ETV Bharat / entertainment

మహేశ్​ను నమ్రత ముద్దుగా ఏమని పిలుస్తారో తెలుసా? - Mahesh babu Namratha - MAHESH BABU NAMRATHA

Mahesh Babu Namratha : సూపర్ స్టార్ మహేశ్​ బాబును ఆయన సతీమణి ప్రేమగా ఏమని పిలుస్తారో తెలుసా? దాని గురించే ఈ కథనం.

.
.
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 29, 2024, 6:24 PM IST

Updated : Apr 29, 2024, 7:05 PM IST

Mahesh Babu Namratha : చాలా మంది ప్రేమికులు పెళ్లికి ముందు రకరకాల ముద్దు పేర్లతో పిలుచుకుంటారు. పెళ్లయ్యాక కూడా కొంతమంది అలానే పిలుచుకుంటుంటారు. అలానే సూపర్ స్టార్ మహేశ్​ బాబు భార్య నమ్రతా శిరోద్కర్​ కూడా తన భర్తను ఇప్పటికీ ముద్దు పేరు పెట్టే పిలుస్తుందట. అవును ప్రేక్షకులకు మిల్క్ బాయ్ అయిన మహేశ్​కు ఓ స్వీట్​ నేమ్​ పెట్టుకుందట ఆమె. ఓ సినిమా ఈవెంట్లో భాగంగా స్వయంగా నమ్రతానే ఈ విషయాన్ని చెప్పుకొచ్చినట్లు బయట కథనాలు ఉన్నాయి.

వివరాల్లోకి వెళితే - మహేశ్​ బాబు నమ్రతది ప్రేమ విహాహం. అంతేకాదు మహేశ్​ కన్నా నమ్రత వయసులో కాస్త పెద్దది అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఎప్పుడూ సైలెంట్​గా సింపుల్​గా కనిపించే మహేశ్​ బాబు ప్రేమించి పెళ్లి చేసుకోవడం అప్పట్లో చాలామందికి షాకింగ్​గా అనిపించింది. బీ.గోపాల్ దర్శకత్వం వహించిన వంశీ సినిమాలో మహేశ్​, నమ్రతాలు కలిసి నటించారు. ఈ చిత్రం షూటింగ్ సమయంలో వీళ్లిద్దరికీ ఒకరిపై ఒకరికి ఇష్టం ఏర్పడింది. అనంతరం ప్రేమగా మారింది.

ఆ తర్వాత ఐదేళ్ల పాటు చాలా రహస్యంగా ప్రేమించుకున్న ఈ జంట 2005, ఫిబ్రవరి 10న వివాహం చేసుకున్నారు. ఇక పెళ్లి తర్వత నమ్రతా సినిమాల్లో నటించడం మానేశారు. ఈ క్యూట్ కపుల్​కు ఇప్పుడు ఇద్దరు పిల్లలు. కొడుకు గౌతమ్ సినిమాల్లోకి వస్తారో రారో తెలియదు కానీ కూతరు సితార మాత్రం సోషల్ మీడియాలో డ్యాన్స్​, యాక్టింగ్​తో ఎప్పుడూ యాక్టివ్​గా ఉంటారు. సినిమాలతో ఎప్పుడూ బిజిబిజీగా ఉండే ఈ సూపర్ స్టార్ తన ఫ్యామిలీ టైమ్​ను అస్సలు మిస్ చేసుకోరు. వారి కోసం తప్పనిసరిగా సమయం కేటాయిస్తారు. బ్రేక్ దొరినిప్పుడల్లా భార్యా పిల్లలతో కలిసి మంచి ట్రిప్ ప్లాన్ చేస్తుంటారు.

అయితే చాలా సందర్బాల్లో మహేశ్​ తమతో ఎలా ఉంటారో చెబుతుంటారు నమ్రతా. అలా ఓ సారి తాను మహేశ్​ను ముద్దుగా ఏమని పిలుస్తారో చెప్పారు. ప్రేమగా తాను బేబీ అని పిలుచుకుంటారట. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

ఇకపోతే మహేశ్ సినిమాల విషయాలనికొస్తే - రీసెంట్​గా గుంటూరు కారం సినిమాతో మాస్ లుక్​తో ప్రేక్షకులను మెప్పించిన ఆయన ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళితో కలిసి ఓ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతానికి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ చిత్రం గురించి ఎలాంటి వివరాలు అఫీషియల్​గా రాలేదు.

మాట నిలబెట్టుకున్న శ్రీలీల - ఆ స్టార్ హీరో సినిమాకు నో! - Vijay Thalapathy Sreeleela

రెండో బాయ్​ఫ్రెండ్​తో బ్రేకప్​ - శ్రుతిహాసన్​ అందుకే స్పందించలేదా? - Shruti Hassan Sanatanu Hazarika

Last Updated : Apr 29, 2024, 7:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.