ETV Bharat / entertainment

'మహేశ్​కు రెమ్యునరేషన్ తగ్గించమని చెప్పా - ప్రభాస్‌ సినిమా ఫ్లాప్ అవుతుంది!' - Family Star Dilraju

Family Star Dilraju : సూపర్ స్టార్ మహేశ్ బాబు రెమ్యునరేషన్ గురించి మాట్లాడారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు. అలాగే ప్రభాస్ నటించిన ఓ సినిమా ఫ్లాప్ అవుతుందని తాను ముందే అంచనా వేసినట్లు చెప్పుకొచ్చారు. ఆ వివరాలు.

'మహేశ్​కు రెమ్యునరేషన్ తగ్గించమని చెప్పా - ప్రభాస్‌ సినిమా ఫ్లాప్ అవుతుంది!'

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 2, 2024, 12:53 PM IST

Family Star Dilraju : టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కాలిక్యులేటెడ్ ప్రొడ్యూసర్స్ తక్కువ. అంత క్లారిటీగా ఉన్న వాళ్లే సక్సెస్‌ను చూడగలుగుతారు. అలాంటి వారిలో దిల్ రాజు ఒకరు. ఒక సినిమాను చూసి దానికెంత మార్కెట్ వస్తుందో ముందే అంచనా వేయగల సత్తా ఆయనలో ఉంటుందని చాలా మంది అంటుంటారు. తాజాగా ఆయన నుంచి విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమా రాబోతుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్​లో జోరుగా పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా ఆయన కొన్ని ఆసక్తికర విషయాలను మాట్లాడారు. తానెప్పుడూ డబ్బుల కోసం పనిచేయలేదని, సక్సెస్‌ఫుల్ స్టోరీల కోసమే ప్రయత్నించానని తన మనసులోని మాట బయటపెట్టారు. సినిమాలను తాను ముందే అంచనా వేస్తానని, 90శాతం తాను అనుకున్నట్లే జరుగుతాయని తెలిపారు దిల్​రాజ్. కానీ, మిగిలినది మన చేతిలో ఉండదని అన్నారు.

ఒక సినిమా బడ్జెట్ పెరుగుతుందంటే, అందులో సగం హీరో రెమ్యూనరేషన్ మీదనే ఆధారపడి ఉంటుంది కదా. వాళ్లని తగ్గించుకోమని చెబితే సరిపోతుందేమోనని యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. "మహేశ్‌ను సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాకు రెమ్యూనరేషన్ తగ్గించుకోమని చెప్పా. వెంకటేశ్ కూడా దానికి ఒప్పుకున్నారు. అలా అన్ని సార్లు కుదరదు. కథ అక్కడ డిమాండ్ చేయడంతో వాళ్లు కూడా ఓకే అనేశారు. హీరో రెమ్యూనరేషన్ ఆధారంగానే స్టోరీకి గ్రాండ్ నెస్ పెరుగుతుంది. అలా రెమ్యూనరేషన్ తగ్గించుకోమని చెప్పలేం" అని బదులిచ్చారు.

హిట్ అవుతుందని అంచనాలతో సినిమా తీసి తీరా రెడీ అయిన తర్వాత ఫెయిల్ అవుతుందని తెలిసినా రిలీజ్ చేసిన సినిమాలున్నాయా అని అడిగిన ప్రశ్నకు కూడా సమాధానమిచ్చారు దిల్ రాజు. "ప్రభాస్ సినిమా కచ్చితంగా ప్లాప్ అవుతుందని తెలుసు. మున్నా ఎడిటింగ్ అయిపోయాక చూశాను. ఏదో తగ్గిందనిపించింది. కానీ, అప్పటికే సినిమా రెడీ అయిపోయింది. డిస్ట్రిబ్యూటర్లకు విషయమిదని ధైర్యం చెప్పా. అదే కాదు మణిరత్నం మీద నమ్మకంతో చెలియా విషయంలోనూ ఇదే చేశాం. కొన్ని సినిమాలు ప్లాప్ అవుతాయని తెలిసినా ఏం చేయలేం" అని పేర్కొన్నారు. "కొన్ని కథల్లోకి ఎవరినైనా సెలక్ట్ చేసుకోవచ్చు. కానీ, స్టార్ హీరోలకు కథలంటే వారి కోసమే రెడీ చేసుకుని తీస్తాం కాబట్టి రీప్లేస్‌మెంట్ కష్టం" అని స్టార్ హీరోలతో సినిమాలు తీయడంపై మాట్లాడారు దిల్ రాజు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

5 సెకన్ల సినిమా ఛాన్స్ - స్టార్​గా మారిన బిచ్చగాడు - గర్ల్ ఫ్రెండ్ కూడా! - PK Aamir Khan Movie

మళ్లీ నయా లుక్​లో మహేశ్ - ఈ సారి మరింత స్టైలిష్​గా! - Mahesh Babu New Stylish look

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.