India's Most liked Webseries 90s MiddleClass Biopic : ఓటీటీలో వచ్చాక ఇండస్ట్రీలో చాలా మార్పులు వచ్చాయి. టాలెంట్‌ను నిరూపించుకునేందుకు ఈ ప్లాట్‌ఫామ్ ఎంతో మందికి ఉపయోగపడుతోంది. ఆడియెన్స్ కూడా కాస్ట్ కన్నా కూడా కంటెంట్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం మొదలుపెట్టారు. అందుకే ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా సినిమాలు, సిరీస్‌లు ఇందులో స్ట్రీమింగ్ అవుతున్నాయి.
అలా ఆ మధ్య చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరినీ ఆకట్టుకున్న వెబ్ సిరీస్ #90s మిడిల్ క్లాస్ బయోపిక్. ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ఈటీవీ విన్‌లో ఇది స్ట్రీమింగ్ అవుతోంది. ఇది రిలీజైన రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో ప్రతిఒక్కరినీ మెప్పించింది. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసింది. వ్యూస్ పరంగా పలు రికార్డులను క్రియేట్ చేసింది.
అయితే ఇప్పుడీ సిరీస్ మరో సరికొత్త రికార్డును సాధించింది. 2024 ఫస్ట్ హాఫ్‌లో దేశవ్యాప్తంగా అత్యధిక మంది లైక్ చేసిన తెలుగు సిరీస్‌గా నిలిచింది. ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అయ్యే సినిమాలు, సిరీస్‌లను విశ్లేషించి వాటికి రేటింగ్స్ ఇచ్చే ఆర్మాక్స్ సంస్థ ఈ విషయాన్ని తెలిపింది.
ఇదే విషయాన్ని తెలియజేస్తూ నిర్మాత నవీన్ మేడారం కూడా ఎంతో ఆనందపడ్డారు. సిరీస్ కోసం వర్క్ చేసిన నటీనటులు, సాంకేతిక టీమ్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా దర్శకుడు ఆదిత్య హాసన్‌ను అభినందించారు. అంతేకాదు, త్వరలోనే సీజన్-2, సీజన్-3 కూడా తీసుకొస్తున్నామని తెలిపారు. కొత్త ప్రతిభను ప్రోత్సహించడంలో ఈటీవీ ఎప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు. వచ్చే ఏడాది నుంచి ప్రతి నెలా ఒక సినిమా లేదా సిరీస్ రిలీజ్ చేస్తామని తెలిపారు. అవి తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని అన్నారు. వీటి ద్వారా పలువురు కొత్త డైరెక్టర్స్ పరిచయం కాబోతున్నట్లు వెల్లడించారు.
కాగా, 90 మిడిల్ కాస్ వెబ్‌సిరీస్‌లో శివాజీ, వాసుకి, మౌళి, వాసంతిక, రోహన్ రాయ్, స్నేహల్ తదితరులు నటించారు. సురేష్ బొబ్బలి సంగీతం అందించారు. శ్రీధర్ సోంపల్లి - ఎడిటింగ్, అజాజ్ మహ్మద్ - సినిమాటోగ్రఫీ, ఆదిత్య హాసన్ - రచనం అందించారు.
'9వ తరగతి వరకు చెప్పులు లేకుండానే - వాటిని భరించలేక ఇండస్ట్రీకి వచ్చా'
సుకుమార్ - అల్లు అర్జున్ మధ్య విభేదాలు? - ఇది అసలు మ్యాటర్! - Pushpa 2 Shooting