైన పనులు చేయలేరన్న వాదనను తొక్కి పెడుతూ కొంతమంది సునాయసంగా బరువులు ఎత్తేస్తున్నారు. అసాధారణమైన ఫిట్‌నెస్‌తో, వర్కౌట్స్ చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. సినిమా సెలబ్రిటీలైతే జిమ్‌లోనే ఎక్కువ సమయం వెచ్చిస్తూ కండలు తిరిగిన బాడీతో అదరగొట్టేస్తున్నారు. సిల్వర్ స్క్రీన్‌పై అందంగా, ఫిట్‌గా కనిపిస్తూ అభిమానులను పెంచుకుంటున్నారు. వయసు అనేది తమకు ఒక సంఖ్య మాత్రమే అని, వర్కౌట్లు చేస్తూ చాటి చెప్తున్నారు. వయసు పెరుగుతున్నా యవ్వనంగా మారిపోతున్న ఆ సినీ సెలబ్రిటీల కసరత్తులను ఓసారి చూసొద్దాం.
అక్షయ్ కుమార్
బాలీవుడ్ 'ఖిలాడీ'గా పేరుపొందిన అక్షయ్ కుమార్ వయసు 56 ఏళ్లు. అయితేనేం మార్షల్ ఆర్ట్స్, యోగా, యుద్ధ కళల్లో శిక్షణ పొందుతూ, జిమ్‌లో ఎక్సర్‌సైజులు చేస్తూ తన బాడీని ఫిట్‌గా ఉంచుకుంటారు. యాక్షన్ సినిమాలంటే రెచ్చిపోయే అక్షయ్, ఇప్పటికీ డూప్ లేకుండానే ఫైట్ సీన్లు చేస్తున్నారంటే దానికి ఆ ఫిట్‌నెస్ ప్రధాన కారణం. ఫిట్‌నెస్‌పై ఆయన సోషల్ మీడియా చేసే పోస్ట్‌లు వైరల్‌గా మారతాయి. కఠినమైన ఆహార నియమాలు, వర్కౌట్లతో అక్షయ్ నిజమైన యాక్షన్ స్టార్‌గా గుర్తింపు పొందారు. ఈ విశేషాలను ఎప్పటికప్పడు అక్షయ్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటారు.
అనిల్ కపూర్
ఇండస్ట్రీలో తనకంటూ ఓ స్టార్ డమ్ సంపాదించుకున్న నటుడు అనిల్ కపూర్. 67 ఏళ్ల వయసులో కూడా అనిల్‌కపూర్ ఫిటెనెస్‌పై ప్రత్యేక శ్రద్ద చూపుతారు. అందుకే ఇంకా యంగ్ లుక్‌లోనే కనిపిస్తున్నారు. క్రమశిక్షణతో కూడిన జీవనశైలి, పర్‌ఫెక్ట్ డైట్‌తో తన వయసును తగ్గించుకుంటూ యువ హీరోలకు సవాల్ విసురుతున్నారు.
జెన్నిఫర్ లోపెజ్
నటిగా, గాయనిగా కోట్లాదిమంది అభిమానుల మనసు దోచుకున్న జెన్నిఫర్ లోపెజ్ గురించి తెలియని వారుండరు. ఆమె పాట పడితే పడి చచ్చిపోయే వారెందరో. 54 ఏళ్ల వయస్సులో కూడా జెన్నిఫర్ లోపెజ్ యంగ్ గర్ల్‌గా కనిపిస్తూ అభిమానుల మతి చెడగొడుతూ ఉంటుంది. డ్యాన్స్ ప్రాక్టీస్, కఠినమైన జిమ్ వర్కౌట్లు చేస్తూ తన శరీరాన్ని చెక్కిన శిల్పంలా మార్చుకుంది. ఈ వయస్సులో కూడా ఆమె పర్ఫెక్ట్ ఫిజిక్ చూసి అభిమానులు ఫిదా అయిపోతున్నారు. ఆరోగ్యం, ఫిట్‌నెస్ పట్ల ఆమెకున్న డెడికేషన్ చూసి ప్రశంసలు కురిపిస్తున్నారు.
మిలింద్ సోమన్
58 ఏళ్ల మిలింద్ సోమన్ కేవలం మోడల్, నటుడు మాత్రమే కాదు మారథాన్ రన్నర్ కూడా. ఫిట్‌నెస్ అంటే విపరీతమైన ప్రేమ ఉన్న మిళింద్ తన ఫిట్‌నెస్ చెక్ చేసుకోవడాని తరచుగా మారథాన్ రన్స్‌లో పాల్గొంటూ ఉంటారు. బాడీ బిల్డింగ్ పోటీల్లో కూడా పాల్గొంటూ ఉంటారు. అభిమానులతో తన ఫిట్‌నెస్ ముచ్చట్లను పంచుకుంటూ ఉంటాడు.
హాలీ బెర్రీ
ఆస్కార్ అవార్డు విజేత అయిన హాలీ బెర్రీకి ఇప్పుడు 57 ఏళ్లు. ఈ వయసులోనూ ఆమె ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. తన వ్యాయామ వీడియోలను తరచుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. శక్తిని పెంచే వ్యాయమాలతో పాయు యుద్ధ కళల్లో శిక్షణ తీసుకుంటున్న వీడియోలను పంచుకుంటూ ఆకట్టుకుంటోంది.
బర్త్‌డే బాయ్ బన్నీ ఫిట్‌నెస్, డైట్ సీక్రెట్ ఇదే - Happy Birthday Allu Arjun
జూనియర్ ఎన్టీఆర్ ఎనర్జీ సీక్రెట్ - చిన్నప్పుడు అలా చేశారట! - Jr Ntr Energy Secret