Fahadh Faasil Avesham OTT Review
చిత్రం: ఆవేశం;
నటీనటులు: ఫహద్ ఫాజిల్, హిప్‌స్టర్, మిథున్ జై శంకర్, రోషన్ షానవాస్, షాజిన్ గోపు, మన్సూర్ అలీఖాన్ తదితరులు;
సంగీతం: శుసిన్ శ్యామ్;
ఎడిటింగ్: వివేక్ హర్షన్;
సినిమాటోగ్రఫీ: సమీర్ తాహిర్;
నిర్మాత: నజ్రియా నాజిమ్, అన్వర్ రషీద్;
రచన, దర్శకత్వం: జీతూ మాధవన్;
స్ట్రీమింగ్ వేదిక: అమెజాన్ ప్రైమ్ వీడియో
ఈ ఏడాది మలయాళ సినిమాలు జోరు కనబరుస్తున్నాయి. అన్నీ బ్లాక్ బస్టర్ హిట్స్‌ను అందుకుంటున్నాయి. అందులో పుష్ప విలన్ ఫహద్ ఫాజిల్ నటించిన ఆవేశం కూడా ఒకటి. దాదాపు రూ.20కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి రూ.150 కోట్ల వరకు అందుకుంది. అయితే ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఇందులో ఫహాద్ రౌడీ షీటర్‌గా నటించాడు. మరి ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుందా?
కథేంటంటే : ఏరోనాటికల్ ఇంజినీరింగ్ చదవడానికి కేరళ నుంచి బెంగళూరుకు బిబి (మిథున్ జై శంకర్), అజు (హిప్‌స్టర్), శంతన్ (రోషన్ షానవాజ్) వస్తారు. ఈ క్రమంలోనే సీనియర్లైన కుట్టీ (మిధుట్టి)తో పాడు అతడి స్నేహితులు ఈ ముగ్గురిని బాగా ర్యాగింగ్ చేస్తారు. దీంతో ఈ జూనియర్స్ స్థానికంగా ఉండే రౌడీలను ఆశ్రయిస్తారు. గ్యాంగ్‌స్టర్ రంజిత్ గంగాధర్ అలియాస్ రంగా (ఫహద్ ఫాజిల్)ను కలుస్తారు. అయితే రంగా ప్రేమ, సంతోష, కోపం ఏదైనా సరే అతిగానే ప్రదర్శించడం అలవాటు. అలానే తనను ఆశ్రయించిన వారి కోసం ఆ సీనియర్స్‌కు గట్టిగా బుద్ధి చెబుతాడు. అప్పటి నుంచి జానియర్స్తో రంగాకు మంచి బంధం ఏర్పడుతుంది. ఈ క్రమంలోనే వారి చదువు పాడైపోతుంది. దీంతో కాలేజ్ డైరెక్టర్ వారిని పిలిచి ఆఖరి వార్నింగ్ ఇస్తాడు. దీంతో ఆ ముగ్గురు జూనియర్స్ ఎలాగైనా రంగా నుంచి దూరంగా వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తారు. కానీ రంగా వారిని మాత్రం వదలడు. మరి చివరికి వారు రంగా నుంచి ఎలా తప్పించుకున్నారు? రంగా వాళ్లను ఏం చేశాడు?అనేదే మిగిలిన కథ.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఎలా ఉందంటే : మంచి వాళ్లతో విరోధం కన్నా, చెడ్డవాళ్లతో స్నేహం ప్రమాదకరం అనేది స్టోరీ లైన్. ఈ చిత్రంలో రంగా పాత్ర నెగటివ్ షేడ్స్ ఉన్నా కామెడీ అదిరిపోతుంది. ఫహద్ ఫాజిల్ ఎంట్రీతో కథలో అసలు జోష్ మొదలవుతుంది. అసలా పాత్ర ఎనర్జీ ఆడియెన్స్‌లోనూ కనిపిస్తుంది. రంగా చేసే హంగామా అంతా సరదాగా సాగుతుంది. కానీ రంగా గ్యాంగ్‌స్టర్ ఎలా అయ్యాడన్న విషయం మాత్రం కాస్త సాగదీతగా ఉంటుంది. అయితే ఓ హైఓల్టేజ్ యాక్షన్ సీన్, మదర్ సెంటిమెంట్‌తో సినిమాను ముగించిన తీరు మాత్రం బాగుంటుంది. ఎలాంటి అసభ్య సన్నివేశాలు లేవు. ఫైనల్‌గా ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు.
ఎవరెలా చేశారంటే : గ్యాంగ్‌స్టర్ రంగా ఫహద్ ఫాజిల్ నటన మరో లెవల్. ఆయన యాక్టింగ్, ఎక్స్ప్రెషన్స్, డ్యాన్స్‌లు, ఫైట్స్ అన్నీ సూపర్. కాలేజ్ స్టూడెంట్స్‌గా హిప్‌స్టర్, మిథున్, రోషన్ మంచి నటన కనబరిచారు. మిగిలిన వాళ్లు తమ పరిధి మేరకు నటించారు. రంగా గ్యాంగ్‌లో ఉండే అంబన్, నంజప్ప, బ్రూస్లీ, జాకీ పాత్రల యాక్షన్ సీన్స్ బాగున్నాయి. కథ సింపులే అయినా తన కథారచన, స్క్రీన్‌ప్లే, రంగా ఎలివేషన్స్‌తో తెరపై మెరుపులు మెరిపించాడు దర్శకుడు జీతూ మాధవన్. చివరిగా ఆవేశం తెరపై ఫహద్ ఫాజిల్ మెరుపులు అని చెప్పొచ్చు.
అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే విలన్ మీరేనా? - ఫహద్ ఆన్సర్ ఇదే! - Fahad faasil Remuneration
'పుష్ప తర్వాత ఎలాంటి మార్పు లేదు - ఆ మాట సుకుమార్‌కే చెప్పాను' - Fahadh Faasil Pushpa Movie